E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode May 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కొత్త ప్లాన్      

Nindu Noorella Saavasam Serial Today Episode May 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి కొత్త ప్లాన్      
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: రూంలో కూర్చున్న అమర్‌, మనోహరి, చంభా చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటూ ఆలోచిస్తుంటాడు. మరోవైపు మనోహరి, చంభాను స్టోర్ రూంలోకి తీసుకెళ్తుంది. చంభా భయంగా ఏంటి మనోహరి నన్ను స్టోర్‌ రూంలోకి తీసుకొచ్చావు. ఇందాక పడిన గొడవ ఇంకా గుర్తు పెట్టుకున్నావా..? అందుకే నన్ను స్టోర్‌ రూంలోకి తీసుకొచ్చావా…? అని అడగ్గానే.. అదేం లేదు చంభా ఆ గొడవ నేను అక్కడే మర్చిపోయాను.. ఈపాటికి అమర్‌ తన గతం గురించి ఆలోచిస్తుంటాడు. అనగానే.. పైన కూర్చున్న అమర్‌ నిజంగా నేను అమరేంద్రనేనా..? ఇది నా ఇల్లేనా..? అనుకుంటుంటాడు. మనోహరి కూడా కింద మనం చెప్పింది నిజమా కాదా..? అని క్యాలికిలేట్‌ చేసుకుంటూ ఉంటాడు. అని చెప్పగానే..

అమర్‌ నిజంగా ఆ పిల్లలు అనాథ పిల్లలా..? భాగీ వాళ్ల కేర్‌ టేకరా…? రాథోడ్‌ ఈ ఇంటి పనిమనిషా..? మనోహరి నేను ప్రేమించుకున్నామా..? మేము పెళ్లి చేసుకోవాలి అనుకున్నామా..? అంతా అయోమయంగా ఉంది అనుకుంటాడు. కింద మనోహరి తన డౌట్స్‌ను క్లారిఫై చేసుకోవాలి అనుకుంటాడు అని చెప్పగానే.. చంభా గతానికి సంబంధించి ఏ విషయం గుర్తు లేని వాడు మనం చెప్పింది నిజమా అబద్దమా… అని ఎలా తెలుసుకుంటాడు అనగానే.. మనోహరి ఏముంది నిజం కోసం వెతుకుతాడు అని చెప్పగానే.. చంభా ఎక్కడ వెతుకుతాడు అని అడుగుతుంది. దీంతో మనోహరి తన గదిలో అని చెప్పగానే.. పైన అమర్‌ ఈ ఇంట్లో వాళ్లు నా దగ్గర ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది. వాళ్లు చెప్పింది నిజమైతే ఈ గదిలో నా గతానికి సంబంధించిన ఒక్క ఆధారం అయినా దొరుకుతుంది కదా..? అనుకుంటూ గదిలో అటూ ఇటూ చూస్తుంటాడు. కింద చంభా అనుమానంగా ఆ గదిలో అమర్‌ సార్‌, భాగీ, పిల్లలు కలిసి ఉన్న ఫోటోలు చాలా ఉన్నాయి కదా సార్‌ వాటిని చూస్తే.. అనగానే..

Advertisement

మనోహరి కచ్చితంగా చూస్తాడు అనగానే.. కప్‌బోర్డులో సార్‌ అవి చూస్తే షాక్‌ అవుతాడు కదా అనగానే.. మనోహరి హెవీ షాక్‌ అవుతాడు అంటుంది. చంభా అంటే సార్‌కు భాగీ తన భార్య అని వాళ్లు తన పిల్లలు అని తెలిసిపోయినట్టే కదా అనగానే.. మనోహరి ఏమీ తెలియదు అంటుంది. దీంతో చంభా ఎందుకు తెలియదు. ఆ ఫోటోలన్నీ కప్‌బోర్డులోనే కదా ఉన్నాయి అనగానే.. మనోహరి పొద్దున వరకు ఉన్నాయి. ఇప్పుడు లేవు అని చెప్తుంది. పైన రూంలో కప్‌బోర్డు తెరచి చూసిన అమర్‌ కప్‌బోర్డు అంతా ఎంటీగా ఉందేంటి..? నా గతానికి సంబంధించిన ఆధారాలు ఏమీ లేవు అనుకుంటూ ఉంటాడు. కింద చంభా మరి అవి ఎక్కడ ఉన్నాయి మనోహరి అని అడగ్గానే.. మనోహరి తాను స్టోర్‌ రూంలోకి తీసుకొచ్చిన బ్యాగు చూపిస్తూ.. ఇదిగో ఈ బ్యాగులో ఉన్నాయి. ఎందుకైనా మంచిదని పొద్దున్నే అమర్‌ గదిలోకి వెళ్లి ఆధారాలన్నీ ఈ బ్యాగులో పెట్టి తీసుకొచ్చాను అని చెప్పగానే.. చంభా నవ్వుతూ.. నువ్వు చాలా తెలివైన దానివి మనోహరి నీకు చాలా ముందు చూపు ఉంది అనగానే..

మనోహరి ఇన్ని ఎదురుదెబ్బలు తిన్న తర్వాత కూడా ఆ మాత్రం ఆలోచించకుండా ఎలా ఉంటాను చంభా.. ఇప్పుడు అమర్‌కు దిక్కు తోచదు. తన గతానికి సంబంధించి ఏదీ దొరకదు. మనం ఏం చెప్తే అదే నిజమని నమ్ముతాడు అనగానే.. పైన అమర్‌ కూడా మనోహరి, యాదమ్మ చెప్పిందే నిజమా..? అదే నా గతమా అనుకుంటాడు. కింద మనోహరి ఒక్కసారి నన్ను నమ్మడం మొదలుపెట్టాడంటే నా గెలుపు దాదాపు కరారు అయినట్టే.. ఆ నమ్మకాన్ని  రోజురోజుకు బలపరిచి అమర్‌ను పూర్తిగా నా వైపు తిప్పుకుని పూర్తిగా నా సొంతం చేసుకుంటాను అని చెప్పగానే.. చంభా మాత్రం అనుమానంగా కానీ అమర్‌ సార్‌ భాగీ గురించి పిల్లల గురించి ఆలోచించకుండా ఉంటారా..? అని అడగ్గానే.. పైన అమర్‌ కూడా భాగీని పిల్లలను చూస్తుంటే.. ఏదో అనుమానంగా ఉంది. నా వంక చూస్తున్న వాళ్ల కళ్లల్లో కన్నీళ్లు ఎందుకు ఉన్నాయి.. నా గురించి వాళ్లు ఎందుకు బాధపడుతున్నారు అనుకుంటాడు.

Advertisement

మనోహరి మాత్రం అమర్‌ వాళ్ల గురించి ఆలోచించకుండా చేస్తాను. పూర్తిగా నా కంట్రల్‌లోకి తెచ్చుకుంటాను అంటుంది మనోహరి దీంతో చంభా నువ్వు ఇన్ని చేస్తుంటే భాగీ చూస్తూ ఊరుకుంటుందా..? అని అడగ్గానే.. ఈ బ్యాగు లాగే భాగీ జీవితం పూర్తిగా చీకట్లో కలిసిపోయేలా చేస్తానని చెప్తుంది మనోహరి. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×