E-Paper
Advertisement

యూట్యూబ్ సంపాదన…వందల కోట్ల ఆస్తుల పై డాక్టర్ బాబు రియాక్షన్..ఏమన్నారంటే?

యూట్యూబ్ సంపాదన…వందల కోట్ల ఆస్తుల పై డాక్టర్ బాబు రియాక్షన్..ఏమన్నారంటే?
Advertisement

Nirupam Paritala: నిరుపమ్ పరిటాల అనే పేరుతో కాకుండా కార్తీక్ లేదా డాక్టర్ బాబుగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న నిరుపమ్ నిర్మాతగా కొనసాగుతూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈయన పొదిరిల్లు అనే సీరియల్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అలాగే కార్తీకదీపం 2 సీరియల్ కూడా నటిస్తూ బిజీగా ఉన్నారు. శ్రీవల్లి అనే పేరుతో బట్టలు బిజినెస్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా గడుపుతున్న డాక్టర్ బాబు తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన వృత్తిపరమైన విషయాలతో పాటు వ్యక్తిగత విషయాల గురించి కూడా అభిమానులతో పంచుకున్నారు.

యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న డాక్టర్ బాబు..

ఈ నేపథ్యంలోనే డాక్టర్ బాబుకు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి అంటూ వస్తున్న వార్తల గురించి అలాగే యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. ఇటీవల కాలంలో ఎంతో మంది సెలబ్రిటీలు ఒకవైపు సినిమాలు సీరియల్స్ చేస్తూనే మరోవైపు యూట్యూబ్ ఛానల్ కూడా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే నిరుపమ్ పరిటాల తన భార్యతో కలిసి ఒక యూట్యూబ్ ఛానల్ నిర్వహించారు. ఇందులో వారికి సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు..

ఎలాంటి నెగిటివిటీ రాలేదు..

Advertisement

ఇలా యూట్యూబ్ ఛానల్ రన్ చేయడం గురించి అలాగే ఈ వీడియోలపై వచ్చే నెగెటివిటీ గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన సమయంలో కాస్త డౌట్ గానే ప్రారంభించాము ఏమైనా నెగెటివిటీ వస్తుందా అని ఆలోచించాను. అయితే మనం వారికి ఎలాంటి కంటెంట్ ఇస్తామో వారి నుంచి కూడా అలాంటి స్పందన వస్తుందని ఈయన తెలియజేశారు. ఇప్పటివరకు మాకు అయితే ఎలాంటి నెగెటివిటీ రాలేదని నిరుపమ్ పరిటాల తెలియజేశారు. ఇక ఇంటర్వ్యూలో భాగంగా ఈయన మాత్రం యూట్యూబ్ సంపాదన గురించి ఎక్కడ బయటపడలేదు.

శోభన్ బాబుతో పోల్చడం సంతోషం..

Advertisement

నిరుపమ్ పరిటాల , మంజుల పేరు మీద వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి అంటూ ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తల గురించి కూడా స్పందించారు అలాంటి వార్తలను తాను కూడా చూశానని, అలాంటి న్యూస్ వచ్చినప్పుడు నవ్వుకోవడం తప్ప ఇంకేమీ చేయలేను ఒక్కోసారి అనిపిస్తుంది ఆ వార్తలు రాసినోడు కనీసం సగం ఆస్తి అయినా ఇస్తే బాగుండు కదా అనిపిస్తుందని నిరుపమ్ ఈ సందర్భంగా తన ఆస్తుల గురించి వస్తున్న వార్తలపై కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక తనని బుల్లితెర శోభన్ బాబు అని పిలవడం చాలా సంతోషంగా అనిపించిందని, ఆయన అందగాడు మంచి టాలెంట్ ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తితో పోల్చడం మంచి విషయమే కదా అంటూ నిరుపమ్ పరిటాల తన సంతోషాన్ని వ్యక్తపరిచారు.

Also Read: కార్తీక దీపం సీరియల్ కు నిరుపమ్ మొదటి ఎంపిక కాదా..అలా ఛాన్స్ వచ్చిందా!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×