E-Paper
Advertisement

మంజుల డాక్టర్ బాబు కంటే సీనియర్ నా…తనతో పరిచయం, ప్రేమ పై ఓపెన్ అయిన నిరుపమ్ !

మంజుల డాక్టర్ బాబు కంటే సీనియర్ నా…తనతో పరిచయం, ప్రేమ పై ఓపెన్ అయిన నిరుపమ్ !
Advertisement

Nirupam Paritala: బుల్లితెర నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటుడు నిరుపమ్ పరిటాల(Nirupam Parital) ప్రస్తుతం పలు బుల్లితెర సీరియల్స్ లో నటిస్తూ, అలాగే సీరియల్స్ నిర్మిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన భార్యతో మొదటి పరిచయం, ప్రేమ, పెళ్లి గురించి పలు విషయాలను తెలియచేశారు. నిరుపమ్ చంద్రముఖి అనే సీరియల్ ద్వారా బుల్లితెర నటుడిగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సీరియల్ తనకు మొదటి సీరియల్ కావటం విశేషం. ఇక తన భార్య మంజుల సైతం చంద్రముఖి సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇది తెలుగులో ఆమెకు ఫస్ట్ సీరియల్.

నటనలో నాకంటే మంజుల సీనియర్..

తెలుగులో మంజులకు ఇది ఫస్ట్ సీరియల్ అయినప్పటికీ కన్నడలో మాత్రం ఆమె అప్పటికే పలు సీరియల్స్ లో నటించిందని నటన విషయంలో ఆమె నాకంటే సీనియర్ అని నిరుపమ్ తెలిపారు. ఇక ఆర్క మీడియాలో ఈ సీరియల్ షూటింగ్ జరిగింది అయితే అప్పటికే ఆర్క మీడియా కన్నడలో ఒక సీరియల్ చేయడంతో అక్కడ మంచి సక్సెస్ కావడం వల్లే మంజులను ఈ సీరియల్ లో తీసుకున్నారని నిరుపమ్ తెలిపారు. ఇక ఈ సీరియల్ టైంలోనే మా ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడటం అది కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు వెళ్లిందని తెలిపారు.

చిన్న వయసులోనే కుటుంబ బాధ్యతలు..

Advertisement

ఈ సీరియల్ షూటింగ్ ప్రారంభమైన ఏడాది పాటు మాకు పెద్దగా మాటల్లేవని తెలిపారు. అయితే ఆమెకు తెలుగు రాదు. ఏదైనా మాట్లాడుకోవాలి అంటే ఇంగ్లీష్ లోనే మాట్లాడుకునే వాళ్ళం అలాగే తనకు తెలుగు డైలాగ్స్ గురించి ఏదైనా డౌట్స్ వస్తే తానే చెప్పేవాడినని నిరుపమ్ తెలిపారు. అయితే ఏడాది తర్వాత మేమిద్దరం ఒకరి ఫోన్ నెంబర్స్ ఒకరు మార్చుకున్న తర్వాతనే అసలు కథ మొదలైందని తెలిపారు. మంజుల కూడా అచ్చం నాలాగే ఆలోచిస్తుంది నేను ఎలాగైతే కుటుంబ బాధ్యతలను చిన్న వయసులో తీసుకున్నానో తను కూడా అలాగే కుటుంబ బాధ్యతలను తీసుకోవడం నాకు బాగా నచ్చిందని తెలిపారు.

పెళ్లి కోసం పెద్దగా కష్టపడలేదు..

Advertisement

మంజుల వాళ్ళు నలుగురు సిస్టర్స్ అయినప్పటికీ చిన్న వయసులోనే ఈమె తన కుటుంబ బాధ్యతలను తీసుకోవడంతో మంజులపై ఒక మంచి అభిప్రాయం ఏర్పడిందని తెలిపారు. ఇక ఫోన్ నెంబర్స్ మార్చుకున్న తర్వాత మా ఇద్దరి మధ్య బాండింగ్మరింత బలపడింది. అయితే ఇది కరెక్ట్ ఆ కాదా అని తెలుసుకోవడం కోసం కొద్దిరోజులు మేము అసలు ఫోన్ మాట్లాడుకోలేదు, మాకనిపించినవన్నీ ఒక పేపర్లో రాసి చెక్ చేసుకున్నాము ఇలా ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి అయ్యేవరకు మాట్లాడుకోలేదు. అప్పుడే మేమిద్దరం ఒకరికొకరు కరెక్ట్ అనిపించింది ఆ తర్వాత పేరెంట్స్ కి చెప్పడం పెళ్లికి ఒప్పించడం జరిగిందని నిరుపమ్ తెలిపారు. ఇలా ఫోన్ కాల్స్ మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మకు అనుమానం వచ్చి నన్ను అడిగితే చెప్పాను. తనని తీసుకు రమ్మని చెప్పింది. అమ్మకు కూడా బాగా నచ్చింది. మా పెళ్లి కోసం పేరెంట్స్ ని ఒప్పించడం పెద్ద కష్టమేమీ కాలేదు అంటూ నిరుపమ్ తెలిపారు.

Also Read: డాక్టర్ బాబు కెరీర్ ను మార్చిన సీరియల్.. జీవితాన్నే ఇచ్చిందంటూ!

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×