E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కారులో డిక్కీలో ఉన్న రణవీర్ ను చూసిన అమర్ 

Nindu Noorella Saavasam Serial Today November 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కారులో డిక్కీలో ఉన్న రణవీర్ ను చూసిన అమర్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:        

డాక్టర్‌ దగ్గర స్టెతస్కోప్‌ తీసుకుని కడుపులో బేబీ మాటలు వింటుంది మిస్సమ్మ. ఆ ఎమోషనల్‌లో ఉండగా డాక్టర్‌ ఆశ్చర్యపోతుంది. మీరేదే ఇల్యూషన్‌లో ఉన్నారని చెప్తుంది. ఇంకా పుట్టని బేబీ ఎలా మాట్లాడుతుంది అని అడగ్గానే.. మాట్లాడుతుంది డాక్టర్‌ నేను కూడా విన్నాను అని మిస్సమ్మ చెప్పగానే.. అదెలా సాధ్యం.. బేబీ పుట్టాక టూ ఇయర్స్‌కు మాటలు వస్తాయి. ఇది సైన్స్‌ అని డాక్టర్‌ చెప్తుంది. అయితే ఆ సైన్స్‌ను కూడా దైవ శక్తి చాలా సార్లు ఆశ్చర్యపరిచింది డాక్టర్‌. ఆ దైవ శక్తినే మీ భాషలో మెడికల్‌ మిరాకిల్‌ అంటారు. ఇంకొంత మంది దానినే మ్యాజిక్‌ అంటారు.. ఎవరు ఏ పేరుతో పిలిచినా..? అది సైన్స్‌కు అందని దైవశక్తి అని చెప్తుంది.

దీంతో డాక్టర్‌ ఇవేవీ నేను నమ్మను అని చెప్పగానే.. మిస్సమ్మ పురాణాలు చెప్తుంది. అభిమన్యుడు అమ్మ కడుపులో ఉన్నప్పుడు పద్మవ్యూహం గురించి వినలేదా..? ఆంజనేయుడు ఒక్క అడుగులో అంత పెద్ద సముద్రాన్ని దాటలేదా..? శ్రీకృష్ణుడి కోసం యమునా నది దారి ఇవ్వలేదా.. అని చెప్పగానే.. అవన్నీ పురాణాలు అండి అంటుంది డాక్టర్‌. కాదు డాక్టర్‌ అవన్నీ హిస్టరీలాగా చూడండి అప్పుడే మీకు అద్బుతంగా అర్థం అవుతాయి అని మిస్సమ్మ చెప్పగానే.. అంజు మళ్లీ స్టెతస్‌ స్కోప్‌ తీసుకుని తన చెవ్వుల్లో పెట్టుకుని మిస్సమ్మ పొట్ట మీద పెట్టి వింటుంది. ఇంతల మిస్సమ్మ కడుపులో బేబీ అంజు అని పిలుస్తుంది. ఆ మాట వినగానే.. అంజు ఎమోషనల్‌ అవుతుంది.  అమ్మ జాగ్రత్త.. అమ్మని జాగ్రత్తగా నువ్వే చూసుకోవాలి.. నువ్వు నా అక్కవి.. అమ్మకు ధైర్యంగా తోడుగా ఉండు అని చెప్తుంటే.. అంజు హ్యాపీగా నవ్వుతుంది.

