E-Paper
Advertisement

డాక్టర్ బాబు కెరీర్ ను మార్చిన సీరియల్.. జీవితాన్నే ఇచ్చిందంటూ!

డాక్టర్ బాబు కెరీర్ ను మార్చిన సీరియల్.. జీవితాన్నే ఇచ్చిందంటూ!
Advertisement

Nirupam Paritala: బుల్లితెర నటుడుగా ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని ప్రస్తుతం ఇండస్ట్రీలో పలు సీరియల్స్ చేస్తూ మరోవైపు నిర్మాతగా సీరియల్స్ నిర్మిస్తూ బిజీగా ఉన్న వారిలో నిరుపమ్ పరిటాల ఒకరు. ఈయన చంద్రముఖి అనే సీరియల్ ద్వారా పరిచయమయ్యారు. అనంతరం మూగమనసులు, కుంకుమపువ్వు ,కార్తీకదీపం, వంటి ఎన్నో సీరియల్స్ చేసి నటుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇక వెండి తెరపై కూడా పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన నిరుపమ్ ప్రస్తుతం బుల్లితెరకు మాత్రమే పరిమితమయ్యారు.

నాన్న ద్వారానే మొదటి సీరియల్ ఛాన్స్..

ఇక కార్తీకదీపం సీరియల్ ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంత చేసుకున్న ఈయన అందరికీ డాక్టర్ బాబుగా గుర్తుండిపోయారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నిరుపమ్ వ్యక్తిగత విషయాలతో పాటు వృత్తిపరమైన అంశాల గురించి కూడా చర్చించారు. ఇందులో భాగంగానే తన మొదటి సీరియల్ చంద్రముఖి (Chandramukhi) గురించి నిరుపమ్(Nirupam) మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చంద్రముఖి సీరియల్ అనేది మా నాన్న ఫ్రెండ్స్ ద్వారానే నాకు అవకాశం వచ్చింది అని తెలిపారు. ఆర్క మీడియాలో ఈ సీరియల్ ప్రారంభమైంది. ఆర్కమీడియాలో నాన్న క్లోజ్ ఫ్రెండ్ పనిచేసే వారు ఆయన ద్వారా నాకు ఈ సీరియల్ ఛాన్స్ వచ్చిందని తెలిపారు.

చంద్రముఖి సీరియల్ కు నిరుపమ్ కండిషన్..

Advertisement

నిజానికి ఈ సీరియల్లో ఛాన్స్ వచ్చినప్పుడు నాకు నటించాలని లేదు నేను సినిమాలలోకి వెళ్లాలనుకున్నాను కానీ ఇలా సీరియల్స్ లోకి వెళ్లడం ఏంటి అని ఆలోచించాను. అయితే ఆ సమయంలో నాన్న ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తి ఆర్క మీడియా అనేది రాఘవేంద్రరావు బంధువులదే నువ్వు ఆయన కంట్లో పడితే సినిమా అవకాశాలు కూడా వస్తాయని నాకు బ్రెయిన్ వాష్ చేసి సీరియల్ చేసే అవకాశాన్ని ఇచ్చారు. అయితే ఈ సీరియల్ కు తాను ఒకటే కండిషన్ పెట్టానని నిరుపమ్ తెలిపారు.

రాఘవేంద్రరావు బ్లెస్సింగ్స్ తోనే..

Advertisement

తాను మొదటి రోజు షూటింగ్లో భాగంగా రాఘవేంద్రరావు గారిని కలవాలని కండిషన్ పెట్టాను అందుకు అనుగుణంగానే వారు కూడా రాఘవేంద్రరావు గారి దగ్గరికి తీసుకెళ్లి ఆయనతో మాట్లాడించి తన బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత షూటింగ్ లొకేషన్ లోకి వచ్చామని తెలిపారు. ఈ సీరియల్ చాలా మంచి సక్సెస్ అయిందని, చంద్రముఖి సీరియల్ నాకు నటుడిగా మంచి గుర్తింపుని తీసుకు వచ్చింది అలాగే ఈ సీరియల్ నాకు ఒక భార్యను, కొడుకును కూడా ఇచ్చింది అంటూ నిరుపమ్ చంద్రముఖి సీరియల్ తన జీవితంలో ఎంత ప్రత్యేకమో ఈ సందర్భంగా తెలియజేశారు. ఇక ఈ సీరియల్ సమయంలోనే మనుషులతో తనకు పరిచయం ఏర్పడటం ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉండడమే కాకుండా, వృత్తిపరమైన జీవితంలో కూడా బిజీగా గడుపుతున్నారు.

Also Read: యూట్యూబ్ సంపాదన…వందల కోట్ల ఆస్తుల పై డాక్టర్ బాబు రియాక్షన్..ఏమన్నారంటే?

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×