E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today November 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును హెచ్చరించిన యముడు 

Nindu Noorella Saavasam Serial Today November 21st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరును హెచ్చరించిన యముడు 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

యముడి సహాయంతో ఆరు పాము రూపంలో భూలోకం వెళ్లి కాలాను చంపేసి వస్తుంది. యముడు దగ్గరకు వెళ్లి ఆరు చాలా థాంక్స్‌ రాజు గారు మీ హెల్ప్‌ వల్ల నేను భూలోకానికి వెళ్లి నా చెల్లిని తన కడుపులో బిడ్డను కాపాడుకోగలిగాను అని చెప్తుంది. దీంతో యముడు మేము మీకు సాయం చేసితిని కానీ మీరేం చేసితిరి నాకు హత్య పాతుకం అంటగట్టితిరి.. అంటాడు. హత్యా పాతుకమా..? ఆ కాలా చచ్చిపోయిందనా..? అలాంటి దుర్మార్గపు పాము చావాల్సిందే రాజు గారు అంటుంది ఆరు. మేము అంటుంది ఆ సర్పము గురించి కాదు బాలిక నీ గురించి పాము రూపంలో వెళ్లిన నీవు నీ పతి దేవుని చేతిలో చనిపోయిన ఎడల ఆ పాపము మాకే అంటగట్టెదరు కదా..? అంటాడు.

నేను ఆల్ రెడీ చచ్చిపోయి ఉన్నాను కదా రాజు గారు మళ్లీ చనిపోవడం ఏంటి..? అని ఆరు అడగ్గానే.. నీకు సర్ప రూపం ఇచ్చితిని కదా బాలిక.. ఆ రూపంలో నువ్వు మరణించినచో నీ ఆత్మ అదృష్యం అయి నీ ఉనికి శాశ్వతంగా సమాప్తం అయ్యేది అంటాడు. అందుకు సిద్ద పడే వెళ్లాను కదా రాజు గారు.. ధైర్యం చేసి వెళ్లాను కాబట్టే చెల్లిని తన కడుపులోని బిడ్డను కాపాడుకోగలిగాను.. అని చెప్తుంది. నీ అదృష్టం బాగుంది బాలిక. విధి వక్రీకరించి నువ్వు మరణించినచో నువ్వు మరలా మా లోకం వచ్చే దానివే కాదు అంటాడు. దీంతో ఆరు.. రాజు గారు మన అనుకున్న వాళ్ల కోసం ఆ మాత్ర చేయకపోతే మనం ఉండి ఏం ప్రయోజనం చెప్పండి అంటుంది ఆరు. దీంతో యముడు ఎందుకు బాలిక నీకు అంత మమకారం నీ గురించి కాస్తైన ఆలోచించకుండా ఎప్పుడూ నీ కుటుంబం గురించే ఆలోచిస్తావు.. నీ సొదరి కడుపులో నువ్వు ఎలాగూ  పుట్టవు కదా నీకెందులకు ఈ ఆరాటం.. అని అడగ్గానే..

Advertisement

మళ్లీ పుట్టాలనే ఆశతో ఇదంతా చేస్తున్నాను అనుకున్నారా..? ఏంటి రాజు గారు నేను ఉన్నా లేకున్నా నా భర్త, పిల్లలు, చెల్లి అందరూ సంతోషంగా ఉండాలి. వాళ్ల ఆనందం  తప్పా నాకింకేం అక్కర్లేదు.. అంతకు మించి నేనేం ఆలోచించను కూడా అని ఆరు చెప్పగానే.. యముడు ఆశ్చర్యంగా ఆహా కామక్రోధ లోభ మద, మాశ్చర్యాలతో నిత్యం కొట్లాడే మానవ జన్మ ఎత్తి కూడా నీలో ఇంత నిస్వార్థమా..? నీలాంటి వాళ్లు చాలా ఆరుదుగా ఉంటారు బాలిక. తన కోసం కాకుండా తన చుట్టు ఉన్న వాళ్ల కోసం బతికే నీలాంటి ఉత్తములే ఎంతో ధన్యులు అనగానే.. ఆరు ఎమోషనల్‌ అవుతుంది. రాజ్‌ గారు నేనేం అంత గొప్పదాన్ని కాదు.. నన్ను మరీ ఎత్తేస్తున్నారు మీరు అంటుంది. దీంతో యముడు లేదు బాలిక నీ పుట్టుక నుంచి మేము గమనిస్తూనే ఉన్నాము.. పుట్టగానే తల్లిదండ్రులు దూరమైనా అనాథగా బతకాల్సి వచ్చినా నీ ఆత్మస్థైర్యం కోల్పోలేదు.. భార్యగా గృహిణిగా తల్లిగా నీ బాధ్యతలన్నీ నెరవేర్చావు.. సోదరిగా నీ సోదరికి అండగా ఉన్నావు.. అర్ద్రాంతరంగా మరణించినా కూడా మనోనిబ్బరంలో నిలబడగలిగావు.. నిజంగా నీవు చాలా గొప్పదానివి.. అంటూ చెప్పి..

నీలాంటి బాలికకు నేను అర్ధాంతరంగగా ఆయువు తీసిన నేను చాలా పాపం మూటకట్టుకున్నాను.. సరిదిద్దుకోలేని తప్పు చేశాను మమ్ములను క్షమించు బాలిక అని మనసులో అనుకుంటాడు.  ఇంతలో ఆరు.. రాజు గారు మీరు మరీ ఇంత ఎమోషనల్‌ అవ్వకండి మీరు కోపంగా గంభీరంగా ఉంటేనే బాగుంటారు.. అని చెప్పగానే.. పాపులను భయపెట్టడం కోసం అలా ఉండక తప్పడం లేదు బాలిక మాకును మనసు ఉంటుంది కదా..? సరే వెళ్లి విశ్రాంతి తీసుకొనుము అని చెప్పగానే.. ఆరు సరే అంటూ వెళ్లిపోతుంటే ఆరును ఆగమని చెప్పి యముడు మాయాదర్పణం ఇస్తాడు. కాలక్షేపం కోసం ఇందులో ఏదైనా చూడొచ్చు అని చెప్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×