E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today March 29th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మీనన్‌కు సాయం చేసిన మనోహరి – అనుమానించిన అమర్‌  

Nindu Noorella Saavasam Serial Today March 29th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మీనన్‌కు సాయం చేసిన మనోహరి – అనుమానించిన అమర్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : స్కూల్‌ పంక్షన్‌ లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తున్న మీనన్‌కు మనోహరి కనిపిస్తుంది. వెంటనే మనోహరికి ఫోన్‌ చేస్తాడు మీనన్. మీనన్‌ మాటలు విని షాక్‌ అవుతుంది మనోహరి. ఎక్కడున్నాడు అని అటూ ఇటూ చూస్తుంది. పక్కనే ఉన్న బిల్డింగ్‌ మీద మీనన్‌ కనిపిస్తాడు. మనోహరి షాకింగ్ గా చూస్తుంటే.. మీనన్‌ ఏంటి మనోహరి ఎలా ఉన్నావని అడిగితే ఏం చెప్పట్లేదు అంటాడు. దీంతో మనోహరి నీకేం కావాలి మీనన్‌.. నాకెందుకు ఫోన్‌ చేశావు అని అడుగుతుంది. దీంతో మీనన్ నీలో నాకు నచ్చే విషయం ఇదే మనోహరి.. స్ట్రెయిట్‌గా పాయింట్‌కు వచ్చేస్తావు. ఇచ్చిన పని క్లీన్‌గా చేస్తావు అంటాడు మీనన్‌. దీంతో మనోహరి నీకు నాతో ఏం పని ఉందో తెలియదు కానీ నేనైతే చేయలేను. ఇంకెప్పుడు నాకు ఫోన్‌ చేయకు అంటుంది.

దీంతో మీనన్‌.. ఫోన్‌ కట్‌ చేస్తే నా నెక్ట్స్‌ కాల్‌ అమర్‌కు వెళ్తుంది. అమర్‌కు నీ బెంగాళీ మొగుడి గురించి నీ పంతం గురించి తెలియదు అనుకుంటా.. చెప్పేయన్నా అంటూ మీనన్‌ బెదిరించడంతో వద్దు నీకేం కావాలో చెప్పు అని మనోహరి అడుగుతుంది. దీంతో మీనన్ మేము లోపలికి రావాలి. అమర్‌ సెక్యూరిటీ వల్ల లోపలికి రాలేకపోతున్నాము అంటాడు. దీంతో మనోహరి భయంగా అమర్‌కు విషయం తెలిస్తే నన్ను చంపేస్తాడు అంటుంది. దీంతో మీనన్‌ నేను ఫోన్‌ చేసి నిజం చెప్పినా చంపేస్తాడు. కానీ నేను అలా చేయను. నీకు 50 లక్షల డబ్బు ఇస్తాను.. ఆలోచించుకో మనోహరి అంటాడు మీనన్‌. దీంతో  మనోహరి సరే అంటుంది. కొద్ది టైం ఇవ్వండి నేనే ఫోన్‌ చేస్తాను అంటూ కాల్ కట్‌ చేసి ఇంత మందిని దాటుకుని వాళ్లను లోపలికి ఎలా తీసుకురావాలి అని ఆలోచిస్తుంది.

Advertisement

లోపల పిల్లలు రెడీ అవుతుంటారు. ఇంతలో ఒక టీచర్‌ వచ్చి అమ్మును రెడీ ఉండమని చెప్పి వెళ్తాడు. సరే అంటుంది అమ్ము. ఇక మిస్సమ్మ అమ్ము అన్ని స్టెప్స్‌ గుర్తు ఉన్నాయి కదా..?ఆడియన్స్‌ లో నేను ఉంటాను. భయం అనిపిస్తే నన్ను చూడు అంటూ ధైర్యాన్ని ఇస్తుంది. పక్కనే ఉన్న అంజును చూసి దగ్గరకు వెళ్లగానే.. అంజు మిస్సమ్మ ఏమైంది నీకు రెండు రోజుల నుంచి నన్ను జాలిగా చూస్తున్నావు. డిఫరెంట్‌గా మాట్లాడుతున్నావు అని అడుగుతుంది. దీంతో  మిస్సమ్మ అంజు అనాథ అని తెలిసినప్పటి నుంచి నాకు తెలియకుండానే నేను తేడా చూపిస్తున్నట్టున్నానేమో.. దీనికి భయపడి ఆయన నిజాన్ని దాచినట్టు ఉన్నారు అని మనసులో అనుకుంటూ.. బయటకు మాత్రం అంటే నీకు డ్రామాలో పూర్ క్యారెక్టర్‌ ఇచ్చారు కదా నిన్ను చూసి జాలిపడుతున్నాను అంటుంది. ఇంతలో అమ్ము, మిస్సమ్మ నా పర్ఫార్మెన్స్‌ కు టైం అయింది. ఇంకా డాడీ రాలేదేంటి అని అడుగుతుంది. దీంతో మిస్సమ్మ నేను వెళ్లి తీసుకొస్తాను అని బయటకు వెళ్తుంది.

బయటకు కంగారుగా వెళ్లిన మిస్సమ్మ, అమర్‌కు డాష్‌ ఇస్తుంది. అది బాడీయా బండరాయా..? అయినా ఏంటా కంగారు.. కొంచెం చూసుకుని నడవొచ్చు కదా అంటుంది. దీంతో అమర్‌ కోపంగా ఏయ్‌ లూజ్‌ చూసుకోకుండా వచ్చింది నువ్వు అయినా నువ్వు బయట తిరుగుతున్నావేంటి..? అని అమర్‌ అడగ్గానే.. మీ కోసమే వచ్చాను అమ్ము పర్ఫామెన్స్‌ స్టార్ట్‌ అవుతుంది మీరు రండి అంటుంది. దీంతో అమర్‌ నేను వర్కులో ఉన్నాను కదరదు అంటాడు. దీంతో మిస్సమ్మ అమాయకంగా అమర్‌ను బతిమాలుతుంది. దీంతో అమర్‌ సరే అంటాడు.  దీంతో అమ్ము పర్ఫామెన్స్‌ స్టార్ట్‌ అవుతుంటే.. మిస్సమ్మ, అమర్‌ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్తుంది. అమ్ము డాన్స్‌ అదరగొడుతుంది.

Advertisement

అమర్‌, మిస్సమ్మ, అనామిక హ్యాపీగా ఉంటారు. ఇంతలో మినిస్టర్‌ వస్తున్నాడని తెలియడంతో అమర్‌ గేటు దగ్గరకు వెళ్తాడు. అక్కడ అనుమానంగా చూస్తుంటే అక్కడే ఉన్న పోలీస్‌ ఏమైంది సార్‌ అలా చూస్తున్నారు అని అడుగుతుంది. దీంతో అమర్‌ ఆ రౌడీలు ఇక్కడకు వచ్చి రెక్కీ నిర్వహించి.. అటాక్‌ చేయాలనుకున్నారు. కానీ ఇంకా అటాక్‌ చేయలేదు ఎందుకని ఆలోచిస్తున్నాను అంటాడు అమర్‌. ఎక్కడో ఏదో తప్పు జరుగుతుంది అంటాడు. మరోవైపు స్కూల్‌ లోపలికి వెళ్లి బ్లూ ప్రింట్‌ చూస్తూ.. మనోహరి.. స్కూల్ లోపలికి రావడానికి మీనన్‌కు దారి చెప్తుంది. మీనన్ తన మనుషులను తీసుకుని అదే దారిలో వస్తుంటే.. అమర్‌ కూడా అక్కడికి వెళ్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×