E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today October 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అక్క కోసం పూజకు రెడీ అయిన మిస్సమ్మ – బిడ్డ కోసం కూలబడిపోయిన రామ్మూర్తి

Nindu Noorella Saavasam Serial Today October 23rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అక్క కోసం పూజకు రెడీ అయిన మిస్సమ్మ – బిడ్డ కోసం కూలబడిపోయిన రామ్మూర్తి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  స్కూల్‌ లో రామ్మూర్తిని పిలిచిన ప్రిన్సిపాల్‌ తన కారు నీట్‌గా లేదని క్లీన్‌ చేయమని చెప్తుంది. అలాగేనని రామ్మూర్తి కారు తుడుస్తుంటాడు. దూరం నుంచి మొత్తం గమనిస్తున్న పిల్లలు ప్రిన్సిపాల్‌ అంతు చూద్దామని వెళ్లబోతుంటే అంజు వాళ్లను ఆపి.. పక్కకు వెళ్లి ఫోన్‌ తీసుకొచ్చి రామ్మూర్తి కారు తుడవడాన్ని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది. తర్వాత ప్రిన్సిపాల్ దగ్గరకు వెళ్లి న్యూస్‌ చూస్తారా? అని అడుగుతారు. మమూలు న్యూస్‌ కాదు సోషల్‌ మీడియాలో వైరల్‌ న్యూస్‌ బాగా చూస్తానని చెప్తుంది ప్రిన్సిపాల్‌. పిల్లలు నవ్వుకుంటూ బై చెప్పి వెళ్లిపోతారు.

అమర్‌ ఆఫీసుకు వెళ్తూ వెళ్తున్నాను అని చెప్పగానే మిస్సమ్మ ఆగమని చెప్పి అమర్‌ను ఎన్నిసార్లు చెప్పాలి మీకు వెళ్తున్నాను అని చెప్పకండి వెళ్లోస్తాను అని చెప్పండి అన్నానుగా అంటుంది. ఏదో పొరపాటుగా వచ్చేసింది మిస్పమ్మ ఇక ఎప్పుడు చెప్పనులే అంటాడు అమర్‌. ఆ అలవాటే మార్చుకోమని చెప్పేది. మీరు వెళ్తున్నాను అని చెప్పి వెళ్తున్నపప్టి నుంచి తిరిగి వచ్చే వరకు ఎంత టెన్షన్‌ గా ఉంటుందో తెలుసా..?  అంటూ కొద్ది సేపు ఇక్కడే కూర్చోండి అని  అమర్‌ను కూర్చోబెట్టి కిచెన్‌ లోకి వెళ్తుంది మిస్సమ్మ.

Advertisement

గార్డెన్‌ లో ఆరు గురించి ఆలోచిస్తుంటాడు గుప్త. మిస్సమ్మకు అమ్మవారి వ్రతం చేయమని ఎలా చెప్పాలి అని అయోమయంలో ఉండగా ఇంతలో రామ్మూర్తి గేటు తెరుచుకుని లోపలికి వస్తుంటాడు. ఈయన ఈ టైంలో వచ్చాడేంటి అనుకుంటాడు గుప్త. రాథోడ్‌ ఎదురుగా వచ్చి ఏంటి సార్‌ ఎప్పుడు పిలిచినా రాని మీరు ఇవాళ పిలవకుండానే వచ్చారు ఏంటి విషయం అని అడుగుతాడు.  నిన్నటి నుంచి మనసులో ఏదో అలజడి రాథోడ్‌. ఏదో జరిగిపోయింది. నా కూతురుకు ఏదో జరిగింది అని భయంగా ఉంది. అమ్మాయితో ఫోన్‌ లో మాట్లాడాను కానీ అమ్మాయిని ఒక్కసారి చూడాలని వచ్చాను అని చెప్తాడు రామ్మూర్తి.

రాథోడ్‌ ఏంటి సార్‌ మీరు మాట్లాడేది.. మా సార్‌ ఉండగా.. మీ కూతురుకు ఏమైనా అవ్వనిస్తారా? ఒకవేళ ప్రమాదం వచ్చినా తన ప్రాణాలు అడ్డువేసి కాపాడతాడు అని రాథోడ్‌ చెప్పగానే తెలుసు రాథోడ్‌.. కానీ ఈ సారి ఎంత నచ్చజెప్పుకున్నా మనసులో అలజడి తగ్గడం లేదు అంటూ ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు.  రామ్మూర్తి ఎమోషనల్‌ అర్థం చేసుకున్న గుప్త  పుట్టినప్పుడు కూతురు ముఖం కూడా చూడని తండ్రి ఇప్పుడు ఆ కూతురు లోకం విడిచి వెళ్లిన కూడా  ప్రమాదంలో ఉన్నందుకు ఆ తండ్రి మనసు విలవిలలాడుతున్నది అనుకుంటాడు. ఈ సమస్యకు పరిష్కారం చూపమని యముణ్ని ప్రార్థిస్తాడు గుప్త.

