E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను అనుమానించిన మనోహరి  

Nindu Noorella Saavasam Serial Today march 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను అనుమానించిన మనోహరి  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మనోహరి అనుమానంగా భాగీ నువ్వు నన్ను అమర్‌ను కలిపే పనిలోనే ఉన్నావు కదా నువ్వు అందుకే వచ్చావు కదా..? అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ అవును మనోహరి ఆ పని మీదే ఉన్నాను అని చెప్పగానే.. ఫ్లీజ్‌ తొందరగా ఆ పని చేయవా..? లేదంటే తేడాలు వచ్చేలా ఉన్నాయి అంటుంది మనోహరి. ఓ ష్యూర్‌ అని చెప్తుంది మిస్సమ్మ. అంతా గమనిస్తున్న చంభా ఓసి పిచ్చి మనోహరి ఇంకా ఇప్పటికీ అలాగే నమ్ముతున్నావా..? ఆ భాగీ నీ కొంప కొల్లేరు చేయడానికే వచ్చింది అని మనసులో అనుకుంటుంది.

తర్వాత అమర్, రాథోడ్‌ ఆలోచిస్తుంటారు.. అమర్‌ కోపంగా యాదమ్మ భయంతో వ్యానులోంచి దూకేసింది. అనగానే.. అవును సార్‌ అంటాడు రాథోడ్‌..  మనోహరి కూడా భయంతో వ్యానులోంచి దూకేసింది. అనగానే.. అది జగమెరిగిన సత్యం కదా సార్‌ అంటాడు రాథోడ్‌. కానీ భాగీ మాత్రం ధైర్యంగా పిల్లల కోసం వ్యానులోనే ఉండిపోయింది అని చెప్పగానే.. రాథోడ్‌ అది మిస్సమ్మ నైజం సార్ మిస్సమ్మకు అణువణువునా పిల్లలపై ప్రేమ ఉంది సార్‌ అని చెప్పగానే.. అమర్.. భాగీ రిస్క్‌ చేసి పిల్లలను కాపాడింది అనగానే.. ఎస్‌ సార్‌ అది మిస్సమ్మ వల్లే సాధ్యం సార్‌.. తను కేర్‌ టేకర్‌గా వచ్చినప్పటి నుంచి ఇప్పటికీ తన కర్తవ్యాన్ని బాధ్యతను ప్రేమను అసలు మర్చిపోలేదు సార్‌.. ఈరోజు తన ప్రాణం పోయినా పిల్లలను వదిలేసేది కాదు సార్‌ మిస్సమ్మ.. దటీజ్‌ మిస్సమ్మ సార్‌ అని చెప్పగానే..

Advertisement

అమర్‌ కోపంగా మరి అలాంటి భాగీ నన్ను పిల్లలను వదిలేసి ఐదేళ్ల పాటు ఎక్కడికి వెళ్లినట్టు.. ఎందుకు వెళ్లినట్టు.. అంత ప్రేమ బాధ్యత ఉన్నది అలా ఎలా వెళ్లింది. కనీసం నాకు చెప్పకుండా ఎందుకు వెళ్లింది అంటూ అమర్‌ అడుగుతుంటే.. రాథోడ్‌ అది నాకు తెలియదు సార్ అంటాడు. దీంతో అమర్ ఎందుకు తెలియదు రాథోడ్‌ అని అడగ్గానే.. మీకు తెలియకపోతే నాకు ఎలా తెలుస్తుంది సార్‌ అని అడగ్గానే.. మరి తన గురించి ఎందుకు అంతలా ఎలివేషన్‌ ఇచ్చావు అని అమర్‌ అడగ్గానే.. మిస్సమ్మ గురించి నేను చెప్పింది నిజమే కదా సార్‌ అంటాడు రాథోడ్‌.. అయితే తను ఎందుకు వెళ్లింది అనే నిజం నాకు తెలియాలి.. అలాగే నా కూతురు ఎక్కడుందో కూడా నాకు తెలియాలి అని అడగ్గానే.. రాథోడ్‌ అది బ్రహ్మరహస్యం సార్‌ అంటాడు..

అమర్‌ మాత్రం అది బ్రహ్మరహస్యం కాదు.. నేను తెలుసుకుంటాను.. అని చెప్పగానే.. రాథోడ్‌ అనుమానంగా అంటే మిస్సమ్మను అడుగుతారా..? సార్‌ అనగానే.. ఊరికే అడగడం కాదు దబాయించి అడుగుతాను.. అంటాడు… రాథోడ్‌ మాత్రం మిస్సమ్మ ఇప్పుడే ఈ విషయం చెప్పను అంటుంది కదా సార్‌ మరి ఎలా చెప్పిస్తారు.. అని అడగ్గానే.. రాథోడ్‌ నేను ఎవర్ని అని అమర్‌ అడగ్గానే.. మీరు అమరేంద్ర సార్‌ అని చెప్పగానే.. ఉట్టి అమరేంద్ర కాదు ఆర్మీ లెప్టినెంట్‌ జనరల్‌ అమరేంద్ర. శత్రుదేశాల సైన్యాలతో కూడా సీక్రెట్‌ కక్కించిన నేను ఆప్ట్రాల్ ఒక ఆడపిల్ల నోటి నుంచి నిజాల్ని రాబట్టలేనా..? అది నాకు మంచినీళ్లు తాగినంత ఈజీ రాథోడ్‌.. అని చెప్పగానే.. రాథోడ్‌ ఆశ్చర్యంగా ఆవిడ మిస్సమ్మ సార్‌ అంటాడు.. అమర్‌ కూడా అయితే సో వాట్‌ నా సంగతి నీకు తెలుసు కదా..? అనగానే.. రాథోడ్‌ ఆ తెలుసు సార్‌ .. వెళ్లండి సార్‌ వెళ్లి మిస్సమ్మను అడగండి అని చెప్పగానే.. చిటికెలో చేధిస్తాను అంటూ అమర్‌ వెళ్తాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×