E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరిని ట్రాప్ చేసిన అమర్

Nindu Noorella Saavasam Serial Today march 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మనోహరిని ట్రాప్ చేసిన అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  అమర్‌ కోపంగా అందరినీ హాల్లోకి పిలుస్తాడు. దీంతో అందరూ హాల్లోకి రాగానే.. అమర్‌ కోపంగా చూస్తుంటాడు. ఇంతలో మనోహరి కిందకు వచ్చి యాదమ్మతో ఏంటి అందరూ సీరియస్ గా ఉన్నారు ఏమైంది అని అడగ్గానే.. నువ్వు అంజు గురించి ఎంక్వైరీ చేస్తున్నట్టు అమరేంద్రకు తెలిసిపోయినట్టు ఉంది.. అని చెప్పగానే.. మనోహరి భయంగా ఎలా తెలిసింది అని అడుగుతుంది. దీంతో చంభా అదిగో  ఆ సింగ్‌ వాళ్లే చెప్పినట్టు ఉన్నారు అంటుంది. ఇంతలో మిస్సమ్మను రాథోడ్ సార్‌ ఎందుకు మనోహరిని పిలిచాడు అని అడగ్గానే.. మిస్సమ్మ ఏంటో తెలియదు చూద్దాం పద అని కిందకు వస్తారు. ఇంతలో కింద ఉన్న మనోహరి, అమర్‌ దగ్గరకు వెళ్లి అమర్‌ ఎందుకు పిలిచావు అని అడుగుతుంది.

దీంతో అమర్‌ కోపంగా నువ్వు పైన ఏం చేస్తున్నావు మనోహరి అని అడగ్గానే. అది నేను సింగ్‌ గారికి ఏమైనా కావాలేమో అడుగుదామని వెళ్లాను.. అని చెప్పగానే.. అంజు కూడా మీరు మా రూంలోకి కూడా వచ్చారు కదా ఆంటీ నన్ను క్వశ్చన్స్ కూడా అడిగారు కదా  అని చెప్పగానే.. అమర్‌ కోపంగా ఏం క్వశ్చన్స్‌ అడిగింది అంజు అనగానే.. అది డాడ్‌ అని అంజు ఏదో చెప్పబోతుంటే.. మిస్సమ్మ కల్పించుకుని తన చదువు గురించి, హోం వర్క్‌ గురించి అడుగుతుంది అండి.. అంతే కదా మనోహరి అనగానే.. మనోహరి అవును అదే.. అనగానే.. అంజు కాదు మిస్సమ్మ నన్ను మనోహరి ఆంటీ వేరే విషయాల గురించి అడిగింది అని చెప్పగానే.. చంభా భయంతో వణికిపోతూ.. అంజు జన్మరహస్యం గురించి.. అడిగిందని తెలిస్తే.. మనోహరి రణవీర్‌ భార్యే అని తెలిసిపోతుందేమోనని భయపడుతుంది.

Advertisement

ఇంతలో రాథోడ్‌ ఆ విషయాలు తర్వాత మాట్లాడుకుందాం అంజు పాప.. ఇంతకీ మనోహరి గారిని ఎందుకు పిలిచారు సార్‌ అని అడగ్గానే.. అమర్‌ కోపంగా మనోహరి లాల్‌ సింగ్‌ నమ్రత ఇక్కడికి  ఎందుకు వచ్చారో నీకు తెలుసు కదా..? అనగానే.. ఏదో పంక్షన్‌కు పిలవడానికి వచ్చారు అని చెప్పావు అనగానే.. అవును కాశ్మీర్ లో ఒక ఫంక్షన్‌ చేయబోతున్నాం.. ఆ ఫంక్షన్‌కు మనతో పాటు ఇక్కడున్న మన కొలీగ్‌ అందరినీ ఇన్వైట్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా అందరం కలిసి ఇంట్లో ఒక గెట్‌ టు గెదర్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం.. ఆ ఫంక్షన్‌ ఏర్పాట్లు నువ్వే చూడాలి మనోహరి అంటూ అమర్‌ చెప్పగానే.. మనోహరి ఆశ్చర్యపోతుంది. మిస్సమ్మ మాత్రం మనోహరిని డైవర్ట్‌ చేయడానికి ఇదే కరెక్ట్‌ టైం ఎలాగైనా మనోహరిని ఫంక్షన్ లో ఇరికించాలి. అని మనసులో అనుకుంటుంది. ఇంతలో లాల్‌ సింగ్‌ అదేంటి అమర్ ఈ ఇంట్లో జరిగే ఫంక్షన్ చూసుకోవాల్సింది భాగీ కదా..? తనను చూడమని చెప్తున్నావు.. అని అడగ్గానే.. అమర్‌ ఏం చెప్పాలో అర్థం కాక చూస్తూంటాడు.

మిస్సమ్మ కల్పించుకుని ఇలలాంటి ఫంక్షన్స్‌ లో మనోహరికి మంచి ఎక్స్‌ఫీరియెన్స్‌ ఉంది అన్నయ్య గారు అందుకే ఆయన మనోహరిని మ్యానేజ్‌ చేయమంటున్నారు. అని చెప్పగానే.. రాథోడ్‌ కూడా అవును సార్‌ మిస్సమ్మ లేని ఈ ఐదేళ్లు మనోహరి గారే ఈ ఇంటిని మానేజ్‌ చేశారు.. చెప్పండి మనోహరి గారు మన గురించి మనం చెప్పుకోకపోతే ఎలా అనగానే.. మనోహరి కూడా అవును సింగ్‌ గారు అని చెప్తుంది. దీంతో అమర్‌ ఫంక్షన్‌ చాలా బాగా చేయాలి మనోహరి నీ ఫ్రెండ్స్‌ ను కూడా ఇన్వైట్‌ చేయ్‌ అని చెప్పగానే.. మిస్సమ్మ కూడా మీరు మళ్లీ చెప్పాలా అండి అనగానే.. సరే అంటూ అమర్‌ వెళ్లిపోతాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×