E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today September 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలను చంపేందుకు మనోహరి కుట్ర

Nindu Noorella Saavasam Serial Today September 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలను చంపేందుకు మనోహరి కుట్ర
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  అంజు ఐసీయూలో ఉండటంతో పిల్లలు ముగ్గురు బాధపడుతుంటారు. అంజుకు బాగవ్వాలని హాస్పిటల్ లో ఉన్న  గణపతికి మొక్కుకోవడానికి  వెళ్తారు. అక్కడ గణపతికి మొక్కుకుంటారు. ఎలాగైనా అంజును కాపాడమని దేవుడి ముందు మోకరిల్లుతారు.  అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి పిల్లలను చూసి దగ్గరకు వెళ్తుంది. అమ్ము మీరేంటి ఇక్కడున్నారు.. ఇక్కడేం  చేస్తున్నారు..? భాగీ తాతయ్య ఎక్కడ అని అడుగుతుంది. తాతయ్య కారిడార్‌లో ఉన్నారు. మిస్సమ్మ ఎవరి కోసమో వెళ్లింది అని చెప్పగానే.. ఎవరి కోసం వెళ్లింది అని మను అడగ్గానే.. తెలియదని ఆనంద్ చెప్తాడు.. సరే మీరు ఇక్కడేం చేస్తున్నారు అని అడుగుతుంది మను. అంజు త్వరగా కోలుకోవాలని దేవుడిని మొక్కుతున్నాము అని ఆకాష్‌ చెప్తాడు.

దీంతో మనోహరి ప్లాన్‌ చేసి.. మీరు ఇలా అడిగితే దేవుడు వరం ఇవ్వడు.. డైరెక్టుగా దేవుడి దగ్గరకు వెళ్లి వేడుకుంటే అంజును కాపాడతాడు అని చెప్తుంది. దేవుడి దగ్గరకా ఆయన ఎక్కడున్నాడని వెతకాలి అని అమ్ము అడుగుతుంది. ఈరోజు వినాయకుడి నిమజ్జనం కదా అక్కడికి వెళ్లి నిమజ్జనం అయ్యే వినాయకుడిని ప్రార్థిస్తే వెంటనే అంజు లేచి కూర్చుంటుంది అని చెప్పగానే.. ఆనంద్‌ ఆశ్చర్యంగా నిజంగానా.. ? అలా చేస్తే అంజుకు నయం అవుతుందా..? అని అడుగుతాడు. కచ్చితంగా అవుతుంది. నేను చాలా సార్లు అలానే చేశాను. నా కోరికలన్నీ నెరవేరాయి అని మను చెప్పగానే.. ఆకాష్ మరి ఈ సారి అంజు కోసం మీరు ప్రార్థించవచ్చు కదా..? నిమజ్జనం దగ్గరకు వెళ్లి రావొచ్చు కదా అంటాడు.

Advertisement

అది మీరు అంజలికి ఓన్‌ బ్రదర్స్‌ అండ్‌ సిస్టర్స్‌ కానీ నాకు అంజలికి ఎలాంటి సంబంధం లేదు.. అంజలి నా కూతురు లాంటిదే కానీ నా సొంత కూతురు కాదు కదా..? రక్త సంబంధం ఉన్న వాళ్లు ప్రార్థిస్తేనే దేవుడు వారి కోరికను మన్నిస్తాడు. అర్థం  అయిందా..? అని అడుగుతుంది. అమ్ము అర్థం అయింది ఆంటీ అని చెప్తుంది.  అయితే మీరు ముగ్గురు నిమజ్జనం జరిగే చోటుకు వెళ్లి దేవుడిని ప్రార్థిస్తారా..? అంజు బతుకుతుంది అని చెప్పగానే.. ఆనంద్‌ మా అంజు కోసం మేము ఏమైనా చేస్తాం.. పదండి వెళ్దాం అంటాడు. మను ఆపి అటు ఎక్కడికి ఎంట్రన్స్‌ ఇటువైపు ఉంది అని చెప్తుంది. మా తాతయ్యతో మిస్సమ్మతో చెప్పి వెళ్తాం అని అమ్ము అంటుంది. పైగా డాడీ పర్మిషన్‌ తీసుకోవాలి అంటుంది. దీంతో వాళ్లను అడిగితే మిమ్మల్ని వెళ్లనివ్వరు.. మీ డాడీ మీకు పర్మిషన్‌ కూడా ఇవ్వరు.. అని చెప్తుంది మను.

ఎవరితో చెప్పకుండా ఎలా వెళ్తాము అని ఆనంద్‌ అడగ్గానే.. ఒక మంచి పని చేసేటప్పుడు ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదు. మీ ప్రార్థనల వల్ల అంజలి కోలుకుంటే అదే చాలు కదా..? అంటుంది. దీంతో ఆకాష్‌ కరెక్టే.. మనం తిరిగి వచ్చే లోపు అంజలి లేచి కూర్చుంటే మనకు కూడా సర్‌ప్రైజ్‌ గా ఉంటుంది కదా..? పదండి వెల్దాం అంటాడు. చాలా థాంక్స్‌ ఆంటీ మాకు మంచి ఐడియా ఇచ్చారు వెళ్లొస్తాము ఆంటీ అని చెప్పి పిల్లలు ముగ్గురు వెళ్లిపోతారు. మనోహరి నవ్వుకుంటూ వెళ్లండి వెళ్లండి మీరు కూడా ప్రాణాలతో తిరిగి రారు.. నిమజ్జనం దగ్గర తొక్కిసలాటలో చచ్చిపోతారు. ఇక్కడ అంజు అక్కడ మీరు చచ్చిపోతే అమరేంద్ర భాగీని తన్ని తరిమేస్తాడు. ఆ తర్వాత అమర్‌ను నా సోంతం చేసుకుంటాను అని హ్యాపీగా ఫీలవుతుంది.

Advertisement

తర్వాత మనోహరి రణవీర్‌కు కాల్‌ చేస్తుంది.  పిల్లలు గణపతి దగ్గరకు వెళ్లారు.. నువ్వు వెంటనే అక్కడికి వెళ్లు అని చెప్తుంది మనోహరి. ఏ ఏందుకు మనోహరి అని అడుగుతాడు రణవీర్‌. దీంతో మనోహరి ఎందుకు అంటావేంటి రణవీర్‌.. ఆ పిల్లలు హాస్పిటల్‌ నుంచి గణపతి దగ్గరకు వెళ్లారు. ఇప్పుడు భాగీ అమరేంద్రకు ఫోన్‌ చేసి ఆ పిల్లలను కాపాడుకునే లోపు  నువ్వు వెళ్లి వాళ్లను చంపేసెయ్‌ అని చెప్తుంది. దీంతో రణవీర్‌ షాక్‌తో కూడిన ఆశ్చర్యంగా సరే అంటూ కాల్‌ కట్‌ చేసి తన మనుషులకు ఫోన్‌ చేస్తాడు. అందరినీ తీసుకుని గణేష్‌ మండపం దగ్గరకు వెళ్తాడు. అక్కడ రణవీర్‌ మనుషులు పిల్లలను వెతుకుతుంటారు. మరోవైపు పిల్లల కోసం మిస్సమ్మ హాస్పిటల్‌ లో వెతుకుతుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×