E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today October 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  తనకు స్పర్శ వచ్చిందని తెలుసుకున్న ఆరు – ఆరు మనసును డైవర్ట్‌ చేసిన గుప్త

Nindu Noorella Saavasam Serial Today October 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  తనకు స్పర్శ వచ్చిందని తెలుసుకున్న ఆరు – ఆరు మనసును డైవర్ట్‌ చేసిన గుప్త
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: మిస్సమ్మ దగ్గరకు వెళ్లిన అమ్మువాళ్లు అంజలి స్కూల్‌ కు డుమ్మా కొట్టాలని అందుకోసం డాడీకి ఎలా చెప్పాలో అర్థం కాక నీ దగ్గరకు వస్తుందని కానీ నువ్వు మాత్రం అంజుకు హెల్ప్‌ చేయోద్దని చెప్తారు. మిస్సమ్మ అంజలి వచ్చి అడిగినా.. మీరు వచ్చి అడిగినా నేను హెల్ఫ్‌ చేస్తానని మీరంతా నాకు ఒక్కటేనని అంజలి నాతో వెటకారంగా మాట్లాడినా నాకు చాలా ముద్దొస్తుందని మిస్సమ్మ చెప్పగానే పిల్లలు ముగ్గురు ఏడుస్తూ.. సారీ మిస్సమ్మ నిన్ను చూస్తుంటే మా అమ్మే గుర్తుకువస్తుంది.  నువ్వు అచ్చం మా అమ్మలాగే మాట్లాడతావు. నువ్వు వచ్చాక మా అమ్మ లేదనే బాధ కొంచెం తగ్గింది అంటారు.

పిల్లల్ని ఓదార్చిన మిస్సమ్మ అమ్మును మనం సండే ఎవ్వరికీ తెలియకుండా పార్లర్‌కు వెళ్దామా..? నువ్వు ఆరు అక్కా ప్రతి సండేకి ఈ లేజీ బాయ్స్‌ పడుకున్నాక వెళ్లే వారట కదా అంటుంది. దీంతో షాక్‌ అయిన అమ్ము ఆ విషయం నీకెలా తెలుసు మిస్సమ్మ. నాకు మా అమ్మకు తప్ప  ఎవరికీ తెలియదు. ఆఖరికి డాడీ వాళ్లకు కూడా తెలియదు. అసలు ఎవరు చెప్పారు నీకు అని అడుగుతుంది అమ్ములు. పక్కింటి అక్క చెప్పిందని మిస్సమ్మ చెప్పగానే ఆవిడకు ఎలా తెలుసు..? అని అమ్ము డౌట్‌ పడుతుంది.

Advertisement

ఆవిడ ఆరు అక్క ఫ్రెండ్స్‌ అంట అమ్ము. ఎప్పుడో మాటల్లో చెప్పిందేమో అంటుంది మిస్సమ్మ. అవునా అసలు అమ్మ ఎవరికీ చెప్పే చాన్సే లేదు. ఎందుకంటే ఇక్కడ అమ్మకు ఎవ్వరూ ఫ్రెండ్స్‌ లేరు కదా అంటుంది. పైగా అది మా ఇద్దరి సీక్రెట్‌ అని అమ్మే చెప్పేది అని అమ్ము చెప్పగానే ఇంతలో ఆకాష్‌ ఆవిడ ఎలా ఉంటారు మిస్సమ్మ అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ కొన్ని పోలికలు చెప్తే మేము అడిగింది ఆవిడ  ఎలా ఉంటారని నువ్వు చెప్తుంది మా అమ్మ పోలికలు అంటారు. ఇంతలో బయట అంజు సౌండ్‌ వని అందరూ హల్లోకి వెళ్తారు.

హల్లో అంజు తన మాటలతో అమర్‌ను కాకా పడుతుంది. అమర్‌కు కహానీలు చెప్తుంది. అంజు యాక్టింగ్‌ చూసిన అమ్ము ఇరిటేటింగ్‌ మిస్సమ్మ ఇది ఓవర్‌ గా మాట్లాడుతుంది అంటుంది. అంజు మాత్రం అమర్‌ కాళ్లు నొప్పిగా ఉన్నాయా..? పట్టమంటావా? అటూ ఒళ్లు నొప్పిగా ఉందా? పడతాను అంటూ అమర్‌ను కాకా పడుతుంది అంజు. అందరూ వచ్చి హాల్లో అంజు మాటలు వింటుంటారు. అమ్మో బెటాలియన్‌ అంతా వచ్చారు అంటే నా ప్లాన్‌ అంతా ప్లాప్‌ చేస్తారేమో అని  మనసులో అనుకుంటుంది అంజు.

