E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today July 3rd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు చిత్ర ప్లాన్

Nindu Noorella Saavasam Serial Today July 3rd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను  చంపేందుకు చిత్ర ప్లాన్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: చిత్ర హ్యాపీగా ఉండటం చూసిన వినోద్‌ వచ్చి ఏంటి చిత్ర అంత హ్యాపీగా ఉన్నావు అని అడుగుతాడు. ఇవాళ అక్కడ కార్యం అయిపోతుందని ఫుల్‌ కాన్పిడెంట్‌ గా ఉన్నట్టు ఉన్నావు. మా అన్నయ్య అంత ఈజీగా దేన్ని ఒప్పుకోడు నీకు మా అన్నయ్య గురించి పూర్తిగా తెలియదు అంటాడు. దీంతో చిత్ర మీ అన్నయ్యకు ఇచ్చే పాలలో టాబ్లెట్‌ కలిపిన విషయం నీకు తెలియదు అని చెప్తుంది. దీంతో వినోద్‌ షాక్‌ అవుతాడు. అంటే ఇప్పుడు మా అన్నయ్యా..? అనగానే భాగీని క్యూట్‌గా చూస్తుంటారు అని చెప్తుంది చిత్ర.

చిత్ర చెప్పినట్టుగానే పైన రూంలో పాలు తాగిన అమర్‌ మత్తుగా తూలుతూ ప్రేమగా భాగీ అని పిలుస్తాడు. అమర్ పిలుపునకు షాక్‌ అయిన మిస్సమ్మ ఏంటి అంటూ చూస్తుంది. దీంతో అమర్‌ మిస్సమ్మ దగ్గరకు జరిగి ఇవాళ నువ్వు చాలా అందంగా ఉన్నావు తెలుసా..? ఈ హెయిర్‌ ఇలా ఉంటే ఇంకా అందంగా ఉంటావు అంటూ చెప్తుంటే.. కింద చిత్ర అలా ఇద్దరూ ఒక్కటై పోతారు అని చెప్తుంది. దీంతో వినోద్‌ అవును ఎన్ని టాబ్లెట్స్‌ వేశావు అని అడగ్గానే.. రెండు టాబ్లెట్స్ వేశాను అని చెప్తుంది చిత్ర.

Advertisement

రెండు టాబ్లెట్స్‌ వేస్తే స్లీపింగ్‌ పిల్స్ లా పని చేస్తుంది అది అని చెప్పి వినోద్‌ వెళ్లిపోతాడు. చిత్ర నిరుత్సాహంగా అంటే బావగారు.. నా కష్టం వృథా అయినట్టేనా..? అనుకుంటూ బాధపడుతుంది. పైన రూంలో అమర్‌ మత్తుగా మిస్సమ్మను హగ్‌ చేసుకుని అలాగే పడుకుంటాడు. మిస్సమ్మ అనుమానంగా ఏవండి.. ఏవండి అని పిలిచినా అమర్‌ పలకడు. దీంతో ఇదేంటి ఉలుకూ పలుకూ లేదు అని అమర్‌ను పక్కకు తోసేస్తుంది. అమర్‌ గాఢ నిద్రలో ఉంటాడు. మిస్సమ్మ షాక్‌ అవుతుంది.

రణవీర్‌ సోపాలో కూర్చుని ఉంటే లాయర్‌ వచ్చి ఎందుకు రణవీర్‌ రాత్రంతా కూడా నిద్ర పోకుండా ఆలోచిస్తూ ఉన్నావు. అయినా అమరేంద్ర చెప్పాడు కదా దుర్గ ఎక్కడ ఉన్నా వెతికి తీసుకొస్తానని అంటాడు. దీంతో రణవీర్‌ కోపంగా లాయరు అమరేంద్ర నిజం దాస్తున్నాడు. అంజలి పుట్టిన మిలటరీ హాస్పిటల్ నెంబర్‌ కనుక్కున్నావా..? అని అడగ్గానే.. లాయరు కనుక్కున్నాను అని చెప్తాడు.  అయితే కాల్‌ చేసి ఇవ్వు అంటాడు. లాయర్‌ కాల్‌ చేసి రణవీర్‌కు ఇస్తాడు. హాస్పిటల్‌ వాళ్లను రణవీర్‌ తాను అమరేంద్ర ఇంటి నుంచి మాట్లాడుతున్నానని అంజలి బర్తు డీటెయిల్స్‌ అడుగుతాడు. హాస్పిటల్‌ లో అంజలి పుట్టిందని చెప్తారు. దీంతో రణవీర్‌ షాక్‌ అవుతాడు. వెంటనే కాల్ కట్‌ చేస్తాడు. లాయరు అమరేంద్ర ఇంట్లో పని చేసిన వారికి కాల్‌ చేయ్‌ డెలివరీ అయ్యాక ఎన్ని రోజులకు ఇంటికి వచ్చారో తెలుసుకో అని చెప్పగానే..

