E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కోసం మనోహరి కొత్త ప్లాన్‌

Nindu Noorella Saavasam Serial Today September 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ కోసం మనోహరి కొత్త ప్లాన్‌
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  మనోహరి ఇంట్లోంచి బయపడుతూ బయటకు వచ్చి కారులో వెళ్లిపోతుంది. మను గమనించిన ఆరు ఈ మను ఎక్కడికి వెళ్తుంది. నాకేదో డౌటు కొడుతుంది. మనోహరి టెన్షన్‌గా వెళ్లిపోతుంది. నా చెల్లెలి ముఖంలో భయం.. మీ గొంతులో వణుకు  ఇదంతా చూస్తుంటే జరక్కూడదని ఏమైనా జరిగిందా..? అయ్యో గుప్త గారు చెప్పండి.. ఏం జరిగింది ఏం జరగబోతుంది. చెప్పండి.. అయ్యో దేవుడా..? నాకేంటి ఈ అగ్ని పరీక్ష అంటూ ఆరు కూడా టెన్షన్‌ పడుతుంది.

మరోవైపు రణవీర్‌ ఇంటికి వెళ్లిన మనోహరి టెన్షన్‌ పడుతూ వాటర్‌ తాగి అలాగే మౌనంగా ఉండిపోతుంది. రణవీర్‌ వచ్చి ఏమైంది మనోహరి అరుంధతి గురించి భాగీ అమరేంద్రకు చెప్పేసిందా అని అడుగుతాడు. లేదు అని మనోహరి చెప్పగానే.. థాంక్ గాడ్‌ యువర్‌ సేఫ్‌ అంటాడు దీంతో నో   అది చెప్పినా బాగుండు అనిపిస్తుంది రణవీర్‌ అంటుంది మనోహరి.. అదేంటి మనోహరి అమరేంద్రకు తెలిస్తే నీకు ప్రమాదం కదా..? అంటాడు రణవీర్‌. నాకు ప్రమాదమో కాదో అది అమరేంద్రతో చెప్పినప్పుడు కదా తెలిసేది అనగానే.. రణవీర్‌ ఎందుకు నీకు అంత కోపం అంటాడు రణవీర్‌. అది చెప్తుందా లేదా..? అని నైటుంతా టెన్షన్‌ తో చచ్చిపోతున్నాను. నరాలు తెగిపోతున్నాయి. హార్ట్‌ బీట్‌ పెరిగిపోతుంది. అక్కడ ఉంటే ఏ క్షణంలోనైనా హార్ట్‌ స్ర్టోక్‌ వచ్చే చచ్చిపోతానేమోనని భయం వేసి ఇక్కడికి వచ్చాను అంటుంది.

Advertisement

కూల్‌ మనోహరి ఇంత వరకు భాగీ చెప్పలేదంటే తనకు చెప్పే ఉద్దేశమే లేదేమో.. అంటాడు రణవీర్‌. దీంతో మనోహరి కోపంగా అసలు దానికి చెప్పే ఉద్దేశం ఉందో లేదో తెలియడం లేదే.. రాత్రి ఆరు ఫోటో చూసింది.. ఉదయం ఆరు ఆత్మను చూసింది. అయిన భాగీ నోరు విప్పడం లేదు.. అమర్‌ ఎంత అడిగినా చెప్పడం లేదు..అంటుంది మనోహరి. ఓకే ఓకే ఒకవేళ భాగీ అమరేంద్రకు చెప్పింది అనుకుందాం.. కానీ అమర్‌ నమ్ముతాడా అని డౌటుగా రణవీర్‌ అడగ్గానే.. నమ్ముతాడు. ఆరు ఆత్మ ఆ ఇంటి చుట్టూ తిరుగుతుందని అమర్‌కు ఒక స్వామిజీ చెప్పాడు అనగానే అమరేంద్ర నమ్మాడే అనుకో అప్పుడే అమర్‌ ఏం చేస్తాడు అంటూ రణవీర్‌ డౌటు క్రియేట్‌ చేయగానే.. భాగీతో ఆరును పిలిపించి మాట్లాడతాడు.  ఆరు చనిపోకముందు ఏం జరిగిందో నేను ఏం చేశానో చెప్తుంది అంటూ మనోహరి భయపడుతుంది.

అరుంధతి అలా చెప్పేదే అయితే అమరేంద్రకు ఎప్పడో చెప్పి ఉండాలి కదా..? భాగీకి తను ఆత్మగా రివీల్‌ అయిపోయింది కదా..? పైగా అరుందతి ఆత్మకు చాలా శక్తులు కూడా ఉన్నాయి.. ఘోర, చంభా, కాలా లాంటి వాళ్లను తిప్పికొట్టిన అరుంధతికి తనకు జరిగిన అన్యాయం గురించి ఇన్నాళ్లు భర్తకు చెల్లికి చెప్పకుండా ఎందుకు ఆగినట్టు..? అనగానే అది నాకు అర్థం కావడం లేదు.. అంటుంది మనోహరి. దీంతో రణవీర్‌  ఏదో కారణం ఉండి ఉంటుంది మనోహరి. అదే నీ గురించి అరుంధతి చెప్పకుండా ఆపుతుంది అంటాడు రవీన్‌. అవును ఏదో కారణం ఉంది.. ఏదై ఉండొచ్చు అంటుంది మనోహరి.. అది ఏదైనా  కావొచ్చు కానీ ప్రస్తుతానికి అదే నిన్ను ఇప్పుడు కాపాడుతుంది అంటాడు రణవీర్‌.  అదేంటో తెలుసుకుంటే నేను ఇంకా సేఫ్‌గా ఉంటాను కదా అంటుంది మనోహరి.

Advertisement

మనకు తెలియని కొన్ని ప్రశ్నలను కాలానికే వదిలేయాలి. కొన్ని ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్తుంది. అప్పటి వరకు నువ్వు వెయిల్‌ చేయాలి అనగానే.. అంటే ఏంటి..? అప్పటి వరకు నేను ఈ టెన్షన్‌ అనుభవిస్తూనే ఉండాలా..? ఒకవైపు ఆ సరస్వతి వార్డెన్‌ భాగీకి నా గురించి అంతా చెప్పేసింది.. ఇంకోవైపు తను చూస్తుంది మాట్లాడుతుంది మనిషి కాదు ఆత్మ అని భాగీకి తెలిసిపోయింది. ఇప్పుడు దాని చేతిలో రెండు ఆయుధాలు ఉన్నాయి… నేనేమో హెల్ఫ్‌ లెస్‌గా ఉన్నాను..అందుకే వెంటనే ఆరు ఆస్థికలు గంగలో కలిపేయాలి రణవీర్‌ అని చెప్తుంది.

ఆ ఇట్లో రెండు మూడు బ్యాడ్‌ ఇన్సిడెంట్స్‌ జరగాలంటే మన వల్ల అవుతుందా..? అంటూ రణవీర్‌ అనుమానం వ్యక్తం చేస్తాడు. అప్పుడే నా వల్ల అవుతుంది రణవీర్‌ అంటూ చంబా వస్తుంది. వెంటనే తన ప్లాన్‌ చెప్తుంది. అమర్‌ ఇంట్లోకి వెళ్లే పాలలోల పాసిజన్‌ కలుపుతుంది.. ఆ పాలు తీసుకెళ్లి మిస్సమ్మ కాపీ పెడుతుంది.  డోర్‌ చాటు నుంచి మనోహరి గమనిస్తూ ఉంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×