E-Paper
Advertisement

లవ్ అనేది వ్యాధి.. బ్రేకప్ పై నూకరాజు ఎమోషనల్ కామెంట్స్!

లవ్ అనేది వ్యాధి.. బ్రేకప్ పై నూకరాజు ఎమోషనల్ కామెంట్స్!
Advertisement

Kissik Talks on Nookaraju: కమెడియన్ నూకరాజు తోటి లేడీ కమెడియన్ ఆసియా ఏంజెల్ (Asiya Angel)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. త్వరలోనే ఈ జంట పెళ్లి కూడా చేసుకోబోతున్నారు. ఇలాంటి సమయంలో నూకరాజు లవ్, బ్రేకప్ పై చేసిన కామెంట్లు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి. తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా వచ్చిన నూకరాజు (Nookaraju) అందులో లవ్ , బ్రేకప్ గురించి కామెంట్లు చేశారు.

లవ్, బ్రేకప్ పై నూకరాజు ఎమోషనల్ కామెంట్స్..

“కొంతమంది లవ్ చేసి పెళ్లి వరకు రావాలంటే ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది” అని వర్ష మాట్లాడుతుండగానే.. నూకరాజు స్పందిస్తూ.. “ప్రేమ పెళ్లి వరకు రావాలంటే అమ్మాయి స్ట్రాంగ్ గా ఉంటే చాలు. ఆ ప్రేమ కచ్చితంగా పెళ్లి వరకు వస్తుంది. మధ్యలో ఏదైనా ఉంటే మనకు తెలియదు కానీ.. నిజాయితీగా ప్రేమించిన ఏ అబ్బాయి అయినా సరే పెళ్లి వరకు వస్తాడు. ఇప్పుడు ఆడపిల్లలకి ఎలా ఉంటుందంటే.. పేరు, పరువు, కులం, మతం ఇలా ఇవన్నీ దాటుకొని వచ్చిన తర్వాత .. మేము సూసైడ్ చేసుకుంటాం అని అమ్మానాన్న బెదిరించడం, ఇలాంటివన్నీ అమ్మాయికి ఉంటాయి. అవన్నీ దాటుకొని, వాటన్నింటిని ఎదుర్కొని, అమ్మాయి గనుక నిలబడితే నిజాయితీగా ప్రేమించిన అబ్బాయి ఖచ్చితంగా తన చేయి పట్టుకొని ఎప్పటికీ వదలడు.

Advertisement

also read:ఆసియాతో పెళ్లి అప్పుడే.. నూకరాజు క్లారిటీ!

ప్రేమించేముందు అవన్నీ ఆలోచించాలి – నూకరాజు

అంతెందుకు ఆసియా కి కూడా ఇలాగే జరిగింది. తను కూడా ఎన్నో షోలలో చెప్పింది. అమ్మాయి విషయంలో పేరెంట్స్ గురించి కూడా ఆలోచించాలి. అయితే అది ఎప్పుడు ఉండాలి.. ఒక అబ్బాయిని లవ్ చేసే ముందే ఉండాలి..
ఒకరిని ప్రేమించే ముందు నువ్వేంటి? నీ బ్యాగ్రౌండ్ ఏంటి? నీ పేరెంట్స్ ఒప్పుకుంటారా ? లేదా? ఇలా ప్రతి విషయాన్ని ఆలోచించాకే.. ఆ తర్వాత ప్రేమించాలి. ఇవన్నీ ఆలోచించకుండా ఒకరి జీవితంలోకి వచ్చేసి ఏడు, ఎనిమిది సంవత్సరాలు ప్రేమించుకున్నాక ఇప్పుడు నాకు కష్టాలు గుర్తొస్తున్నాయి.. మతాలు గుర్తొస్తున్నాయి అంటూ ఎవరైనా అంటే వారి చెంపపై కొట్టాలి” అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.

చాలామంది అమ్మాయిలు కోసమే సూసైడ్ చేసుకుంటారు – నూకరాజు

Advertisement

“చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు కోసమే సూసైడ్ చేసుకుంటారు. నిజంగా ప్రేమించి విడిపోయాక ఆ బాధ నరకంగా అనిపిస్తుంది. చావుకి , బ్రతుక్కి మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు. ప్రేమిస్తే పెళ్లి వరకు వెళ్లాలి. లేదంటే ప్రేమ జోలికి వెళ్ళకూడదు. ఎక్కువగా బ్రేకప్ అవ్వడానికి కారణం ఈగో అయితే. మరో కారణం పేరెంట్స్ కూడా. ఎంతోమంది మిడిల్ క్లాస్ నుంచీ వస్తారు. ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో.. ప్రేమ అనే వ్యాధి ఒకటి వారిని వెంటాడుతుంది. ప్రేమలో మోసపోయి తట్టుకోలేక చాలామంది సూసైడ్ చేసుకుంటారు. ప్రేయసి వల్ల వాడు చనిపోతే.. వాడు చనిపోవడం వల్ల వాడిపై ఆధారపడిన ఫ్యామిలీలు రోడ్డున పడతాయి. మీకు ఆ ఉద్దేశం ఉంటే లవ్ అనే పదాన్ని వాడకండి. ప్రేమ అనేది ఒక పవిత్రమైనది. దానికి ఒక చరిత్ర ఉంది. ఆ ప్రేమను దయచేసి దిగజార్చకండి. అబ్బాయి అయినా.. అమ్మాయి అయినా పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉండి , ఎంత కష్టాన్ని అయినా ఓర్చుకోగలం అనే నమ్మకం ఉంటేనే ప్రేమించండి. లేకపోతే దూరంగా ఉండండి ” అంటూ తన మాటగా చెప్పుకొచ్చారు నూకరాజు.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×