E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు ఘోర పూజలు – ఎలాగైనా కాపాడతానన్న గుప్త

Nindu Noorella Saavasam Serial Today September 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును బంధించేందుకు ఘోర పూజలు – ఎలాగైనా కాపాడతానన్న గుప్త
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంట్లో అందరూ భక్తితో గణపతి పూజ చేస్తుంటారు. విండోలోంచి ఆరు.. పూజను చూస్తుంది. ఇంతలో పూజ అయిపోయిందని మిస్సమ్మ హారతి ఇవ్వబోతుంటే అంజు నేను హారతి ఇస్తానని తీసుకుని అందరికీ హారతి ఇస్తుంది. బాంబు ఎప్పుడు పేలుతుందా..? అని బయట అరవింద్‌ టెన్షన్‌ పడుతుంటాడు. అమర్ కళ్ళు మూసుకుని దేవుడికి మొక్కుతూ బాంబు శబ్దం వింటాడు. అందరినీ నిశ్శబ్దంగా ఉండమని చెప్పి బాంబు కోసం వెతుకుతాడు.

బాంబును కనిపెట్టి డీయాక్టివేట్‌ చేసిన అమర్‌, రణవీర్‌

Advertisement

గణపతి విగ్రహంలో నుంచి సౌండ్‌ రావడంతో అమర్‌ విగ్రహాన్ని కదిలించబోతే భాగీ వద్దంటుంది. మొదటి రోజే కదిలించకూడదు అంటుంది. కానీ ఎవరు అరవొద్దని ఆ విగ్రహంలో బాంబు ఉందని చెప్పి అందరినీ బయటకు వెళ్లమంటాడు అమర్‌. అందరూ భయంగా బయటకు వెళ్లిపోతారు. రణవీర్‌ మాత్రం అక్కడే ఉండి సార్‌ మీకైమైన హెల్ప్ చేయమంటారా? అని అడుగుతాడు. వెళ్లి రెండు సిజర్లు తీసుకురా రణవీర్‌ అని అమర్‌ చెప్పగానే సిజర్లు తీసుకొస్తాడు రణవీర్‌. ఇద్దరం ఇకేసారి వైర్లు కట్‌ చేయాలని అమర్‌ చెప్పడంతో రణవీర్‌ సరే అంటాడు. ఇద్దరూ కలిసి బాండును డీయాక్టివేట్‌ చేస్తారు. తర్వాత బయటకు వచ్చి బాంబు డీయాక్టివేట్ అయిందని ఎవరూ భయపడొద్దని అందరికీ ధైర్యం చెప్తాడు అమర్‌. తర్వాత రణవీర్‌కు థాంక్స్‌ చెప్తాడు. బయట నుంచి అంతా వింటున్న అరవింద్‌ అక్కడి నుంచి ఎస్కేప్‌ అవుతాడు. రాథోడ్‌ అసలు విగ్రహంలోకి బాంబు ఎలా వచ్చిందని అనుమానిస్తాడు. రాథోడ్‌ మాటలకు మనోహరి టెన్షన్‌ పడుతుంది. మనోహరి ఆ విగ్రహం నేను చెప్పిన షాపు నుంచే తీసుకొచ్చావా? అని అమర్‌ అడగ్గానే అవును అమర్‌.. కానీ షాపు అతనే విగ్రహం కారులో పెట్టాడు అని చెప్తుంది. అమర్‌ ఇక అయిపోయింది కదా ఎవ్వరూ భయపడకండి లోపలికి వెళ్దాం పదండి అని అందరూ లోపలికి వెళ్లిపోతారు.

