E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today May 20th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు సీక్రెట్‌ చెప్పిన మనోహరి – దిమ్మ తిరిగిపోయిన చిత్ర   

Nindu Noorella Saavasam Serial Today May 20th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: చిత్రకు సీక్రెట్‌ చెప్పిన మనోహరి – దిమ్మ తిరిగిపోయిన చిత్ర   
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  రూంలో ఒంటరిగా కూర్చున్న మిస్సమ్మ దగ్గరకు వీల్‌చైర్‌ తీసుకుని వచ్చి సార్‌ నిన్ను బయటకు తీసుకురమ్మన్నారు అని చెప్తాడు రాథోడ్‌. మిస్సమ్మ తాను రానని చెప్తుంది. ఇంతలో లోపలికి అమర్‌ వస్తాడు. తనకేమి తెలియనట్టు మిస్సమ్మ లాన్‌లో కూర్చుంటే బాగుండు అనుకున్నాను కానీ ఇప్పుడు ఆ చాన్స్‌ కూడా లేకుండా పోయింది అని బాధపడుతుంది. ఇంతలో రాథోడ్‌ అమ్మా మిస్సమ్మ మిమ్మల్ని సారును ఎలా కలపాలా అని మేము బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే.. ఒక్క సెకనులో ప్లాన్‌ చేసి నన్ను ఎగ్జిక్యూట్‌ కూడా చేస్తున్నావా..? అని మనసులో అనుకుంటాడు. ఇంతలో మిస్సమ్మ సరేలే రాథోడ్‌ నాకు లాన్‌లో కూర్చుని కాఫీ తాగే అదృష్టం కూడా లేదనుకుంటా.. ఆ కాఫీ ఏదో ఇక్కడికే తీసుకురా అని చెప్తుంది.

రాథోడ్‌ కూడా అలాగే మిస్సమ్మ పాపం నిన్ను చూస్తుంటే.. చాలా బాధగా ఉంది. ఒక్క కాఫీ కూడా నువ్వు అనుకున్నట్టు తాగలేకపోతున్నావు నేను.. వెళ్లి కాఫీ తీసుకుని వస్తాను.. మిస్సమ్మ నేను వెళ్తున్నా… అని వెళ్లబోతుంటే.. అమర్‌ రాథోడ్‌ ఆగు.. అంటూ వెళ్లి మిస్సమ్మను తన చేతులతో ఎత్తుకుని లాన్‌లోకి తీసుకెళ్తాడు. అమర్‌, మిస్సమ్మను ఎత్తుకుని లాన్‌లోకి తీసుకుని రావడం అక్కడే కాఫీ తాగుతున్న మనోహరి చూస్తుంది. ఇరిటేటింగ్‌గా నిన్న దీని ప్రాణం తీయకుండా చాలా పెద్ద తప్పు చేశాను అనుకుంటుంది. అమర్‌ లాన్‌లో కూర్చోబెట్టగానే.. మిస్సమ్మ చాలా థాంక్స్‌ అండి మీరు కూడా కూర్చోండి అని చెప్తుంది. అమర్‌ సరేనని కూర్చుని కాఫీ కలుపుతుంటాడు. ఇంతలో మిస్సమ్మ.. మనోహరిగారు చెప్పడం మర్చిపోయాను సారీ అండి.. అంటుంది.

Advertisement

దీంతో అమర్‌.. మిస్సమ్మ మనోరికి ఎందుకు సారీ చెప్తున్నావు అని అడుగుతాడు. ఎందుకేంటండి ఇవాళ మనోహరి గారిని నలుగురు నాలుగు మాటలు అంటున్నారు అంటే దానికి కారణం నేనే కదా అంటుంది. దీంతో మనోహరి కోపంగా నన్ను ఎవరు ఏమి అంటున్నారు అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ ఆయనతో అవ్వాల్సిన మీ పెళ్లి పీటల మీదనే ఆగిపోవడానికి కారణ నేనే అని మీరు నా మీద పగ పెంచుకున్నారు అంటున్నారు. నా అడ్డు ఎలాగైనా తొలగించిన మీరు మళ్లీ ఆయన్ని పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నావు అని అంటున్నారు. ఏ సబంధం వచ్చినా పెళ్లి చేసుకోవడం లేదని ఇంకా ఈ ఇంట్లోనే ఉంటున్నావు అంటున్నారు అని చెప్పగానే.. ఏయ్‌ ఏం మాట్లాడుతున్నావు.. నేను ఏమీ అలా అనుకోవడం లేదు.. అంటుంది మనోహరి. దీంతో మిస్సమ్మ  అరే నాకు తెలియదా మనోహరి గారు మీరు అలా అనుకోరు అని కానీ నలుగురు అంటున్నారు అంటున్నాను.. అంటే వాళ్లకు మీ గురించి పూర్తిగా తెలియదు కదా..? ఇందాక కరుణతో మాట్లాడుతుంటే మీరు కావాలనే నన్ను కింద పడేశారేమోనని తనకు డౌటుగా ఉందని చెప్పింది అనగానే.. మనోహరి షాక్‌ అవుతుంది. భయంగా ఏయ్‌ నేను పడేయడం ఏంటి..? అమర్‌ భాగీ పడ్డప్పుడు నేను అసలు లేనే లేను అంటుంది.

