E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today May 26th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఎగ్జిబిషన్‌లో ఆరును చూసిన మిస్సమ్మ – మిస్సమ్మ మాటలకు షాక్‌ అయిన అమర్‌  

Nindu Noorella Saavasam Serial Today May 26th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఎగ్జిబిషన్‌లో ఆరును చూసిన మిస్సమ్మ – మిస్సమ్మ మాటలకు షాక్‌ అయిన అమర్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : మనోహరి, రణవీర్‌ దగ్గరకు వెళ్లి ఇక నువ్వేం చేయలేవు.. ఇక్కడి నుంచి ఏదో ఒకటి చెప్పి వెళ్లిపో అంటుంది. దీంతో రణవీర్‌.. తాను కిరాయి రౌడీలను తీసుకొచ్చానని వాళ్లే కిడ్నాప్‌ చేస్తారని రౌడీలను మనోహరికి చూపిస్తాడు. అయితే అమర్ కు అనుమానం రాకుండా చేయమని చెప్తుంది మనోహరి. రణవీర్‌ సరే అంటాడు. ఇంతలో చిత్ర పిల్లలతో ఎంజాయ్‌ చేస్తుంటే.. మనోహరి కోపంగా  చూస్తుంది. దీంతో రణవీర్‌ అదేంటి మనోహరి పిల్లలు భాగీ పక్కన ఉన్నప్పుడు కిడ్నాప్‌ చేయాలని చెప్పావు. ఇప్పుడు పిల్లలు చిత్రతో వెళ్తుంటే సైలెంట్‌గా ఉన్నావు అని అడుగుతాడు. దీంతో మనోహరి దాని స్థాయికి మించి కలలు కంటుంది అది. ఇప్పుడు దాన్ని కిందకు దించడం చాలా ముఖ్యం పిల్లలు దాని దగ్గర ఉన్నప్పుడే అంజును కిడ్నాప్‌ చేయ్‌.

అమర్‌ దగ్గరకు వెళ్లి చెప్పి మరీ వెళ్లు బయటకు వెళ్తున్నట్టుగా ఫోన్‌ వచ్చిందని చెప్పు అనగానే రణవీర్‌ సరే అంటూ అమర్‌ దగ్గరకు వెళ్లి అమరేంద్ర గారు.. ఒక చిన్న కాల్ మాట్లాడుకోవాలి ఇప్పుడే వస్తాను అంటూ బయటకు వెళ్తూ.. రౌడీల దగ్గరకు వెళ్లి పిల్లలను చూపిస్తూ ఓరేయ్‌ అటువైపు వెళ్తున్నారు వాళ్లలో ఆ చిన్న పాపనే కిడ్నాప్ చేయాలి అని చెప్తాడు. రౌడీలు సరే అంటారు. మరోవైపు అమర్‌ దగ్గరకు మనోహరి వెళ్తుంది. అప్పుడే అక్కడికి అనామిక, మిస్సమ్మ వస్తారు. ఏవండి పిల్లలు ఇంకా చిత్ర దగ్గరే ఉన్నారా..? అని అడుగుతుంది. దీంతో అమర్‌ అవును అంటాడు. ఇంతలో అనామిక చిత్ర ఒక్కతే పిల్లలను చూసుకోలేదు నేను వెళ్తాను అంటూ మనోహరి గారు మీరు రండి అంటూ మనోహరిని బలవంతంగా తీసుకుని వెళ్తుంది.

