E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   అమర్‌, మిస్సమ్మ ల మధ్య రొమాన్స్‌ – ఆరును తీసుకొచ్చిన గుప్త  

Nindu Noorella Saavasam Serial Today November 25th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:   అమర్‌, మిస్సమ్మ ల మధ్య రొమాన్స్‌ – ఆరును తీసుకొచ్చిన గుప్త  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  కరుణ, మిస్సమ్మ కు ఫోన్‌ చేస్తుంది. అమర్‌ ఫోన్‌ లిఫ్ట్‌ చేస్తాడు. ఓ ఫోరీ ఫోన్‌ ఎత్తడానికి ఎందుకు లేట్‌ చేస్తున్నావు. ఎప్పుడు నీ పిల్లలు మీ ఆయనేనా..? నువ్వు మీ ఆయన కలిపిపోయారా..? అసలు మీ ఆయనకు నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా..? ఆయన కళ్లల్లో తెలిసిపోతుంది అంటూ అసలు నేను మాట్లాడుతున్నాను కానీ నువ్వేమీ మాట్లాడటం లేదు ఎందుకు అంటుంది కరుణ.

దీంతో అమర్‌ నేను మాట్లాడటానికి నువ్వు గ్యాప్‌ ఇచ్చావా..? అంటాడు. దీంతో కరుణ షాక్‌ అవుతుంది. తర్వాత మిస్సమ్మకు బైక్‌ నేర్పిస్తామన్నారు నేర్పించవచ్చు కదా..? అని చెప్తుంది. అప్పుడప్పుడు దాని గురించి జరంత పట్టించుకోండ్రి అని చెప్తుంది. దానికి ఇవ్వడమే తెలుసు కానీ అవసరమైనా అడగడం మాత్రం తెలియదు అంటూ నేనేమైనా తప్పుగా మాట్లాడితే సారీ అంటుంది కరుణ. తప్పేం కాదు అంటాడు అమర్‌. అయితే దానికి స్నానం చేశాక సాంబ్రాణి వేసుకోవడం అంటే చాలా ఇష్టం. పెళ్లి అయ్యాక మొగుడితో సాంబ్రాణి వేయించుకుంటానని ఎప్పుడు చెప్పేది అంటూ కరుణ ఫోన్‌ కట్‌ చేస్తుంది.

Advertisement

అమర్‌ మెల్లగా కిచెన్‌ లోకి వెళ్లి ఎవ్వరూ చూడకుండా సాంబ్రాణి తీసుకుని వెళ్తుంటే నిర్మల చూస్తుంది. అమర్‌ ఏమైనా కావాలా..? అని అడుగుతుంది. అమర్‌ కంగారుగా ఏమీ వద్దని మీకేమైనా కావాలంటే రాథోడ్‌ ఉన్నాడేమోనని చూస్తున్నాను అంటూ వెళ్లిపోతుంటే శివరాం వస్తాడు.. ఏమైంది అమర్‌ చేతులు ఎందుకు వెనక్కి పెట్టుకున్నావు అని అడుగుతాడు. నేనేం దాయలేదని అమర్‌ చెప్తాడు. శివరాం అనుమానంగా వెళ్లిపోతాడు. ఇంతలో మనోహరి వచ్చి అమర్‌ ఏంటది దాస్తున్నావని అడుగుతుంది. ఏమీ లేదని చెప్తూ.. అమర్‌ వెళ్లిపోతాడు. ఇంట్లో ఒక్క పని చేయడానికి ఇంత యుద్దం చేయాలా..? అనుకుంటూ రూంలోకి వెళ్లి సాంబ్రాణి దూపం వేస్తాడు.

స్నానం చేసి బయటకు వచ్చిన మిస్సమ్మ ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటది అని వెళ్లి అమర్‌ ను అడుగుతుంది. సాంబ్రాణి అని అమర్‌ చెప్పగానే అత్తయ్య ఇచ్చారా..? నేను తల స్నానం చేస్తానని గుర్తుపెట్టుకుని మరీ ఇచ్చారా..? సారీ నేనే తెచ్చుకోవాల్సింది అంటుంది. అమర్‌, మిస్సమ్మను రోమాంటిక్‌ గా చూస్తూ.. అమ్మ ఇవ్వలేదని నేనే తీసుకొచ్చానని చెప్తాడు. ఎందుకని అమర్‌ నీకోసమే తీసుకొచ్చానని ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటుంటే.. నాతో ఏదైనా మాట్లాడారా..? అనగానే అవును సాంబ్రాణి నీకోసమే తీసుకొచ్చా అని అమర్‌ చెప్తాడు. సరేనని సాంబ్రాణి తీసుకుని మిస్సమ్మ వెళ్తుంటే.. సాంబ్రాణి నేనే వేస్తాను అంటాడు అమర్‌. సరే అంటుంది మిస్సమ్మ. అమర్‌ సాంబ్రాణి వేస్తుంటే మిస్సమ్మ రొమాంటిక్‌ గా ఫీలవుతుంది. కిటికీలోంచి చూస్తున్న ఆరు బాధపడుతుంది. ఆరును చూసిన గుప్త హ్యాపీగా ఫీలవుతాడు. నేను ఇది చూడటానికే నన్ను ఇక్కడికి తీసుకొచ్చావా..? అంటూ గుప్తను తిట్టి అక్కడి నుంచి వెళ్లిపోతుంది ఆరు.

Advertisement

టిఫిన్‌ చేయడానికి పిల్లలను పిలుస్తాడు శివరాం. పిల్లలందరూ డైనింగ్‌ టేబుల్‌ దగ్గరకు వెళ్తారు. అందరూ టిపిన్స్‌ చేస్తుంటారు. ఇంతలో అక్కడకు వెళ్లిన ఆనందం డాడీ గదిలో పొగలు వస్తున్నాయేంటి అని భయపడి కిందకు వచ్చి అందరికీ చెప్తాడు. అందరూ భయంగా ఏంటో చూద్దాం పదండి అని పైకి వెళ్తుంటే.. మనోహరి కూడా ఎందుకు అందరూ పైకి వెళ్తున్నారు అని అడుగుతుంది. పైన పొగలు వస్తున్నాయంట అని చెప్పగానే వాళ్లతో పాటు మనోహరి కూడా వాళ్లతో పైకి వెళ్తుంది. శివరాం, మిస్సమ్మను పిలిచి గదిలోంచి పొగలు వస్తున్నాయేంటి అని అడగ్గానే సాంబ్రాణి పొగ వేసుకుంటున్నాను అని చెప్తుంది మిస్సమ్మ. నేనేమైనా సాయం చేయాలా..? అని నిర్మల అడుగుతుంది. నేనే వేసుకుంటాను అని చెప్పమంటున్నాడు అంటూ మిస్సమ్మ చెప్పగానే నిర్మల, శివరాం నవ్వుకుంటారు. మనోహరి షాక్‌ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×