ఇంతలో మిస్సమ్మ.. మనోహరి గారు నేను కరుణకు చెప్పానులే నేను కింద పడటానికి మనోహరిగారికి ఎలాంటి సంబంధం లేదని .. కరుణ అంటే నా  ఫ్రెండు కాబట్టి చెప్పగలిగాను. ఇలా నీ గురించి తప్పుగా అనుకునే అందరికీ నేను చెప్పలేను కదా మనోహరి గారు. నా వల్ల ఇన్ని మాటలు పడాల్సి వస్తుంది కదా అని మీకు సారీ చెప్తున్నాను. అదే మీరు ఒక ఇంటి కోడలు అయి ఉంటే ఇన్ని మాటలు పడాల్సి వచ్చేది కాదు. ఏమంటారు అండి.. అంటూ అమర్‌ ను అడగ్గానే.. అమర్‌ అవును భాగీ.. కరెక్టుగా చెప్పావు.. అమ్మవాళ్లు మనుకు సంబంధం చూప్తా అని చెప్పారు ఇప్పుడే వెళ్లి ఆ విషయం ఎంత వరకు వచ్చిందో కనుక్కుంటాను అని చెప్పి అమర్‌ లోపలికి వెళ్లబోతుటే.. మనోహరి కంగారుగా పర్వాలేదు అమర్‌ ఎవరు ఏమనుకున్నా నాకు బాధగా లేదు అని చెప్తుండగానే.. అమర్‌ వెళ్లిపోతాడు. దీంతో మనోహరి కోపంగా మిస్సమ్మను చూస్తూ.. ఏయ్‌ నిజం చెప్పు ఎవ్వరూ అలా అనలేదు కదా.. ?     నువ్వే కావాలని అన్నావు కదా..?  అని అడగ్గానే.. మిస్సమ్మ ఏంటి మను నీకు ఇంకా డౌటు గానే ఉందా..? నీకు ఈ పాటికే క్లారిటీ వచ్చింది అనుకున్నానే అంటూ కాఫీ తాగుతుంటుంది. మనోహరి కోపంగా అక్కడి నుంచి లోపలికి వెళ్లిపోతుంది.

Advertisement

తర్వాత మనోహరి కోసం చిత్ర  ఇంటికి వస్తుంది. ఎవ్వరూ లేరు కదా అని మెల్లగా మనోహరి రూంలోకి వెళ్తుంది. అయితే చిత్ర ఇంటికి రావడం మిస్సమ్మ పై నుంచి గమనిస్తుంది. వీళ్లిద్దరి మధ్య ఏదో జరుగుతుంది. అదేంటో తెలుసుకోవాలి అని మనోహరి రూం కిటికీ దగ్గకు వెళ్లి చూస్తుంది మిస్సమ్మ.. రూంలోకి వెళ్లిన చిత్రను ఇంత లేట్‌ అయిందేంటి త్వరగా రమ్మని చెప్పాను కదా.. అంటూ కోప్పడుతూ.. బ్యాగు చిత్ర చేతిలో పెడుతూ తీసుకో అంటుంది. బ్యాగ్‌ తీసుకుని ఈ బ్యాగ్‌ ఏంటి మను అంటూ ఓపెన్‌ చేసి చూసి అందులోని డబ్బు బయటకు తీసి ఇంత డబ్బా దేనికి అని అడుగుతుంది. కిటికీలోంచి చూస్తున్న మిస్సమ్మ షాక్ అవుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×