E-Paper
Advertisement

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సాగర్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. అంతమాట అన్నావేంటి బ్రో..

‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సాగర్ పై రామ్ చరణ్ ఫ్యాన్స్ ఫైర్.. అంతమాట అన్నావేంటి బ్రో..
Advertisement

Peddi Movie : టాలీవుడ్ స్టార్ హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వంలో వచ్చిన మూవీ పెద్ది. భారీ అంచనాలతో జూన్ 4న థియేటర్లలో రిలీజ్ అయింది.. ఈ సినిమా కోసం మెగా అభిమానులతో పాటుగా మూవీ లవర్స్ కూడా ఎంతగానో వెయిట్ చేశారు. మొత్తానికి సినిమా అయితే థియేటర్లలోకి వచ్చేసింది.. మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ టాక్ అనేది కొంచెం తగ్గినట్లు కనిపిస్తుంది. ఒక వర్గం ప్రేక్షకులను ఈ సినిమా బాగా ఆకట్టుకుంటే, మరొక వర్గం ప్రేక్షకులను మాత్రం సినిమా అంతగా ఆకట్టుకోలేదని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే ఈ సినిమాపై ఒక్కొక్కరు ఒక్కోలా రివ్యూ ఇస్తూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు.. తాజాగా బుల్లితెర హీరో ఇల్లు ఇల్లాలు పిల్లలు సాగర్ ఈ సినిమాపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై రామ్ చరణ్ ఫాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి సాగర్ ఏం చెప్పాడు? ఎందుకు ఫాన్సు కోపంగా ఉన్నారు అన్నది ఇప్పుడు మనం ఒకసారి వివరంగా తెలుసుకుందాం..

నాకు ‘పెద్ది ‘ మూవీ అస్సలు నచ్చలేదు..

Advertisement

ప్రముఖ తెలుగు ఛానెల్ స్టార్ మాలో ప్రసారం అవుతున్న టాప్ రేటింగ్ సీరియల్స్ లలో ఒకటి ఇల్లు ఇల్లాలు పిల్లలు. ఇందులో రామరాజు రెండవ కొడుకు పాత్రలో నటిస్తున్నాడు సాగర్.. నేను అసలు పేరు రఫీక్ష. ఇతను రామ్ చరణ్ పెద్ది మూవీ పై తనదైన స్టైల్లో రివ్యూ ఇచ్చాడు. అది పాజిటివ్ గా లేకపోవడంతో రామ్ చరణ్ అభిమానులు అతని పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రఫీ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా పెద్ది మూవీ పై రివ్యూ ఇచ్చారు. దానిపై మెగా చర్చ నడుస్తుంది.. అసలు ఇతను పోస్ట్ లో ఏముందంటే.. ‘నా మూడ్ బాలేదని సినిమాకి వెళ్తే.. సినిమా కూడా బాలేదు’ అని ఓ పోస్ట్ పెట్టి.. నిరుత్సాహంగా, ఏదో కోల్పోయినట్టుగా ఉన్న ఒక వీడియోను షేర్ చేశాడు. అది కాస్త వైరల్ అవ్వడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ నువ్వు చూసింది పెద్ది సినిమానేనా? లేదా ఇంకేదైనా చూసావా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. మొత్తానికి సాగర్ పోస్ట్ పై మెగా ఫ్యాన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. మరి దీనిపై సాగర్ అలియాస్ రఫిక్ష ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి..

6 నెలలు కరువులో ఉన్న టాలీవుడ్..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి సమ్మర్ కి సినిమాల సందడి బాగానే ఉంటుంది.. అయితే ఈ మధ్య మాత్రం కాస్త చేంజ్ అయ్యింది. ఆర్నెళ్లుగా టాలీవుడ్ యమా కరువులో ఉంది.. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఆ తర్వాత వచ్చిన ప్రతి సినిమా కూడా ఏదో మొక్కుబడిగా వచ్చినట్లే ఉంది కానీ, బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేలా మాత్రం దాని స్టోరీ లేదని జనాల్లో వినిపిస్తుంది.. అలాంటిది ఇప్పుడు పెద్ది జనాల్లో ఆశని తిరిగి తీసుకుని వచ్చింది.. ఒకవైపు టాక్ బోరింగ్ అనిపించడా మరోవైపు మాత్రం సినిమా మైండ్ బ్లాక్ అంటూ రివ్యూలు వస్తున్నాయి.. మరి తీసి పడేసి అంత సినిమా కాకపోయినా కూడా రామ్ చరణ్ క్రేజ్ వల్ల ఈ సినిమాను చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే ‘పెద్ది’ చిత్రానికి నెగిటివిటీ కంటే పాజిటివిటీనే ఎక్కువ ఉంది. ఇక ఈ నెలలో స్టార్ హీరో సినిమాలు ఒక్కొక్కటిగా రిలీజ్ కాబోతున్నాయి.. మరి ఆ సినిమాలైనా కూడా నెగిటివిటీని కాకుండా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ ను కొల్లకొడతాయేమో చూడాలి..

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×