E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మను, రణవీర్‌లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అమర్‌

Nindu Noorella Saavasam Serial Today September 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మను, రణవీర్‌లను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న అమర్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఆశ్రమానికి బయలుదేరిన మనోహరి కారు పంక్చర్ అవుతుంది. దీంతో స్టెపినీ మార్చడానికి మను నానా తంటాలు పడుతుంది.  ఆరు కారు ముందు బానట్‌ పై కూర్చుని నవ్వుకుంటుంది. చిత్ర మాత్రం పక్కన నిలబడి ఫోన్‌లో ఏదో చూస్తుంది. చూస్తూనే.. సూపర్‌.. సూపర్‌ అంటుంది. దీంతో మను ఇరిటేటింగ్‌ గా చిత్ర నేను ఒక్కదాన్ని ఇక్కడ కష్టపడుతుంటే.. నువ్వు హెల్ఫ చేయకుండా ఏం చేస్తున్నావు.. అని అడుగుతుంది. దీంతో చిత్ర నా షాపు సీసీ కెమెరా లాగిన్‌ చేసి లైవ్‌ చూస్తున్నాను మను. షాపుకు జనం కుప్పలుకుప్పలుగా వస్తున్నారు మను అని చెప్పగానే..మను కోపంగా మనం వచ్చిన పనేంటి నువ్వు చేస్తున్న పనేంటి..? షాపును చూసుకోవడానికి వినోద్‌ ఉన్నాడు కదా..? నువ్వు వచ్చి హెల్ప్‌ చేయోచ్చు కదా..? అంటుంది.

దీంతో చిత్ర అంటే ఆల్‌రెడీ టైర్‌ మార్చేశావు కదా..? ఇంక నేనేం చేయాలి అంటుంది. ఏం చేయాలి నేనేదో డ్రైవర్‌ లాగా నువ్వేదో ఓనర్ లాగా మాట్లాడుతున్నావు అంటుంది మను. ఆరు నవ్వుకుంటూ.. ఫ్రెండ్స్‌ ను ఫ్రెండ్స్‌ లాగా కాకుండా శత్రువులా చూస్తే ఇలాగే ఉంటుంది. నా లాంటి మంచిదాన్ని కాదని ఈ చిత్రతో ఫ్రెండ్షిప్‌ చేశావు కదా నీకు ఇలాగే ఉంటుంది అనుభవించు అంటూ ఆరు తిడుతుంది. అది కాదు మను ఇప్పటికే నీ చేతులకు అదిగో అక్కడున్న మట్టి, గ్రీసు అన్ని పూసుకున్నావు మళ్లీ నా చేతులకు ఎందుకు అంటించుకోవడం అని అంటుంది చిత్ర. దీంతో అంతా నీ దరిద్రపు గొట్టు గొంతు వల్లే వచ్చింది. లేదంటే హాయిగా వెళ్లిపోయేవాళ్లం.. అంటుంది మను.

Advertisement

దీంతో చిత్ర కోపంగా నా వల్ల కాదు మను అంతా ఆదిగో ఆ ఆత్మ వల్ల వచ్చింది. ఒసేయ్‌ అరుంధతి నువ్వసలు ఫ్రెండువేనా..? ఫ్రెండ్స్‌ను ఇంతలా ఇబ్బంది పెడతావా..? ఇందుకేనా నువ్వు తొందరగా చచ్చావు.. ఇంకా ఇక్కడే నువ్వు దెయ్యంలా తిరగుతున్నావా..? అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు.. నీ భర్త, భాగీ, పిల్లలు సంతోషంగా ఉండటం చూసి హ్యాపీగా ఉన్నావేంటి..? చెప్పు.. అది మూణ్నాళ్ల ముచ్చటే అమ్మ అతి త్వరలో మను నీ చెల్లెలు భాగీని కూడా నీ దగ్గరకు పంపించేస్తుంది. ఆ తర్వాత అమరేంద్రను పెళ్లి చేసుకుని మను హ్యాపీగా ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావు.. కుళ్లి కుళ్లి చచ్చిపోతావా..? ఆల్ రెడీ నువ్వు చచ్చిపోయావు కదా..? ఇంకెందుకు నీకు ఈ కుళ్లు అసూయ చెప్పు అంటూ మాట్లాడుతుంటే..

మను కోపంగా ఆపవే ఆరు నిజంగా ఇక్కడే ఉంటే ఈసారి పంక్చర్‌ కాదు ఏకంగా  పెద్ద యాక్సిడెంటే చేయిస్తుంది. ఈ కారుతో పాటు మనం కూడా ముక్కలు ముక్కలు అయిపోతాం అనగానే.. చిత్ర భయంగా ఆత్మకు అంత శక్తి ఉంటుందా..? అని అడుగుతుంది. ఎంత శక్తి ఉంటుందో నీకు తెలియదులే.. నాకు బాగా తెలుసు..పద వెళ్దాం అంటూ ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు.

Advertisement

మరోవైపు అమర్‌, మిస్సమ్మ, రాథోడ్‌ ముగ్గురు కలిసి రణవీర్‌ ఇంటికి వెళ్తారు. రణవీర్‌ ఆత్రుతగా అమరేంద్ర గారు మీరే వచ్చారు. నా పాప ఎక్కడండి అని అడుగుతాడు. దీంతో మీ పాప అదిగో అని అమర్ చెప్పగానే.. ఆశ్రమం వార్డెన్‌ సిరిని తీసుకుని లోపలికి వస్తుంది. సిరిని చూసిన రణవీర్ ఆనందంతో థాంక్స్‌ చెప్తాడు. ఇంతలో సిరి కూడా డాడీ అనుకుంటూ రణవీర్‌ దగ్గరకు వెళ్తుంది. సిరిని దగ్గరకు తీసుకుని ఎమోషనల్ అవుతున్న రణవీర్‌ పాప అంటూ హగ్‌ చేసుకుంటాడు. ఇంతలో అమర్‌ ఓకే రణవీర్‌ నీ పాపను నీ దగ్గరకు చేర్చేశాము ఇక మేము బయలుదేరుతాం అంటూ అమర్ వాళ్లు వెళ్లిపోతారు.

బయటకు వెళ్లిన అమర్‌ వాళ్లు మఫ్టీలో రణవీర్‌ ఇంటి మీద నిఘా పెడతారు. ఇంతలో ఆటోలో ముసుగు వేసుకున్న మను వస్తుంది. రణవీర్‌ ఇంట్లోకి వెళ్తుంది. అమర్‌ వాళ్లు వెంటనే.. రణవీర్‌ ఇంట్లో  పరుగెత్తుకుంటూ వెళ్తారు. అక్కడ రణవీర్‌, ముసుగులో ఉన్న మను లాయరు పాప ఉంటారు. అమర్‌ వాళ్లను చూసిన రణవీర్‌, మను షాక్‌ అవుతారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×