E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్ ను పార్టీకి పిలిచిన అమర్  

Nindu Noorella Saavasam Serial Today march 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రణవీర్ ను పార్టీకి పిలిచిన అమర్  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  రణవీర్‌ ఇంటికి వెళ్లిన అమర్‌ తమ ఇంట్లో జరిగే పార్టీకి రమ్మని పిలుస్తాడు. దీంతో రణవీర్‌ షాక అవుతాడు. ఫ్రెండ్లీగా పిలుస్తున్నానని చెప్పి అమర్ వెళ్లిపోతాడు. అమర్‌ వెళ్లిపోయాక రణవీర్‌ టెన్షన్‌ పడుతుంటాడు. లాయరుతో తనను ఎందుకు పిలిచాడని ఏమై ఉండొచ్చని అడుగుతాడు. దీంతో లాయరు ప్రెండ్లీగా పిలిచానని ఆయనే చెప్పారు కదా అని లాయరు చెప్పగానే.. ఇప్పుడు అమరేంద్రకు తనతో శత్రుత్వం తప్ప వేరే లేదు కదా అనగానే.. లాయరు శత్రుత్వం మాత్రమే ఎందుకు ఉండాలి సార్‌. పార్టీకి వెళ్లండి మీ కూతురు గురించి ఏమైనా తెలుస్తుందేమో..? అని లాయరు చెప్పగానే.. ఓకే అమరేంద్ర ఇలా ఇన్వైట్‌ చేసినట్టు మనోహరికి తెలుసా లేదా లాయరు అని చెప్పగానే.. ఈ విషయం డైరెక్టుగా మనోహరి గారిని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది సార్‌ అని చెప్తాడు.

కట్‌ చేస్తే.. మనోహరి, రణవీర్‌ దగ్గర ఉంటుంది. విషయం తెలిసి షాక్‌ అవుతుంది. ఏంటి రణవీర్‌ నువ్వు చెప్పేది అంటూ ఆశ్చర్యపోతుంది. మరోవైపు ఇదే విషయం మిస్సమ్మకు చెప్తుంటాడు రణవీర్‌. అవును మిస్సమ్మ సారే స్వయంగా వెళ్లి రణవీర్‌ను పార్టీకి పిలిచారు అని చెప్తాడు. దీంతో మిస్సమ్మ అదేంటి రణవీర్‌ కనిపిస్తే కాల్చేయాలి అన్నంత కోపంగా ఆయన పార్టీకి ఎలా పిలిచారు అని అడుగుతుంది. మరోవైపు రణవీర్‌ కూడా అదే నాకు అర్థం కావడం లేదు మనోహరి.. అమరేంద్ర మైండ్‌లో ఏముందో తెలియడం లేదు అని చెప్పగానే.. మనోహరి కూడా ఈ రోజు ఉదయం నుంచి ఆ ఇంట్లో చిత్రవిచిత్రాలు జరుగుతున్నాయి. కాశ్మీర్‌ నుంచి అమర్ ఫ్రెండ్‌ లాల్‌సింగ్‌ వచ్చారు అని చెప్పగానే.. మరోవైపు మిస్సమ్మ కూడా ఉదయం సింగ్‌ గారు అంజు గురించి టంగ్‌ స్లిప్ అవ్వడం ఆ మాట పట్టుకుని మనోహరి అంజు గురించి ఎంక్వైరీ చేయడం.. తర్వాత ఆయన ఈవెనింగ్‌ గెట్‌ టు గెదర్‌ ఏర్పాటు చేయడం.. ఇప్పుడు ఆయన రణవీర్‌ను పార్టీకి పిలవడం ఇదంతా దేనికో దారి తీయబోతుంది రణవీర్‌ అంటూ అనుమానిస్తుంది.

Advertisement

రాథోడ్‌ మాత్రం సార్‌ ఊరికే ఏదీ చేయరు మిస్సమ్మ.. సార్‌ మైండ్‌లో ఏదో ఉంది. అంటాడు.. మరోవైపు మనోహరి కచ్చితంగా అమరేంద్ర ఏదో మాస్టర్‌ ప్లాన్ వేశాడు రణవీర్‌ ఈవెనింగ్‌ నువ్వు పార్టీకి రావొద్దు.. అని చెప్పగానే.. నేను రాకపోతే బాగుండదేమో మనోహరి నా మీద అమరేంద్రకు డౌటు వస్తుందేమో అంటాడు.. అంటే పార్టీకి రాకపోతే చంపేస్తానని అమరేంద్ర గారు వార్నింగ్‌ ఇచ్చి మరీ వెళ్లారు మేడం అని లాయరు చెప్తాడు. ఇంకోవైపు మిస్సమ్మ కూడా వార్నింగ్‌ ఇచ్చి మరీ పార్టీకి పిలిచారంటే.. సాయంత్రం ఆయన ఏం చేయబోతున్నారు రాథోడ్‌ అని అడగ్గానే.. ఏమో మిస్సమ్మ సారు ఏ విషయం నాతో చెప్పలేదు అంటాడు. మరోవైపు మనోహరి కూడా అమరేంద్ర నాతో కూడా ఏ విషయం ఓపెన్‌ అవ్వడం లేదు.. అసలు గెట్‌ టూ గెదర్‌ ఎందుకో కూడా క్లారిటీ లేదు.. అనగానే.. ఒకవేళ మన కూతురు గురించి ఏదైనా చెప్పబోతున్నారేమో అందరి ముందు మన కూతురు ఎవరో ఎనౌన్స్ చేయబోతున్నారేమో అటూ రణవీర్‌ అనుమానం వ్యక్తం చేస్తాడు.

మరోవైపు మిస్సమ్మ కూడా ఆ విషయం అనౌన్స్‌ చేయాలనుకుంటే మన దగ్గర ముందే డిస్కషన్‌ చేసేవారు కదా రాథోడ్ అంటుంది మిస్సమ్మ. దీంతో రాథోడ్‌ కూడా కరెక్టే మిస్సమ్మ మీతో చెప్పకపోయినా కనీసం నాతో అయినా మాట్లాడేవారు అంటూ రాథోడ్ చెప్తాడు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×