E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజును బెదిరించిన రణవీర్    

Nindu Noorella Saavasam Serial Today Episode May 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజును బెదిరించిన రణవీర్    
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అంజు కోసం అమర్‌ ఇంటికి వెళ్తాడు రణవీర్‌. మనోహరి రూంలో ఉన్న రణవీర్‌ దగ్గరకు అంజు వెళ్తుంది. అంజును చూసిన మనోహరి, యాదమ్మ షాక్‌ అవుతారు. రూంలోకి వెళ్లిన అంజుతో నువ్వింకా పడుకోలేదా..? అని మనోహరి అడగ్గానే.. నేను అంకుల్‌తో మాట్లాడాలి అంటూ అంజు చెప్పగానే.. రణవీర్ ఏంటమ్మా నాతో ఏం మాట్లాడాలి  రేపే మన ప్రయాణం కోల్‌కతాలో మన ఇంటికి వెళ్తున్నాం అని చెప్పగానే.. అంజు మాత్రం బాధగా మీరంటే నాకు చాలా ఇష్టం అంకుల్‌ అదెందుకో నాకు తెలియదు అని చెప్పగానే.. రణవీర్‌ ఎందుకంటే నువ్వు నా కూతురువి అని చెప్తాడు. దానికి అంజు కాదు అంకుల్‌ నేను మీ కూతురును కాదు. అమరేంద్ర, అరుంధతిల కూతురుని ఆ విషయం మీక్కూడా తెలుసు అయినా కూడా నేను మీ కూతురుని అని మా నాన్నకు చెప్పి నన్ను ఎందుకు తీసుకెళ్లాలి అనుకుంటున్నారు అంటూ ప్రశ్నిస్తుంది.

దీంతో రణవీర్‌ నువ్వు నిజంగా నా కూతురువి అయితే నాతో వస్తావు కదమ్మా అనగానే.. నిజంగా కాదు కదా అంకుల్‌ అంటుంది అంజు. పక్కనే ఉన్న మనోహరి మాత్రం కోపంగా అయితే ఇప్పుడు రణవీర్‌తో వెళ్లవా..? అంటూ కోప్పడగానే.. అంజు ఎందుకు వెళ్లాలి ఆంటీ.. మా నాన్నను మా అన్నయ్యలను మిస్సమ్మను మా చెల్లిని మిస్సమ్మను వదిలేసి నాది కానీ ఇంటికి ఎందుకు వెళ్లాలి ఆంటీ అంటూ ప్రశ్నించగానే.. మనోహరి కోపంగా చిన్నపిల్లవు అయినా చాలా బాగా మాట్లాడుతున్నావు. ఇదంతా ఆ భాగీ ట్రైనింగా..? అనగానే.. అంజు అవును మా అమ్మ తర్వాత అమ్మ మిస్సమ్మ అనగానే.. తను చెప్తే వచ్చావా..? అంటూ మనోహరి ప్రశ్నించగానే.. లేదు నేనే వచ్చాను.. ఈ అంకుల్‌తో నేను ఎందుకు వెళ్లాలి అంటూ ఎదురు ప్రశ్నిస్తుంది అంజు.

Advertisement

దీంతో మనోహరి ఎందుకంటే మీ నాన్న ఈ అంకుల్‌ వాళ్ల కూతురుని తీసుకెళ్తాడు. ఎక్కడ ఉందో చెప్పడం లేదు. అందుకే తనకు బదులుగా నిన్ను తీసుకెళ్తున్నాడు.. అనగానే.. ఎవరికో బదులుగా నన్ను తీసుకెళ్లడం ఏంటి ఆంటీ ఈ విషయం నేను మా నాన్నతో చెప్తాను అనగానే.. మనోహరి చెప్పు అప్పుడు మీ నాన్న ప్రాణాలతో ఉండడు.. నువ్వు ప్లాష్‌ బ్యాక్‌ గుర్తు చేస్తే మరుక్షణమే మీ నాన్నకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ వస్తుంది. అది హర్ట్‌ స్టోక్‌తో డేంజర్‌.. అది వచ్చిన వెంటనే మీ నాన్న చనిపోతాడు. మీ నాన్నను చంపుకోవడం నీకు ఇష్టమా అంటూ మనోహరి అడగ్గానే.. పక్కనే ఉన్న యాదమ్మ ఊరుకోండి మేడం ఏ కూతురైనా కన్న తండ్రిని చంపుకోవాలని చూస్తుందా..? ఇప్పటికే కన్న తండ్రి లేడు ఇప్పుడు కన్నతండ్రి కూడా లేకపోతే ఎలా..? ఈ పాపకు వాళ్ల నాన్నంటే ప్రాణం వాళ్ల నాన్న కోసం ఏమైనా చేస్తుంది అంటూ చెప్తుంది.  మనోహరి, రణవీర్‌ కూడా అంజును భయపెడతారు. దీంతో అంజు ఏడుస్తూ తన రూంలోకి వెళ్లిపోతుంది.

మరుసటి రోజు ఉదయం యాదమ్మ, అంజు బట్టలు సర్దుతుంటుంది. పిల్లలు అందరూ ఏడుస్తూ కూర్చుని ఉంటారు. కింద హాల్లో ఉన్న అమర్‌ ఆలోచిస్తుంటాడు. మిస్సమ్మ, రాథోడ్‌ బాధపడుతుంటారు. మనోహరి, రణవీర్‌ మాత్రం హ్యాపీగా నవ్వుకుంటుంటారు. పైన బట్టలు బ్యాగులో వేసిన యాదమ్మ నువ్వు త్వరగా కిందకు రా అంజు కింద నిన్ను సాగనంపడానికి మా నాన్న అందరూ ఎదురుచూస్తున్నారు అని చెప్పి వెళ్లిపోతుంది. పిల్లలు ఏడుస్తుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×