Advertisement

కట్‌ చేస్తే కారులో రణవీర్, మనోహరి, చంభా కలిసి అమర్‌ ఇంటికి వస్తారు. అప్పుడే ఇంట్లోంచి బయటకు వస్తున్న డాక్టర్‌ను చూసి గేటు బయటే ఆగిపోతుంది. ఏంటి మనోహరి కారు ఇక్కడే ఆపేశావు అని రణవీర్‌ అడగ్గానే.. భాగీని చూడ్డానికి డాక్టర్‌ వచ్చినట్టు ఉంది. తను వెళ్లిపోయాక వెళ్దాం అని మనోహరి చెప్తుంది. ఇంతలో డాక్టర్‌ వెళ్లిపోయాక మనోహరి లోపలికి వెళ్తుంది. కారు దిగి బాంబు పట్టుకుని ఎవ్వరూ చూడటం లేదు లోపలికి రా రణవీర్‌ అంటూ పిలుస్తుంది. ఇంతలో పిల్లలు లోపలి నుంచి బయటకు వస్తుంటే.. కంగారుగా రణవీర్‌ను కారు డిక్కీలో పెట్టి లాక్‌ చేస్తుంది. పిల్లలు దగ్గరకు వస్తారు. ఇంత సేపు ఎక్కడికి వెళ్లావు యాదమ్మ.. నువ్వు మిస్సమ్మ పక్కనే ఉండాలని డాడీ చెప్పారు కదా అంటూ అమ్ము అడగ్గానే.. ఏం చెప్పాలో అర్థం కాక చంభా చూస్తుంది.

ఇంతలో అమ్ము, యాదమ్మను నేనే తీసుకెళ్లాను అని మనోహరి చెప్తుంది. అయితే ఆనంద్‌ మాత్రం డాడీ యాదమ్మ మిస్సమ్మ పనులు మాత్రమే చేయాలని మీ పనులు చేయకూడదని డాడీ మీకు చెప్పారు కదా ఆంటీ అని ఆనంద్‌ అడగ్గానే.. మనోహరి నేను యాదమ్మను తీసుకెళ్లింది కూడా మిస్సమ్మ పని మీదే రేపు ఊరికి వెళ్తున్నారు కదా మిస్సమ్మకు ఏమేం కావాలో అవన్నీ తీసుకురావడానికి తీసుకెళ్లాను అని చెప్పగానే.. ఆకాష్‌ కల్పించుకుని అవన్నీ తాతయ్య, నాన్న తీసుకొస్తారు కదా మీరెందుకు వెళ్లారు అని అడగ్గానే.. అంటే బాబు నాకు కావాల్సినవి కూడా తెచ్చుకున్నాను అని యాదమ్మ చెప్తుంది. అవును మిస్సమ్మతో పాటు యాదమ్మ కూడా మీతో రావాలి కదా.. మీరు లోపలికి వెళ్లండి ఆ సామాన్లనీ నేను తీసుకొస్తాను అని చెప్పగానే.. పిల్లలు లోపలికి వెళ్తారు. వెంటనే రణవీర్‌ను డిక్కీలోంచి బయటకు తీసుకురావడానికి మనోహరి వెనక్కి వెళ్లగానే.. అప్పుడే అమర్‌, రాథోడ్‌ వస్తారు. వాళ్లను ఆగిపోతుంది మనోహరి. మనోహరి, చంభాను తీసుకుని ఇంట్లోకి వెళ్లిపోతారు అమర్‌, రాథోడ్.

Advertisement

తర్వాత ఎవరి పనుల్లో వాళ్లు ఉండగా మనోహరి, చంభాను తీసుకుని బయటకు వెళ్తుంది. అందరూ లోపల ఉన్నారు.. నువ్వు వెళ్లి కారు డిక్కీ ఓపెన్‌ చేయ్‌ రణవీర్‌ బయటకు వస్తాడు అని చెప్తుంది మనోహరి. సరే అంటూ చంభా వెళ్లి డిక్కీ ఓపెన్‌ చేయాలని చూస్తుంది. డిక్కీ ఓపెన్‌ కాదు.. దీంతో మనోహరి లాక్‌ ఓపెన్‌ చేయగానే.. కారు సౌండ్‌ వస్తుంది. ఆ సౌండ్‌కు లోపల వున్న అమర్‌ బయటకు వస్తాడు. ఏం జరిగిందని అడుగుతూనే లాక్‌ ఇటువ్వు మనోహరి నేను ఓపెన్‌ చేస్తాను అంటాడు. భయపడుతూనే మనోహరి కీస్‌ ఇస్తుంది. అమర్‌ డిక్కీ ఓపెన్  చేస్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×