E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today June 5th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు వినోద్‌ వార్నింగ్‌  

Nindu Noorella Saavasam Serial Today June 5th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మకు వినోద్‌ వార్నింగ్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : మిస్సమ్మకు రూంలో ఆరు ఫోటో ఉన్న రూం కీస్‌ దొరుకుతాయి. వెంటనే ఆ కీస్‌ తీసుకుని ఆ రూంలోకి వెళ్లి ఆరు ఫోటో చూడాలనుకుంటుంది. మను, ఆరు విషయంలో ఎందుకు అబద్దం చెప్పిందో తెలుసుకోవాలనుకుంటుంది. వెంటనే రూం దగ్గరకు వెళ్లి లాక్‌ ఓపెన్‌ చేయబోతుంటే.. వెనక నుంచి మనోహరి వచ్చి ఆపేస్తుంది. కీస్‌ లాక్కునే ప్రయత్నం చేస్తుంది. దీంతో మిస్సమ్మ కోపంగా మనోహరిని చూస్తుంది. మను ఏం చేస్తున్నావు అంటుంది. దీంతో మనోహరి అది నేను అడగాలి. నువ్వు ఈ రూం ఎందుకు ఓపెన్ చేస్తున్నావు.. అంటూ ప్రశ్నిస్తుంది.దీంతో మిస్సమ్మ ఏ ఎందుకు చేయకూడదు అని అడుగుతుంది.

దీంతో నువ్వు ఓపెన్‌ చేయకూడదు. ఇది ఆరు రూం ఈ రూంలోకి అమర్‌ పర్మిషన్‌ లేకుండా వెళ్లకూడదు అంటుంది మనోహరి. దీంతో మిస్సమ్మ పిచ్చి మను పర్మిషన్స్‌ అన్ని బయటి వాళ్లకు. అంటే నీలాంటి వాళ్లకు నేను ఆయన భార్యను ఈ ఇంట్లో సర్వాధికారాలు నాకు ఉన్నాయి. నీకు ఇంకా క్లారిటీ కావాలంటే వెళ్లి ఆంటీ వాళ్లను అడుగు అంటూ వార్నింగ్‌ ఇవ్వగానే నువ్వు ఈ రూం ఓపెన్‌ చేస్తున్నావని ఇప్పుడే వెళ్లి అమర్‌కు చెప్తాను ఉండు అంటూ మనోహరి వెళ్లబోతుంటే చేయి పట్టి లాగి మిస్సమ్మ.. దాంతో పాటు నువ్వు నాకు ఎవరి ఫోటోనో చూపించి ఆరు అక్కా అని చెప్పిన విషయం కూడా చెప్పు.. అంత షాక్‌ అయినట్టు యాక్ట్‌ చేయకు మను. నిజం నాకు తెలిసిపోయిందన్న విషయం నీకు తెలిసిందని నాకు తెలుసు. అసలు నువ్వు ఎందుకు అబద్ద చెప్పావనే నేను ఫోటో చూద్దాం అనుకునేది. నీ కళ్లల్లో భయం ఆ కంగారు.. అసలు ఆ డోర్‌ అవతల ఉన్న ఆరు అక్క ఫోటో చూస్తే నీకొచ్చే నష్టం ఏంటి..? ఏంటి చెప్పవా..? సరేలే నేనే చూస్తాను.. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు.. వెళ్లు మను లేదంటే నేను ఆయన్ని పిలిచి నిజం చెప్పమని అడగడం ఆయన నిన్ను నిజం చెప్పమనడం అవసరమా చెప్పు అంటుంది. మనోహరి అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Advertisement

మొత్తం చాటు నుంచి అంతా వింటున్న అనామిక కంగారుగా మిస్సమ్మ లాక్‌ తీయబోతుంటే.. వచ్చి ఆపేస్తుంది. నువ్వు ఆవిడ ఫోటో చూడకూడదు. ఎందుకంటే నువ్వు ఆ ఫోటో చూడకూడదని ఆ దేవుడే చేస్తున్నట్టు ఉంది. ఆ టైం వచ్చినప్పుడే దేవుడే నీకు ఫోటో చూపిస్తాడు అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ సరే అక్కా అంటూ వెళ్లిపోతుంది. ఇంతలో మనోహరి, అనామిక దగ్గరకు వచ్చి అసలు నువ్వు నువ్వేనా అని అడుగుతుంది. భాగీ, ఆరు ఫోటో చూడకుండా చేయాలని నాకో కారణం ఉంది. కానీ నువ్వెందుకు ఆపేస్తున్నావు అంటూ ప్రశ్నిస్తుంది. దీంతో అనామిక కంగారుగా భాగీ ఆ ఫోటో చూస్తే మళ్లీ బాధపడుతుందని  చూడకుండా చేస్తున్నాను అని చెప్పి వెళ్లిపోతుంది.

మనోహరి  తన రూంలోకి వెళ్లి భాగీ నిజానికి దగ్గరగా ఆలోచిస్తుంది. నా గురించి నిజం తెలిస్తే ఆ ముసలోళ్లు, భాగీ ముగ్గురు కలిసి నన్ను ఇంట్లోంచి వెళ్లగొడతారు. ఇదంతా జరగకూడదు అనుకుంటే చిత్రను వినోద్‌ పెళ్లి చేసుకోవాలి అని మనసులో అనుకుని వినోద్  రూంలోకి  వెళ్లిపోతుంది. చిత్రకు పెళ్లి సెట్‌ అయిందంట కదా నీకు తెలుసా..? అని అడుగుతుంది. దీంతో వినోద్‌ కంగారుగా ఏంటి మీరు అనేది అని అడుగుతాడు. మనోహరి అవును వినోద్‌ అబ్బాయి చాలా బాగున్నాడు. చిత్ర అనాథ అని చెప్పాక కూడా పెళ్లికి ఒప్పుకున్నాడు అని చెప్తుంది. నిన్న చిత్ర ఇక్కడే ఉంది. కదా మరి నాకు ఎందుకు చెప్పలేదు. అసలు చిత్ర ఎవరినో పెళ్లి చేసుకోవడం ఏంటి..? చిత్ర పెళ్లికి ఒప్పుకుందా..? అని అడుగుతాడు. దీంతో మనోహరి మంచి సంబంధం నేను వార్డెన్‌ ఒప్పుకోమని చెప్పాను. తన మనసులో మాట చెప్పడానికి టైం అడిగింది అని చెప్పగానే.. వినోద్‌ వెంటనే చిత్రకు కాల్ చేస్తాడు.

Advertisement

తర్వాత ఇంట్లో వాళ్లకు చిత్ర గురించి చెప్తాడు వినోద్‌. దీంతో చిత్ర క్యారెక్టర్‌ గురించి మిస్సమ్మ చెప్తుంది. దీంతో వినోద్ మిస్సమ్మను తిడతాడు. ఎవరు ఎలాంటి వారో.. ఏ ఉద్దేశంతో ఇంట్లోకి అడుగుపెట్టారో కొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. నా విషయంలో ఆవిడను జోక్యం చేసుకోవద్దని చెప్పండి అంటూ తిడతాడు.  దీంతో మిస్సమ్మ ఏడుస్తూ..గార్డెన్‌లోకి వెళ్తుంది. వెనకే అమర్‌ వెళ్తాడు. మిస్సమ్మను ఓదారుస్తాడు. నీ ప్రతి ఆలోచన మంచి గురించే ఉంటుంది కానీ చెడు ఉండదని నాకు తెలుసు అని చెప్తాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×