Advertisement

ఇంటికి  వచ్చిన రామ్మూర్తిని చూసి మిస్సమ్మ హ్యాపీగా ఫీలవుతుంది. నాన్నా ఎలా ఉన్నావు అంటూ పలకరిస్తుంది. నేను బాగున్నాను తల్లి.. నువ్వెలా ఉన్నావు అమ్మా.. అంటూ రామ్మూర్తి .. మిస్సమ్మను పలకరిస్తాడు. ఇంతలో శివరాం ఏంటి బావగారు అంజు బర్తుడేకు వస్తామని రాలేదు. మీరు రాలేదు కాబట్టి మేం ఎవరం మీతో మాట్లాడము.. అంటాడు. మీరు వస్తారని పిల్లలు బాగా సంతోషపడ్డారు అన్నయ్య గారు. కానీ మీరు రాలేదని తెలిసి వాళ్లు చాలా బాధపడ్డారు అంటుంది నిర్మల. దీంతో ఊరి నుంచి తెలిసిన వాళ్లు వచ్చారమ్మా అందుకే రాలేకపోయాను అంటూ రానందుకు క్షమించమని అమర్‌ను అడుగుతాడు రామ్మూర్తి.

అయ్యో ఎందుకు లేండి మీకు ఏదో ముఖ్యమైన పని ఉంటేనే రారని తెలుసు కదా? అంటాడు అమర్‌. తర్వాత అమర్‌ రాథోడ్‌ ఆఫీసుకు వెళ్తారు. నిర్మల, శివరాం లోపలికి వెళ్లిపోతారు. మిస్సమ్మ, రామ్మూర్తి గార్డెన్‌లోకి వెళ్తారు. బాధగా ఉన్న రామ్మూర్తిని  ఎందుకు నాన్నా అలా ఉన్నారు. నాకు ఏమైనా అవుతుందని ఎందుకు భయపడుతున్నారు చెప్పండి నాన్నా.. అసలు ఏమైంది అని అడుగుతుంది మిస్సమ్మ.

రామ్మూర్తి బాధగా అమ్మా భాగీ ఇక్కడ అంతా బాగానే ఉంది కదా? ఆ మనోహరి వల్ల నువ్వేమైనా బాధపడుతున్నావా అమ్మా.. అల్లుడు గారు నిన్ను ఏమైనా అంటున్నారా..? అని ఆరా తీస్తాడు. దీంతో మిస్సమ్మ..  నాన్నా నేను చాలా బాగున్నాను. ఆయన నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. ఇక మనోహరి అంటావా? తన తిక్క నేను కుదుర్చుతాను అని చెప్తుంటే రామ్మూర్తి నిన్నటి నుంచి నా మనసు ఎందుకే ఒకటే కీడు శంకిస్తుంది అమ్మా.. అని చెప్పగానే ఎందుకో తెలియడం లేదు నాన్నా  నాక్కూడా చాలా భయంగా ఉంది.

ఎవరికో ఏదో అయినట్టు చాలా నిస్సహాయంగా ఉంది అని మిస్సమ్మ చెప్పగానే ఇద్దరి మాటలు వింటున్న గుప్త ఆశ్యర్యపోతాడు. ఇంతలో మిస్సమ్మ మన ఇద్దరికి ఇలా ఉందంటే అక్క ఏదైనా కష్టంలో ఉందేమో నాన్నా అంటుంది. ఆ మాటకు రామ్మూర్తి బాధతో కూలబడిపోతాడు. దీంతో బాధపడకు నాన్నా మనకు ఎంత కష్టం వచ్చినా అమ్మవారే తోడు ఉంటారని చెప్తావు కదా? ఇప్పుడు కూడా అక్క కోసం అమ్మవారి దీక్ష చేద్దాము అంటుంది. మంచి ఆలోచన తల్లి రేపే మొదలు పెడదాము అంటాడు రామ్మూర్తి.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×