E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మను చంపేందుకు మనోహరి ప్లాన్

Nindu Noorella Saavasam Serial Today January 8th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  మిస్సమ్మను చంపేందుకు మనోహరి ప్లాన్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

మనోహరి ఇంట్లోనే కాకుండా ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తుంది. అదంతా తన మొబైల్‌లో చూసుకునేలా కనెక్షన్‌ తీసుకుంటుంది. అంతా గమనించిన చంభా అనుమానంగా మనోహరి ఇంటి చుట్టూ కెమెరాలు  బిగించి ఏం చేయాలి అనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు అంటూ అడగ్గానే.. బిడ్డతో భాగీ ఊళ్లోకి దిగింది అని తెలిసింది కదా..? ఊళ్లోకి వచ్చింది ఇంటి దాకా రాకుండా ఉంటుందా..? అని చెప్పగానే.. కచ్చితంగా వస్తుంది. కానీ మనం పెట్టిన ఏడేళ్ల గడువులో ఇంకా రెండేళ్లు మిగిలి ఉన్నాయి కదా..? అని అడగ్గానే.. మనం దానికి పెట్టిన భయం వందేళ్లు ఉంటుంది. కానీ అది మమకారం చంపుకోలేక అమరేంద్రను పిల్లలను చూడటానికి ఈ ఇంటికి చాటుగా వచ్చిన రావొచ్చు అంటుంది మనోహరి. దీంతో చంభా అందులో అనుమానమే లేదు.. చాటు వచ్చినా వస్తుంది అనగానే.. అది చాటుగా వచ్చినా..? స్టేట్‌గా వచ్చినా నా కంట్లో పడాలనే ఇన్ని కెమెరాలు ఫిక్స్‌ చేయించాను అంటుంది మనోహరి.

అది సరే ఎలాగూ భాగీ వచ్చింది అనుకుందాం.. అప్పుడేం చేస్తావు..అంటూ చంభా అడగ్గానే.. ముందు దాన్ని చూస్తాం.. మనం వేసిన శిక్షలో భాగంగా ఈ ఐదేళ్ల తర్వాత అది ఎలా ఉందో చూస్తాను. తర్వాత దాని అంతు చూస్తాను అని మనోహరి చెప్పగానే.. చంభా భయంగా అంటే భాగీని చంపేస్తావా..? అని అడుగుతుంది. మనోహరి కోపంగా నిస్సందేహంగా ఏడేళ్ల గడువు గడిచాక నేనే దాన్ని వెతుక్కుంటా వెళదామనుకున్నాను.. కానీ దాని చావును అదే వెతుక్కుంటూ వచ్చింది. ఇన్నేళ్లు దాన్ని అరుంధతి కాపాడుకుంటూ వచ్చింది. ఇప్పుడు ఎవరు కాపాడుతారో నేను చూస్తాను అనగానే.. చంభా గుర్రుగా చూస్తూ.. మనోహరి ఇప్పుడు కూడా ఆ అరుందతియే కాపాడుతుంది.. ఆ విషయం మర్చిపోకు.. అనగానే..

Advertisement

మనోహరి నవ్వుతూ అదెక్కడ ఉంది ఎప్పుడో పైకి పోయింది కదా..? అనగానే.. మర్చిపోయినట్టు ఉన్నావు.. బిడ్డ రూపంలో అరుంధతి కిందకు వచ్చింది కదా..? పుట్టగానే.. నువ్వు ముట్టుకోగానే.. నీకు షాక్‌ ఇచ్చింది. పసిబిడ్డగా ఉన్నప్పుడే నిన్ను కాలుతో తన్నింది. నీకు గన్ను ఎక్కుపెట్టింది. ఇప్పుడు అరుందతి ఐదేళ్ల పిల్ల అంటే నడవడం మాట్లాడటం వచ్చిన పిల్ల అంటే ఇంకా శక్తి వంతురాలు అయ్యుంటుంది. నువ్వు అనుకుంటున్నట్టు భాగీ నీ చేతుల్లో చావడానికి రాలేదు మనోహరి.. నిన్ను చంపడానికే అరుంధతే భాగీని వెంటపెట్టుకుని వచ్చింది. భాగీ తన చావును వెతుక్కుంటూ రాలేదు.. నీ చావునే వెంటపెట్టుకుని వచ్చింది. వచ్చింది అమ్మా కూతుళ్లు కాదు.. అక్కా చెల్లెల్లు అని గుర్తు పెట్టుకో అంటూ చంభా హెచ్చిరించడంలో మనోహరి  కోపంగా మళ్లీ పుట్టిన అరుంధతి నా మృత్యువుని నేను మర్చిపోలేదు.. చంభా అందుకే ఐదు సంవత్సరాల క్రితం ఆ చావును గడప దాటించాను.. ఇప్పుడు అదే చావును గడగడా వణికిస్తాను.. వాళ్లు తల్లీబిడ్డలైనా..? అక్కా చెల్లెళ్లు అయినా నా చేతిలో చావడం ఖాయం.. నా చావును నేనే చంపేస్తాను అంటుంది మనోహరి..

అది నీకు సాధ్యం అవుతుందా..? అది నువ్వు చేయగలవా..? అని చంభా అడగ్గానే.. నేను ఏం చేయగలనో నీకు బాగా తెలుసు చంభా.. ఈ మనోహరికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదు.. ఇప్పుడా బిడ్డ శక్తి పెరిగి ఉండొచ్చు.. అలాగే నా తెలివి కూడా పెరిగింది.  చూస్తూ ఉండు నేను వాళ్లను ఎలా చంపేస్తానో..? అంటుంది మనోహరి. దీంతో చంభా నువ్వు వాళ్లను చంపేస్తావో.. వాళ్లు నిన్ను చంపేస్తారో నేను చూస్తానులే అని మనసులో అనుకుంటుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×