E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode June 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన అమర్ – మిస్సమ్మకు ప్లవర్ గిఫ్ట్ 

Nindu Noorella Saavasam Serial Today Episode June 11th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి షాక్ ఇచ్చిన అమర్ – మిస్సమ్మకు ప్లవర్ గిఫ్ట్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: ఇంటి ముందు ముగ్గేస్తున్న మిస్సమ్మ దగ్గరకు వెళ్లిన అమర్‌ కాసేసు మాట్లాడిన తర్వాత అక్కడే చెట్టుకు ఉన్న ఒక పువ్వు తీసి మిస్సమ్మకు ఇస్తూ.. తల దువ్వుకున్న తర్వాత ఈ పువ్వు తలలో పెట్టుకో భాగీ అంటూ ఇస్తాడు. మిస్సమ్మ హ్యాపీగా పువ్వు తీసుకుని నవ్వుకుంటుంది. అప్పుడే చంభా, మనోహరిని లోపలి నుంచి తీసుకొచ్చి ఆ సన్నివేశం చూపిస్తుంది. అమర్‌, మిస్సమ్మకు పువ్వు ఇవ్వడం చూసి మనోహరి షాక్‌ అవుతుంది. చంభా కూడా చూశావా నేను చెబితే నమ్మలేదు కదా నువ్వు ఇప్పుడు చూడు ఇందాక ముద్దు పెట్టాడు. ఇప్పుడేమో పువ్వు ఇస్తున్నాడు. మనోహరి సార్‌కు గతం మొత్తం గుర్తుకు వచ్చినట్టు ఉంది అని చెప్తుంది. అమర్‌ మాత్రం మిస్సమ్మకు హావ్‌ ఏ బ్యూటిఫుల్‌ డే భాగీ అని చెప్పగానే.. మిస్సమ్మ కూడా ఇట్స్‌ మెమరబుల్‌ డే అండి అని చెప్తుంది.

అమర్‌ తిరిగి మనోహరిని చూడగానే.. మనోహరి అమర్‌ గుడ్‌ మార్నింగ్‌ అంటూ దగ్గరకు వెళ్తుంది. అమర్‌ మాత్రం తెల్లవారి చాలాసేపు అయింది ఇప్పుడు గుడ్‌మార్నింగ్‌ ఏంటి..? అంటూ లోపలికి వెళ్లిపోతాడు. మిస్సమ్మ మాత్రం మనసులో కోపంగా ఒసేయ్‌ మనోహరి నిన్న ఆయనతో బయటకు వెళ్లావని ఎన్ని ఎక్స్‌ట్రాలు చేశావే.. ఇప్పుడు చెప్తాను నీ సంగతి అంటూ అమర్‌ ఇచ్చిన పువ్వును కిస్‌ చేస్తుంది. మనోహరి ఇరిటేటింగ్‌ గా మిస్సమ్మ  చేతిలో పువ్వు లాక్కుంటూ.. ఏంటి భాగీ నువ్వు చేస్తుంది. చెప్పు భాగీ ఏం చేస్తున్నావు.. అని అడగ్గానే.. నేనేం చేశాను మనోహరి అంతా ఆయనే చేశారు అని చెప్పగానే.. మనోహరి కోపంగా ఏంటే ఎక్స్‌ట్రాలు చేస్తున్నావు.. అంటుంది. దీంతో మిస్సమ్మ కోపంగా ఎవరే ఎక్స్‌ ట్రాలు చేస్తుంది. నిన్ను నువ్వు చేసింది ఏంటి..? అని ప్రశ్నించగానే..

Advertisement

మనోహరి కోపంగా ఆప్టరాల్‌ కేర్‌టేకర్‌వి అనగానే.. మిస్సమ్మ కోపంగా ఆప్టరాల్‌ కేర్‌ టేకర్‌ కాదు ఆయనతో తాళి కట్టించుకున్న భార్యని.. నన్ను పెళ్లి చేసుకున్న విషయం ఆయనకు గుర్తు ఉండకపోవచ్చు.. కానీ ప్రేమిస్తున్నానని నువ్వు ఆయనకు చెప్పింది అబద్దమని ఆయనకు తెలిసిపోయింది. త్వరలోనే ఆయనకు ఒక్కొక్కటిగా అన్ని నిజాలు తెలిసిపోతాయి మనోహరి. మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి.. అప్పుడు ఉంటుంది నీకు .. ఇప్పుడు చెప్పడం ఎందుకులే అంటూ మిస్సమ్మ లోపలికి వెళ్లిపోతుంది. రాథోడ్‌ వెటకారంగా గుడ్‌ మార్నింగ్‌ మనోహరి గారు అంటూ ఇవాళ పొద్దున్నే లేచారేంటి..? అనగానే… మనోహరి కోపంగా చూస్తుంది. రాథోడ్‌ గట్టిగా మిస్సమ్మ పొయ్యి మీద ఏం పెట్టావ్‌ మాడిపోయిన వాసన వస్తుంది అనుకుంటూ లోపలికి వెళ్లిపోతాడు.

రాథోడ్‌ లోపలికి వెళ్లగానే.. యాదమ్మ ఇప్పుడు చెప్పు మనోహరి ఇక్కడ జరిగిన చండాలం కన్నా నా ముఖమే మంచిది కదా..? అనగానే.. మనోహరి కోపంగా ఏయ్‌ ఆపుతావా..? అందరూ నా మీద సెటైర్లు వేసేవాళ్లే అంటుంది. దీంతో యాదమ్మ ఏం చేస్తాం మనోహరి.. కొందరిని చూస్తే పెట్టబుద్ది అవుతుంది. కొందరిని చూస్తే మెట్ట బుద్ది అవుతుంది అనగానే.. మనోహరి కోపంగా సామెతలు చెప్పండం ఆపేసి రణవీర్‌కు ఫోన్‌ చేయ్‌ వెంటనే ప్రచండను తీసుకుని ఇక్కడకు రమ్మని చెప్పు.. అనగానే.. యాదమ్మ ఇందాకే ఫోన్‌ చేసి చెప్పాను వస్తున్నారు అంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

Advertisement

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×