పౌర్ణమికి ఆరును యమలోకం తీసుకెళ్తానన్న గుప్త

Advertisement

గుప్త యమలోకం నుంచి కిందకు వస్తాడు. గుప్తతో మాట్లాడుతూ.. నువ్వు చేయాల్సిన పనేంటో గుర్తుంది కదా? అని అడుగుతాడు. గుర్తుంది ప్రభు అని చెప్తాడు గుప్త. ఆ బాలికకు ఇష్టము ఉంటేనే పైకి తీసుకురావాలని గుర్తు ఉంది అని గుప్త చెప్పగానే. ఆ అవకాశం ఈ పౌర్ణమికి నీకు రాబోతుంది. ఆ బాలికకు ఏం జరుగుతుందో తెలియక ముందే ఆమెను మన లోకానికి తీసుకొచ్చేయాలని చెప్తాడు. ఇంతలో ఆరు వస్తుంది. గుప్త పైకి చూసి మాట్లాడుతుండటాన్ని గమనించి.. రాజుగారు వచ్చి ఉంటారని ఆయనకు హాయ్ చెప్తుంది. దాంతో యముడు మాయం అయిపోతాడు. అదేంటి గుప్తగారు నేను హాయ్ చెప్తే ఆయన అలా వెళ్లిపోయారు.. వినిపించలేదా అని కోపంగా అడుగుతుంది. అలా మాయం అయిపోయారేంటి? అని అడుగుతుంది. దీంతో వినిపించింది కనుకే మాయమయ్యారు. ఆయన నా మాదిరిగా అమాయకుడు కాదు. చాలా తెలివైన వారు అంటాడు గుప్త. అబ్బో గ్యాప్‌ రాగానే మనిషి మాట బాగానే మారింది. అయినా ఏంటి మీరిద్దరు మీటింగ్‌ పెట్టారు. నన్ను పైకి తీసుకెళ్లే ప్లాన్‌ ఏమైనా చేశారా? అంటూ ఆరు అనుమానించడంతో గుప్త షాక్‌ అవుతాడు. మేము మాట్లాడుకున్నది విన్నదా ఏంటి? అని మనసులో అనుకుంటుంటే.. గుప్త గారు మరీ ఎక్కువ ఆలోచించకండి నేనేం వినలేదులే అంటూ అసలు ఈరోజు ఏం జరిగిందో మీకు తెలుసా? అంటూ బాంబు విషయం గుప్తకు చెప్తుంది ఆరు. అయితే పౌర్ణమి నాడు ఆరును బంధించేందుకు ఘోర ప్రయత్నిస్తున్నాడని.. వాడి నుంచి ఆరును కాపాడాలని మనసులో అనుకుంటాడు గుప్త.

Also Read: మహాకు వార్నింగ్‌ ఇచ్చిన మధు – మహాను అరెస్ట్‌ చేసేందుకు ఇంటికి వచ్చిన పోలీసులు

ఆరు ఆత్మను బంధిస్తానన్న ఘోర, ఆరును వదలనన్న మనోహరి

పూజలు చేస్తున్న ఘోర.. ఈ పౌర్ణమి నాడు ఆ ఆత్మను బంధిస్తాను అని తన గురువుకు చెప్తాడు. అదంత ఈజీ కాదని గురువు చెప్పడంతో నేనేంటో మీకు నిరూపిస్తాను గురూజీ అంటాడు ఘోర. మరోవైపు తన రూంలో ఉన్న క్యాలెండర్‌లో పౌర్ణమిని రౌండప్‌ చేసి ఈసారి నిన్ను వదలను అరుంధతి అని గట్టిగా అరుస్తుంది మనోహరి. అంతలోగా అక్కడికి వచ్చిన అమర్.. అరుంధతిని వదలను అని ఎందుకన్నావు అని ప్రశ్నించడంతో మనోహరి టెన్షన్‌ పడుతుంది. పౌర్ణమిని ఎందుకు రౌండప్‌ చేశావంటూ నిలదీయడంతో మనోమరి ఎమోషనల్‌ గా ఫీలవుతూ పౌర్ణమి రోజు పూజ చేస్తే ఆరు ఆత్మ శాంతిస్తుందని పూజారి చెప్పారు అందుకే మార్కు చేశాను. ఇక ఆరు నన్ను వదిలివెల్లినా నేను మాత్రం ఆరును వదలను అని బాధతో గట్టిగా అరిచాను అని మనోహరి చెప్తుంది. ఇంతటితో ఇవాళ్టి నిండు నూరేళ్ల సావాసం సీరియల్‌ ఎపిసోడ్‌ కు ఎండ్‌ కార్డు పడుతుంది.

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×