Advertisement

లాయరు కాల్‌ చేస్తాడు. వాళ్లతో మాట్లాడి..  రణవీర్‌ డెలివరీ అయ్యాక ఐదు రోజులకు ఇంటికి వచ్చారట. అప్పటి నుంచి అంజలి వాళ్లు కొడైకెనాల్‌ నుంచి హైదరాబాద్ వచ్చే వరకు ఆవిడ చూసిందట అని చెప్తాడు. అయితే వెంటనే ఫోన్‌ చేయ్‌ అని రణవీర్‌ చెప్పగానే.. లాయరు ఫోన్‌ చేస్తాడు. ఆవిడతో మాట్లాడతాడు. రణవీర్‌ నువ్వు చెప్పిన అందరికీ కాల్ చేశాను. అందరూ అంజలిని రోజుల పాప నుంచి చూస్తున్నామని చెప్తున్నారు అనగానే వాళ్లందరూ అబద్దం చెప్తున్నారు అనిపిస్తుంది లాయరు అంటాడు రణవీర్‌. డీటెయిల్స్‌ తో సహా అన్ని చెప్తున్నారు రణవీర్‌ అబద్దం అంటావేంటి..? అంటాడు లాయరు. కాదు అమరేంద్ర గేమ్‌ ఆడుతున్నాడు లాయరు అంటాడు రణవీర్‌.

మరోవైపు రాథోడ్‌, అమర్‌ దగ్గరకు వెళ్లి సార్‌ మీ గెస్‌ కరెక్ట్‌ సార్‌.. రణవీర్‌ కొడైకెనాల్‌ లో మనకు టచ్‌లో ఉన్న అందరికీ ఫోన్‌ చేసి అంజలి పాప గురించి ఎంక్వైరీ చేస్తున్నారు అని చెప్తాడు. దీంతో అమర్‌ తెలుసు రాథోడ్‌ నేను చెప్పిన మాట రణవీర్‌ నమ్మడని తెలుసు. నిజాన్ని వెతుక్కుంటూ గతంలోకి వెళ్తాడని తెలుసు. అందుకే గత నెల రోజులుగా అంజలి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక జీవితాన్ని సృష్టించాను అని చెప్తాడు. మరి రణవీర్‌ ఎలాగైనా నిజాన్ని తెలుసుకుంటే సార్‌ అని రాథోడ్‌ అడగ్గానే.. తెలుసుకోలేడు రాథోడ్‌. రణవీర్‌కు నిజానికి మధ్యలో నేను ఉన్నాను. ఆరు నా పక్కన ఉంటే రణవీర్‌, అంజును చేరుకోకుండా ఆపమని అడిగేది.. ఆరు పోరాటం కూడా నేనే చేయాలి రణవీర్‌ను అంజలి వరకు చేరనివ్వను అంటూ అమర్‌ చెప్తాడు.

తర్వాత మిస్సమ్మను చంపేందుకు మనోహరి, చిత్ర ప్లాన్ చేస్తారు. అందుకోసం బాత్రూంలో కరెంట్ వైర్ కట్ చేసి నీళ్లు కింద పోయేలా చేస్తారు. కిందకు వచ్చి మిస్సమ్మను పైకి రూంలోకి వెళ్లమని చెప్తారు. అలాగేనని మిస్సమ్మ రూంలోకి వెళ్తుంది. రూంలో నీళ్లు ఉండటం చూసి అయ్యో అనుకుంటూ కాలు పెట్టబోతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×