Advertisement

రాథోడ్‌ కూడా మిస్సమ్మను ఎంజాయ్ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అందరూ వెళ్లిపోయాక మిస్సమ్మ ఏవండి నాకు ఐస్‌ క్రీమ్ తినాలనిపిస్తుంది అని అడుగుతుంది. అమర్‌ నో అనే ఆప్షన్‌ లేదు కదా వెళ్దాం పద అంటాడు. ఇద్దరూ కలిసి ఐస్‌క్రీమ్‌ తినడానికి వెళ్తారు. మరోవైపు మనోహరి ఏయ్‌ ఆగు నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు.. వదలు అంటుంది. ఏం లేదు మనోహరి గారు అక్కడ ఫుడ్‌ బాగుంటుందట రండి తిందాం అంటుంది. మాతో కలిసి ఫుడ్‌ తినడం ఇష్టం లేదా..? అంటుంది అనామిక.. నాకు ఎవ్వరితో కలిసి తినడం ఇష్టం ఉండదు అని చెప్తుంది మనోహరి. దీంతో రాథోడ్‌ పదండి మేడం మనం వెల్లి అక్కడ పప్స్‌ బాగుంటాయట తిందాం అంటూ అనామికను తీసుకుని వెళ్తాడు. మనోహరి కోపంగా చూస్తూ.. వాళ్లిద్దరిని కలపడానికి నన్ను ఇక్కడకు లాక్కోచ్చింది ఇది చెప్తా దీని పని అనుకుంటూ వెళ్లిపోతుంది మనోహరి.

ఐస్‌క్రీమ్‌ తింటున్న మిస్సమ్మతో చిత్ర మీద నీ అభిప్రాయం ఏంటి అని అమర్‌ అడుగుతాడు. స్పెషల్‌గా ఏమీ లేదండి ఎందుకు అడుగుతున్నారు అంటుంది మిస్సమ్మ. ఏం లేదు.. వినోద్‌ ను చూస్తుంటే.. ఎందుకో చిత్రను లవ్ చేస్తున్నాడేమో అనిపిస్తుంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారేమో అనిపిస్తుంది అంటూ అమర్‌ చెప్పగానే.. చిత్ర మంచిదే అయ్యుండొచ్చు అండి కానీ ఎందుకో మాట తీరు చూస్తుంటేనే కొంచెం తేడాగా అనిపిస్తుంది అని చెప్తుంది మిస్సమ్మ.. అయితే సరేలే ఏదైనా ఉంటే వినోద్‌ చెప్తాడు కదా అని అమర్‌ అంటాడు. ఇంతలో ఒకావిడ వచ్చి మిస్సమ్మ సైడు చేయి ఎత్తి హాయ్‌ చెప్తుంది.

Advertisement

అమెను చూడగానే మిస్సమ్మ ఎక్కడో చూసినట్టు ఉందని గుర్తు చేసుకుంటుంది. ఆరు ఫోటో చూపించమని మనును అడిగినప్పుడు మను తన ఫోన్‌ లో చూపించి ఫోటోలో ఉన్న వ్యక్తే ఆమె. అది గుర్తు రాగానే మిస్సమ్మ షాక్‌ అవుతుంది. వెంటనే అమర్‌ను ఏవండి మీరు ఇక్కడే ఉండండి నేను ఇప్పుడే వస్తాను అంటూ ఆమె వైపు వెళ్తుంది. ఆమె అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మిస్సమ్మ ఎగ్జిబిషన్‌ మొత్తం వెతుకుతుంది. కానీ ఆమె మిస్సమ్మకు కనిపించదు. ఇంతలో అమర్‌ వచ్చి మిస్సమ్మను పట్టుకుని భాగీ ఏంటి ఏమైంది అని అడుగుతాడు. మిస్సమ్మ కంగారు పడుతూ ఏవండి నేను ఆరు అక్కను చూశానండి.. మీరు రండి మీకు చూపిస్తాను అంటూ అమర్‌ చేయి పట్టుకుని తీసుకుని వెళ్తుంటే.. అమర్‌ కోపంగా భాగీ ఆగు నీ మాటలు పిల్లలు వింటే ఎంత బాధపడతారు తెలుసా.. అంటాడు. మిస్సమ్మ, అమర్‌ మాటలు వినకుండా వెళ్లిపోతుంది. మరోవైపు రణవీర్‌ వెనక నుంచి వెళ్లి అంజలిని కిడ్నాప్‌ చేస్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×