E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అంజు గురించి నిజం చెప్పిన లాల్ సింగ్ 

Nindu Noorella Saavasam Serial Today march 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అంజు గురించి నిజం చెప్పిన లాల్ సింగ్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఇంటికి వచ్చిన లాల్‌సింగ్‌ అందరినీ పలకరించాక అంజు విషయం గుర్తుకు వచ్చి అమర్‌ అజు విషయంలో నువ్వు చేసింది చాలా గ్రేట్ రా అంటాడు. దీంతో అందరూ షాక్‌ అవుతారు. అంజును మీ దగ్గరే పెట్టుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పగానే.. మనోహరికి తాను బిడ్డను వదిలేసిన విషయం గుర్తుకు వస్తుంది. అందరూ షాకింగ్‌ గా చూస్తుంటే.. అంజు నా విషయంలో డాడీ ఏం చేశారు అని అడుగుతుంది. లాల్‌సింగ్‌ అదే అమ్మా అంటూ నిజం చెప్పబోతుంటే.. మిస్సమ్మ అడ్డుపడి అన్నయ్య ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం.. మీరు ప్రయాణం చేసి వచ్చారు కదా ముందు ప్రెష్‌ అవ్వండి.. రాథోడ్‌ అన్నయ్య వాళ్లకు రూం చూపించు.. అంజు మీరు అందరూ పైకి వెళ్లండి..  అని మిస్సమ్మ  చెప్పగానే.. అందరూ వెళ్లిపోతారు.

మనోహరి మాత్రం అంజు విషయంలో అమర్‌ ఏం చేశాడు. నాకు తెలియని సీక్రెట్‌ ఏదైనా ఉందా..? అని మనసులో అనుకుంటుంది. మరోవైపు పైకి వెళ్లిన బుజ్జమ్మ రాథోడ్‌ దగ్గరకు వెళ్లి అంకుల్‌ అమర్‌ సార్‌ మా నాన్న అంటున్నారేంటి..? సింగ్ అంకుల్‌ వాళ్లు మా అమ్మ అమర్ సారు భార్యాభర్తలు అంటున్నారేంటి..? అమ్మేమో ఇప్పుడు మాట్లాడకు తర్వాత చెప్తాను అంటుంది అసలు ఏంటి అంకుల్‌ ఇదంతా అని అడగ్గానే.. రాథోడ్‌ ఏం చెప్పాలో అర్థం కాక యాక్టింగ్‌ బుజ్జమ్మ అని చెప్పగానే.. యాక్టింగా..? అని బుజ్జమ్మ అడగ్గానే.. అవును ఇప్పుడు నువ్వు అమ్మను అందరి ముందు మేడం అని పిలుస్తావు కదా..? ఎందుకు అంటూ రాథోడ్‌ అడగ్గానే.. బుజ్జమ్మ అమ్మ చెప్పింది కాబట్టి. కొన్నాళ్లు మేము తల్లీకూతుళ్లం అని కొంత మందికి తెలియకూడదు కాబట్టి అని  చెప్పగానే.. రాథోడ్‌ కదా అలాగే వచ్చిన గెస్టులు కొన్నాళ్లు మీ అమ్మ, అమర్‌ సార్‌లను భార్యాభర్తలని నువ్వు వాళ్ల పాపవని అనుకోవాలి. అని చెప్పగానే..

Advertisement

బుజ్జమ్మ ఎందుకని ప్రశ్నిస్తుంది. దీంతో రాథోడ్‌ ఎందుకంటే.. అమర్‌ సార్‌కు ఒక వైఫ్‌ ఒక బుజ్జి పాప కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్లు లేరు అందుకని కొన్నాళ్లు నువ్వు అమ్మ వాళ్లలాగా నటించాలి అర్థమైందా..? అని అడగ్గానే.. బుజ్జమ్మ అర్థం కాలేదు అని చెప్తుండగానే మిస్సమ్మ వచ్చి చూడు బుజ్జమ్మ రాథోడ్‌ ఏదేదో చెప్తున్నాడు నీకు కన్ఫీజ్‌గా ఉంది కదా కన్ఫీజ్‌ ఏం లేదు బుజ్జమ్మ నీకు నాన్నను చూడాలని ఉంది కదా..? అని అడగ్గానే.. బుజ్జమ్మ అవును త్వరలోనే నన్ను నాన్న దగ్గరకు తీసుకెళ్తాను అన్నావు కదా..? అనగానే.. మిస్సమ్మ తపపకుండా తీసుకెళ్తాను.. మీ నాన్న దగ్గరకు వెళ్లాకా..? మీ నాన్నను ఎలా పిలవాలి..? నాన్నతో ఎలా ప్రవర్తించాలి. ఇవన్నీ నీకు తెలియాలి కదా అని చెప్పగానే.. బుజ్జమ్మ నాకు ఎందుకు తెలియదు.. నాన్నను నేను నాన్న అని ఇష్టంగా పిలుస్తాను.. నాన్నతో ప్రేమగా ఉంటాను.. అని చెప్పగానే..

మిస్సమ్మ మళ్లీ నాన్న దగ్గరకు వెళ్లే ముందు అమర్‌ సార్‌తో నువ్వు అలా ఇష్టంగా ప్రేమగా ఉండాలి. అమర్‌ సార్‌ మీ నాన్న అన్నట్టుగా ప్రవర్తించాలి. అప్పుడు మీ నాన్నను కలిశాక నాన్న ఎంతో సంతోషిస్తారు.. అర్థమైందా అని అడగ్గానే.. బుజ్జమ్మ ఇప్పుడు కూడా అర్థం కాలేదు.. నేను అమర్‌ సార్‌ను కొన్నాళ్లు నాన్న అనుకోవాలి. సార్‌తో ప్రేమగా ఇష్టంగా ఉండాలి అంతే కదా..? అని అడగ్గానే.. మిస్సమ్మ ఎమోషనల్ అవుతూ.. అంతే బుజ్జమ్మ వచ్చిన గెస్టుల ముందు నేను అమర్‌ సార్‌ భార్యను నువ్వు అమర్‌ సార్ పాపవి నువ్వు అలాగే మెయింటెన్‌ చేయాలి అని చెప్పగానే.. బుజ్జమ్మ సరే అమ్మ నువ్వు ఎలా చెబితే అలా చేస్తాను అంటుంది. దీంతో మిస్సమ్మ థాంక్స్‌ బుజ్జమ్మ వెళ్లి ఆడుకో అని చెప్పి బుజ్జమ్మ వెళ్లిపోయాక ఏడుస్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×