E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode July 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: తనకు హెల్ప్‌ చేయమని గుప్తను అడిగిన బుజ్జమ్మ     

Nindu Noorella Saavasam Serial Today Episode July 23rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: తనకు హెల్ప్‌ చేయమని గుప్తను అడిగిన బుజ్జమ్మ     
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: అమర్‌ ఇంట్లోకి పార్థు ఎంట్రీ ఇస్తాడు. ఇంట్లో మండుతున్న సిలిండర్‌ను చూసి పిల్లలు భయపడుతుంటే.. అమర్‌ ఆర్పేందుకు ప్రయత్నిస్తుంటే.. అప్పుడే పార్థసారథి వచ్చి ధైర్యంగా సిలిండర్‌ను ఆర్పేస్తాడు. పిల్లలకు ధైర్యం చెప్తూ.. మీరంతా ది గ్రేట్‌ అమరేంద్ర పిల్లలు ఇలా భయపడకూడదు అంటూ చెప్తాడు. ఆ మాటలకు అమర్‌ ఆశ్చర్యంగా మీరు అంటూ ప్రశ్నిస్తుండగానే.. పార్థసారథి తనను తాను పరిచయం చేసుకుంటాడు. డెహ్రాడూన్‌లో మిలటరీ ట్రైనింగ్‌లో మనిద్దరం ఒకే బ్యాచ్‌లో ట్రైనింగ్‌ తీసుకున్నాం కదా..? నీకు గుర్తు రావడం లేదా..? నాకు మధ్యలోనే ఐపీఏస్‌ వస్తే ట్రైనింగ్‌ నుంచి వెళ్లిపోయాను.. అంటూ గుర్తు చేయగానే.. అమర్‌ గుర్తు చేసుకుని ఓరేయ్‌ పార్థు నువ్వా..? అసలు ఎంత మారిపోయావు.. అంటూ అమర్‌ పలకరిస్తాడు. అంతా దూరం నుంచి గమనిస్తున్న యాదమ్మ మనోహరి ఇక నీ పని అయిపోయింది. వచ్చింది స్టిక్ట్‌ ఆఫీసరే కాదు.. అమర్‌ సార్‌ ఫ్రెండు పైగా ఇద్దరిది ఒకే బ్యాచ్‌ అట ఇక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని చెప్తుంది.

రూంలో ఆలోచిస్తూ ఉన్న బుజ్జమ్మ బయటకు వెళ్లి గుప్తను పిలుస్తుంది. గుప్త వచ్చి పక్కనే నిలబడి చెప్పు బాలిక ఎందుకు నన్ను పిలిచావు అని అడిగినా బుజ్జమ్మకు గుప్త కనబడడు.. గుప్త మాటలు వినబడవు.. అయినా బుజ్జమ్మ నమ్మకంతో గుప్త గారు మీరు నా పక్కనే ఉన్నారు నా మాటలు వింటున్నారు కాబట్టి చెప్తున్నాను.. నేను ఎందుకు మళ్లీ పుట్టానో మీకు బాగా తెలుసు.. ఆయనకు పిల్లలకు మనోహరి పీడ లేకుండా చేయాలి అందుకోసం మీరే నాకు హెల్ప్‌ చేయాలి మీరు చేస్తారన్న నమ్మకంతో వెళ్తున్నాను అంటూ చెప్పి బుజ్జమ్మ ఇంట్లోకి వెళ్లిపోతుంది. గుప్త ఎమోషనల్ అవుతూ.. చేస్తాను బాలిక.. నీకు తప్పకుండా సహాయం చేస్తాను అనుకుంటూ మాయం అయిపోతాడు.

Advertisement

అమర్, పార్థసారథి మాట్లాడుకుంటుంటే.. మిస్సమ్మ జ్యూస్‌ తీసుకొచ్చి ఇస్తుంది. మీలాంటి ఆఫీసరు.. అరుంధతి మేడం కేసు కోసం ఢిల్లీ నుంచి రావడం అంటే ఎంతో హ్యాపీగా ఉంది సార్‌ అంటుంది. అమర్‌ కూడా అనుమానంగా అవును పార్థు నా కేసు గురించి నీకెలా తెలిసింది. అని అడిగితే.. పార్థు తనకు తెలిసిన విషయాలు మొత్తం చెప్పి నీ కేసు సాల్వ్‌ చేయడానికి డీజీపీ గారికి పర్సనల్‌గా రిక్వెస్ట్‌ చేసి ఇక్కడకు స్పెషల్‌ ఆఫీసర్‌గా వచ్చాను అని చెప్పగానే.. అమర్‌ ఎమోషనల్ అవుతూ ఆరు చనిపోయి ఏడేండ్లు అవుతుంది. కానీ ఇప్పటికీ కేసు సాల్వ్‌ కాలేదు అంటాడు.

అందుకు పార్థసారథి ఇక నేను వచ్చాను కదా అమర్‌.. నీ కేసు ఇక ఏడు రోజుల్లో సాల్వ్‌ అయిపోతుంది అంటూ చెప్పగానే.. మనోహరి భయపడుతుంది. అరుంధతి గారిని హత్య చేసింది ఎవరో..? మీకు యాక్సిడెంట్‌ చేయించింది ఎవరో..? మీ పిల్లల మీద దాడులు చేయిస్తుంది ఎవరో..? తప్పకుండా కనిపెడతాను సో అమర్‌ నేను వచ్చాను కాబట్టి అంతా సవ్యంగానే జరుగుతుంది అని చెప్పగానే.. మనోహరి భయంతో వణికిపోతుంది. ఇంతలో అమర్‌ పార్థసారథి పెళ్లి గురించి అడిగితే పార్థసారథి మాత్రం మెలికలు తిరుగుతూ మనోహరిని చూసి ఏదేదో మాట్లాడుతుంటాడు. మిస్సమ్మ చూసి ఇతనేంటి మనోహరిని చూసి సిగ్గుపడుతూ మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×