E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today march 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ఇంట్లోంచి ఎస్కేప్ అయిన రణవీర్

Nindu Noorella Saavasam Serial Today march 18th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్ ఇంట్లోంచి ఎస్కేప్ అయిన రణవీర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: రణవీర్‌ ఇంట్లోకి వెళ్లి అంజును ఎత్తుకుపోతున్న టైంలోనే అమర్‌ ఇంట్లోకి వెళ్తాడు. వెంటనే అంజును కిచెన్‌లో వదిలేసి రణవీర్‌ పారిపోతాడు. బయట హోలీ ఆడుతున్న రాథోడ్‌, మిస్సమ్మ దూరం నుంచి అమర్‌ను గమనించి లోపలికి వెళ్తారు. అంజు అక్కడ పడి ఉండటం చూసి అందరూ షాక్‌ అవుతారు.. రాథోడ్‌ బాధగా ఏమైంది సార్‌ అని అడగ్గానే.. రాథోడ్‌ ఆ రణవీర్‌ ఇంట్లోకి వచ్చాడు… అంజును కిడ్నాప్‌ చేయాలని ట్రై చేశాడు అని చెప్పగానే. సొంత కూతురినే కిడ్నాప్‌ చేయాలని చూశాడా ఎంత ఘోరం సార్‌ అంటాడు రాథోడ్‌. దీంతో అమర్‌ కోపంగా రణవీర్‌ భార్య సొంత కూతురినే అనాథ ఆశ్రమంలో వదిలేసింది అది ఇంకా ఘోరం కదా..? అని చెప్పగానే..

అప్పుడే అక్కడికి వచ్చిన మనోహరి వింటుంది. షాక్‌ అవుతుంది. ఇంతలో మిస్సమ్మ ఆ దుర్మార్గురాలు త్వరలోనే దొరుకుతుందండి.. తన పాపం పండే టైం వచ్చింది అని చెప్పగానే.. తను ఎవరో మీకు తెలుసా..? అని అమర్‌ అడగ్గానే.. రాథోడ్‌ తడబడుతూ..అంటే రణవీర్‌ వైఫ్‌ను వెతుకుతున్నాం కదా..? ఆ రాక్షసి పాపం పండి త్వరలోనే దొరుకుతుందని మిస్సమ్మ అంటుంది అని చెప్పగానే.. చాటు నుంచి వింటున్న మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇంతలో అమర్‌ చూడండి అంజుకు ఇలా అయిందని బయట ఎవ్వరికీ తెలియనివ్వకండి పండగ డిస్టర్బ్‌ అవుతుంది అని చెప్పగానే.. మిస్సమ్మ మరి అంజు పరిస్థితి ఏంటండి హాస్పిటల్‌కు తీసుకెళ్దామా..? అని అడగ్గానే.. అమర్‌ అవసరం లేదు.. వాడు మత్తు మందు ఇచ్చినట్టు ఉన్నాడు.. కాసేపట్లో తను సృహలోకి వస్తుంది. అంతవరకు ఈ విషయం బయట ఎవ్వరికీ తెలియనివ్వకూడదు అని చెప్పి అంజును ఎత్తుకుని బెడ్‌రూంలోకి వెళ్తాడు.

Advertisement

బయటకు వెళ్లి కారులో కూర్చున్న రణవీర్‌ కోపంగా ఇరిటేట్ అవుతుంటాడు  లాయర్‌ ఏమైంది సార్‌.. పాప ఏమైంది.. అని అడగ్గానే.. రణవీర్‌ కోపంగా చేతికి చిక్కిన పిల్లను వాడు రావడంతో అక్కడే వదిలేసి వచ్చాను. వాడు దొరక్కుండా తప్పించుకుని వచ్చాను.. అని చెప్పగానే.. లాయరు మీరు తప్పించుకుని రాలేదు సార్‌ అమరేంద్ర దగ్గర ఇరుక్కుపోయారు అని చెప్పగానే.. రణవీర్‌ వాడు నన్ను చూడలేదు లాయరు అంటాడు. కానీ పాప కోసం వచ్చింది మీరే అని అమరేంద్రకు ఈ పాటికే తెలిసిపోయి ఉంటుంది సార్‌ అంటూ లాయరు చెప్పగానే.. రణవీర్‌ కోపంగా తెలిస్తే ఏం పీకుతాడు అంటాడు. దీంతో లాయరు మీరు ఏ కలుగులో దాక్కున్నా వెతికి పట్టుకుంటాడు సార్‌ అని చెప్పగానే..

రణవీర్‌ కోపంగా పట్టుకుని ఏం చేస్తాడు.. వాడు నా కూతురిని అనాథ ఆశ్రమం నుంచి తీసుకెళ్లి ఎక్కడో దాచి పెద్ద తప్పు చేశాడు. ఆ కారణంగా ఆఫీసియల్‌గా నా మీద ఎటువంటి యాక్షన్‌ తీసుకోడు అని చెప్పగానే.. లాయరు ఏంటి సార్‌ అమరేంద్ర గురించి తెలిసి కూడా మీరు ఇలా మాట్లాడుతున్నారు.. అమరేంద్ర ఆఫిసియల్‌ గా మాత్రమే కంట్రోల్‌ లో ఉంటారు సార్‌.. అన్‌ ఆఫీసియల్‌ గా ఏదైనా డీల్‌ చేయాల్సి వస్తే.. తనను మీరు తట్టుకోలేరు.. దేశ రక్షణ కోసం అమరేంద్ర రూల్స్‌ ను పక్కన పెట్టి ఎన్నో రిస్క్‌ ఆపరేషన్స్‌ చేశాడు. మీకు తెలియంది కాదు.. అమరేంద్రకు దేశమన్నా కుటుంబం అన్నా చాలా ఇష్టం సార్‌. మీరు తన ఫ్యామిలీని టచ్‌ చేశారు.. అమరేంద్ర  ఊరుకోరు సార్‌.. అని చెప్పగానే.. రణవీర్‌ కోపంగా అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు అనగానే.. మనోహరి కంగారుగా పడుతూ వచ్చి పారిపో రణవీర్‌ అంటుంది.

Advertisement

రణవీర్, లాయరు షాక్‌ అవుతారు.. మనోహరి మాత్రం భయంగా వెంటనే ఇక్కడి నుంచి ఎయిర్‌ఫోర్ట్‌కు వెళ్లి దొరికిన ఫ్లైట్‌ పట్టుకుని కలకత్తాకు వెళ్లిపో.. అక్కడ ఉంటే జైళ్లో సేఫ్ గా ఉంటావు.. ఇక్కడుంటే అమరేంద్ర నిన్ను చంపేస్తాడు.. కారు స్టార్ట్‌ చేయ్ రణవీర్‌.. ఇంకా ఉన్నావేంటి..? బయలుదేరు అనగానే.. దీంతో రణవీర్‌ కోపంగా నా కూతురు లేకుండా నేను కోల్‌కతా వెళితే చచ్చిపోతాను..అంటాడు రణవీర్‌. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×