E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode July 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండకు షాక్ ఇచ్చిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today Episode July 16th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండకు షాక్ ఇచ్చిన మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode: బుజ్జమ్మను ఇంకా  ఎప్పుడు చంపేస్తావు ప్రచండ అంటూ కోపంగా అంజులో ఉన్న ప్రచండను ప్రశ్నిస్తుంది మనోహరి. ఇవాళే బుజ్జమ్మను చంపేస్తానని ప్రచండ చెప్పినా మనోహరి నమ్మదు. దీంతో యాదమ్మ కోపంగా ప్రచండను తిడుతుంది. నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోకపోతే మన మాంత్రికలు పరువు పోతుంది అంటుంది. మనోహరి మాత్రం మీది మాట పోవడం కాదు ఇక్కడ నా ప్రాణం పోతుంది ప్రచండ వీలైనంత త్వరగా ఆ బుజ్జమ్మను చంపేయ్‌ అంటూ చెప్పగానే.. ఇప్పుడే ఆ బుజ్జమ్మను నాతో బయటకు తీసుకెళ్లి చంపేస్తాను అంటాడు ప్రచండ. ఇప్పుడా ఎలా బయటకు తీసుకెళ్తావు.. ఈ టైంలో బుజ్జమ్మ నీతో వస్తుందా..? అంటూ మనోహరి అనుమానంగా అడిగితే.. అంత డౌటుగా ఉంటే నాతో వచ్చి చూడండి ఎలా నేను బుజ్జమ్మను తీసుకెళ్తానో అంటూ ప్రచండ బుజ్జమ్మ రూంలోకి వెళ్తాడు. ప్రచండ వెనకే వెళ్లిన మనోహరి, చంభా బయట డోర్‌ దగ్గర నుంచి గమనిస్తుంటారు.

బుజ్జమ్మ రూంలోకి వెళ్లిన ప్రచండ మంత్రం వేసి బుజ్జమ్మను నిద్రలేపి తనతో వస్తావా..? అని అడుగుతాడు. బుజ్జమ్మ వస్తానని తల ఊపగానే.. సరే అయితే పద అంటూ బుజ్జమ్మను తన వెంటబెట్టుకుని బయటకు వస్తాడు ప్రచండ. బుజ్జమ్మతో వస్తున్న ప్రచండను చూసిన మనోహరి ఇన్ని రోజులు ఇలా చేయకుండా ఎందుకు ఆలస్యం చేశాడు ప్రచండ అంటూ చంభాను అడిగితే అందరి ముందు బుజ్జమ్మను తీసుకెళ్లి చంపేస్తానని  ప్రచండ చెప్పాడు కదా ఆ మాట కోసం ఇన్ని రోజులు ఆగాడు.. ఇప్పుడు చూడు బుజ్జమ్మను ఎలా తీసుకొస్తున్నాడో అంటుంది చంభా. మనోహరి, చంభా చూస్తుండగానే.. ప్రచండ బుజ్జమ్మను తన వెంట తీసుకుని కింద హాల్లోకి వెళ్తాడు. చంభా నవ్వుతూ.. మనోహరి నీకు మంచి టైం మొదలైంది. ఇవాళ ప్రచండ చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాడు. అని చెప్తుండగానే అప్పుడే పైన అమర్‌ రూంలోంచి కిందకు తన రూంలోకి వెళ్లడానికి వస్తుంది మిస్సమ్మ.

Advertisement

మిస్సమ్మను చూసి చంభా, మనోహరి షాక్‌ అవుతారు. ఈ టైంలో ఇది వస్తుందేంటి అంటూ మనోహరి ఇరిటేట్‌ అవుతుంది. మిస్సమ్మ మాత్రం తన రూంలోకి వెళ్లబోతుంది. అప్పుడే మెయిన్‌ డోర్‌ తెరుస్తాడు ప్రచండ. మెయిన్‌ డోర్‌ తెరుచుకున్న సౌండ్‌ విని మిస్సమ్మ డోర్‌ వైపు చూస్తుంది. అక్కడ అంజు, బుజ్జమ్మ నిలబడి ఉండటం చూసి గట్టిగా బుజ్జమ్మ, అంజు అంటూ పిలుస్తుంది. మిస్సమ్మ మాటలకు ప్రచండ మంత్రం వేసి బుజ్జమ్మ నిద్రపోయేలా చేస్తాడు. తాను కూడా అంజులా సైలెంట్‌గా చూస్తుంటాడు. మిస్సమ్మ దగ్గరకు వెళ్లి బుజ్జమ్మను చూసి అదేంటి నిలబడే నిద్రపోతుంది అని అడుగుతుంది.. ఏమైంది అంజు అని అడగ్గానే.. అంజు ఏమో మిస్సమ్మ అంటుంది.

దీంతో మిస్సమ్మ కోపంగా అయినా మీరు ఈ టైంలో ఇక్కడకు ఎందుకు వచ్చారు అని అడగ్గానే.. ఏమో మిస్సమ్మ నేను పైన రూంలో నిద్రపోతుంటే.. సడెన్‌గా మెలుకువ వచ్చింది. కళ్లు తెరిచి చూస్తే బుజ్జమ్మ కళ్లు మూసుకుని బయటకు వస్తుంది. నాకు భయం వేసి నేను బుజ్జమ్మ వెనకే వచ్చాను. బుజ్జమ్మ ఇక్కడికి వచ్చి డోర్‌ తీసింది. బయటకు వెళ్లబోతుంటే.. నేనే చేయి పట్టుకుని ఆపుతున్నాను.. అప్పుడే నువ్వు వచ్చావు.. అయితే బుజ్జమ్మకు నిద్రలో నడిచే అలవాటు ఉందేమో అని చెప్పగానే..

Advertisement

బుజ్జమ్మకు ఆ అలవాటు లేదు అంజు.. అంటూ బుజ్జమ్మను గట్టిగా అదిలిస్తుంది. వెనక నుంచి ప్రచండ మంత్రం చదవగానే.. బుజ్జమ్మ కళ్లు తెరచి మిస్సమ్మను చూసి అయోమయంగా అమ్మా నువ్వ మా గదిలో ఉన్నావేంటి..? అంటూ అటూ ఇటూ చూస్తూ.. నేను ఇక్కడ ఉన్నానేంటి..? ఇక్కడికి ఎలా వచ్చాను అంటూ అడుగుతుంటే.. డోర్‌ చాటు నుంచి చూస్తున్న మనోహరి, చంభా ఇరిటేటింగ్‌గా చూస్తుంటారు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×