Advertisement

ఇంతలో మిస్సమ్మ  పిల్లలు అంజు పాపను చూసి ఎలా రెస్పాన్స్‌బులుగా ఉండాలో చూసి నేర్చుకోండి. పొద్దునే లేచినప్పటి నుంచి ఎంత పని చేస్తుంది అని చెప్తుంది. అవును మిస్సమ్మ అంత చేసింది అంటే ఎంత అవసరం ఉందో అంటుంది అమ్ము. అమ్ము మాటలు విన్న అమర్‌ ఏంటి అమ్ము ఏదో అంటున్నావు అని అడుగుతాడు. దీంతో అంజు డాడ్‌ నన్ను చూస్తుంటే ఆనందంగా ఉంది అన్నది.

అంటే లైక్‌ ఓవర్‌ హ్యపీనెస్‌ డాడ్‌ అంతే కదా అమ్ము అంటూ కవర్‌ చేస్తుంది అంజు. దీంతో అమ్ము  అంతే అంతే చాలా ఓవర్‌ గానే ఉంది అంటూ చెప్పడంతో అమర్‌ అంతా ఓకే కదా అంజు అని అడగ్గానే ఏం చెప్పాలో తెలియకు అంజు ఓకే డాడ్‌ అంటుంది అమర్‌ లోపలికి వెళ్లిపోతాడు. అయ్యో ఇంట్లో ఉంటే డాడ్‌ తిడతాడు స్కూల్‌కు వెళ్దామంటే ఆ రాక్షసి ప్రిన్సిపాల్‌ రానివ్వదు ఇపుడు ఎలా అంటూ బాధపడుతుంది.

గార్డెన్‌ పక్కన పాట పాడుతూ కారు తుడుస్తుంటాడు రాథోడ్‌. గార్డెన్‌ లో ఉన్న ఆరు చూస్తూ గుప్త గారు ఖాళీగా కూర్చోక పోతే వెళ్లి ఆ రాథోడ్‌ కు హెల్ఫ్‌ చేయోచ్చు కదా అంటుంది. దీంతో గుప్త ఆరు మీద సీరియస్‌ అవుతాడు. నేనేంటి వెళ్లి కారు తుడవడమేంటి అంటాడు. ఇంతలో పక్కింట్లోంచి బాల్‌ వచ్చి రాథోడ్‌కు తగులుతుంది. ఉలిక్కిపడ్డ రాథోడ్‌ బాలా అనుకుంటాడు. అవతలి వైపు నుంచి పిల్లలు బాల్‌ ఇవ్వమని అడుగుతాడు. రాథోడ్‌ బాల్‌ వాళ్లు విసిరివేస్తూ మరోసారి ఇటువైపు వచ్చిందంటే బాల్‌ ఇవ్వనని హెచ్చిరిస్తాడు.

ఇంతలో బాల్‌ మళ్లీ వస్తుంది. రాథోడ్‌ తిరిగి బాల్‌ ఇస్తాడు. ఇలాగే మూడు సార్లు బాల్‌ వచ్చి తగలడంతో రాథోడ్‌ బాల్‌ మీకు వెయ్యను పక్కకు వేస్తాను అని గుప్త, ఆరు ఉన్న సైడు వేస్తాడు. ఆరు వెంటనే క్యాచ్‌ పట్టుకుంటుంది. బాల్‌ గాల్లేనే ఉండిపోయిందేంటని రాథోడ్‌ షాక్‌ అవుతాడు. ఆరు మళ్లీ బాల్‌ ను రాథోడ్‌కు వేస్తుంది. రాథోడ్‌ మళ్లీ ఆరు వైపు వేస్తాడు. ఇలా ఇద్దరి మధ్య కొద్ది సేపు బాల్‌ వేసుకుంటారు. తర్వాత రాథోడ్‌ షాక్‌ అయి భయంతో వణికిపోతూ కారులోకి ఎక్కి కూర్చుంటారు.  ఆ బాల్‌ ను నేను ఎలా పట్టుకోగలిగాను అంటూ ఆరు డౌటుగా గుప్తను అడుగుతుంది. గుప్త ఏం చెప్పాలో అర్థం కాక అలాగే ఉండిపోతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×