E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  గుప్త తో బుజ్జమ్మ మాట్లాడటం చూసిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today Episode June 8th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  గుప్త తో బుజ్జమ్మ మాట్లాడటం చూసిన మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: గార్డెన్‌లో వేచి ఉన్న గుప్తను చూసి వెళ్లి పలకరిస్తుంది బుజ్జమ్మ. బుజ్జమ్మ వచ్చి పిలవగానే గుప్త షాక్‌ అవుతాడు. మేము ఇచ్చట నీ కొరకు వేచి ఉన్నామని నీకు ఎటుల తెలియును బాలిక అని అడగ్గానే.. బుజ్జమ్మ మీరు నాకోసం వచ్చినప్పటి నుంచి తెలుసు అని చెప్తుంది. దీంతో గుప్త ఆశ్చర్యంగా మేము నీకు ఎప్పటి నుంచి కనిపిస్తున్నాము అని అడగ్గానే.. బుజ్జమ్మ కొత్తగా అడుగుతారేంటి గుప్త గారు మీరు ఎప్పటి నుంచో కనిపిస్తున్నారు అని చెప్పగానే.. గుప్త కోపంగా మేము అడుగుతున్నది గత జన్మ గురించి కాదు. ఈ జన్మ గురించి అని చెప్పగానే.. బుజ్జమ్మ ప్రతి జన్మలోనూ మీరు నాకు తోడుగా ఉంటారని మాటిచ్చారు కదా అని చెప్పగానే..

గుప్త మేము అటువంటి మాట ఏమీ ఇవ్వలేదు. నువ్వే మా అంగుళీకము తస్కరించి మరలా జన్మించితివి.. అని చెప్పగానే.. బుజ్జమ్మ నేను మరలా పుట్టలేదు గుప్త గారు.. పుట్టిన ఈ పాపలో ప్రవేశించాను అని చెప్తుంది. దీంతో గుప్త ఏది ఏమైనా నీకు ఇది మరో జన్మతో సమానం ఆ జన్మలో లాగా నన్ను ఇక్కట్లు పెట్టినట్టు ఈ జన్మలో పెట్టకు అనగానే.. బుజ్జమ్మ అయ్యో రామా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టానా..? అని అడగ్గానే.. గుప్త కోపంగా ఒకటా రెండా..? ఎన్నని చెప్పెదను.. నేను మా లోకంలో పాపులను సలసల కాగు తైలమును వేయించినట్టు నువ్వు మమ్ములను వేయించి తింటివి..  పువ్వు పుట్టగానే పరిమళించును అన్నట్టు ఇంత చిన్న వయసులోనే నీ శక్తులను ప్రదర్శిస్తున్నావు అనగానే.. బుజ్జమ్మ ఆశ్చర్యంగా ఆ నాకు శక్తులు ఉన్నాయా..? గుప్త గారు అంటుంది.

Advertisement

దీంతో గుప్త ఇదిగో ఈ నటనా వలయం ప్రదర్శించవలదు అని నీకు గత జన్మ నుంచే చెబుతున్నాము అనగానే.. అమయాకంగా చెప్పకుము.. జన్మ మారింది నీకు కానీ మా దగ్గర కాదు అనగానే.. బుజ్జమ్మ ఆశ్చర్యంగా ఊరుకోండి గుప్త గారు నేను చిన్న పిల్లను నాకు శక్తులు ఉండటం ఏంటి..? అనగానే.. గుప్త కోపంగా నమ్మరు ఈ మాట మేమే కాదు మా ప్రభువుల వారు కూడా నమ్మరు కాక నమ్మరు.. అనగానే. బుజ్జమ్మ అన్నట్టు అందరూ కుశలమేనా గుప్త గారు అని అడగ్గానే.. గుప్త నిర్వేదంగా ఇప్పటి వరకు అందరూ కశలమే కానీ ఇక నుంచే ఎలా ఉండాలో అర్థం కావడం లేదు.. ఇప్పుడే నువ్వు ఇలా చేస్తున్నావు అంటే భయమేస్తుంది అంటూ గుప్త చెప్తుంటాడు. బుజ్జమ్మ ఊరుకోండి గుప్త గారు అంటూ ఏవేవో చెప్తుంది. అప్పుడే టెర్రస్‌ మీదకు వెళ్లిన మనోహరి, యాదమ్మ ఇద్దరూ బుజ్జమ్మను గమనిస్తారు. బుజ్జమ్మ ఎవరితో మాట్లాడుతుందోనని భయపడుతుంటారు.

ఇంతలో మనోహరి భయంగా ఏంటి చంభా తను పిచ్చిదానిలా తనలో తానే మాట్లాడుకుంటుంది. అని చెప్పగానే.. తను పిచ్చిది కాదు మనోహరి ఈ పిల్లే అరుంధతి తన పక్కన తోడుగా ఒక దైవశక్తి ఉందని రణవీర్‌ చెప్పాడు కదా..? అంటూ చంభా మంత్రాలు చదివి చూడగానే.. చంభాకు గుప్త కనిపిస్తాడు. దీంతో చంభా షాక్‌ అవుతుంది. ఆ పిల్లకు అండగా ఉన్నది ఎవరో కాదు చిత్రగుప్తుడు. ఆ చిత్రగుప్తుడు అండగా ఉన్నాడు కాబట్టే అప్పట్లో మనం ఆరును ఏమీ చేయలేకపోయాము ఇప్పుడు కూడా ఈ పిల్లకు చిత్రగుప్తుడు అండగా ఉన్నాడంటే.. ఇక నువ్వేం చేయలేవు.. నీ పతనం మొదలైంది.. నీకు చావు దగ్గర పడింది అంటూ బెదిరిస్తుంటే.. మనోహరి కోపంగా ఇక ఆపు చంభా అంటూ తిడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×