E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 4th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌ ఇంట్లో రచ్చరచ్చ చేసిన రామ్మూర్తి – రామ్మూర్తిని తిట్టిన మనోహరి

Nindu Noorella Saavasam Serial Today January 4th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌ ఇంట్లో రచ్చరచ్చ చేసిన రామ్మూర్తి – రామ్మూర్తిని తిట్టిన మనోహరి
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode : ఆశ్రమంలో వార్డెన్‌ నిజం చెప్పలేదని ఏకంగా అమర్‌తోనే తేల్చుకుంటానని వెళ్లిపోతాడు. దీంతో వార్డెన్‌ రాథోడ్‌కు ఫోన్‌ చేసిన వార్డెన్‌.. రామ్మూర్తి ఆశ్రమానికి వచ్చిన విషయం చెప్తుంది. నిజం తెలుసుకోవడానికి అమర్‌ కోసం వస్తున్నాడని చెప్పగానే రాథోడ్‌ పరుగెత్తుకుని అమర్‌ దగ్గరకు వెళ్లి ఫోన్‌ ఇస్తాడు. రాథోడ్‌ పరుగెత్తడం చూసిన మిస్సమ్మ వెనకాలే వెళ్తుంది. ఫోన్‌ తీసుకున్న అమర్‌ మిస్సమ్మను చూసి ఫోన్‌ తీసుకుని బయటకు వెళ్లిపోతాడు. మిస్సమ్మ ఏమైంది రాథోడ్‌ ఆయన ఆలా వెళ్లిపోయారు.

నువ్వు ఎందుకు అంతగా పరుగెత్తుకొచ్చావు అని అడుగుతుంది. ఏదో ఆశ్రమం నుంచి ఫోన్‌ వచ్చింది అంటున్నావు ఏ ఆశ్రమం నుంచి ఫోన్‌ వచ్చింది మా అక్క గురించి ఎమైనా తెలిసిందా అని అడుగుతుంది. లేదని చెప్పి రాథోడ్‌ కూడా బయటకు వెళ్లిపోతాడు. సార్‌ ఆ పెద్దాయనకు నిజం తెలిసి ఇక్కడికే వస్తున్నాడు ఇప్పుడు ఎలా సార్‌ అంటాడు. ఏం జరిగినా నిజం మాత్రం నేను చెప్పను రాథోడ్‌ అంటాడు అమర్‌. ఇద్దరు మాట్లాడుకుంటుంటే మిస్సమ్మ వచ్చి ఏమైందని సైగ చేస్తుంది. ఏం లేదని అమర్‌ సైగ చేయగానే వెళ్లిపోతుంది. కోటి ప్రశ్నలతో మీ సమాధానం కోసం వచ్చే ఆ తండ్రికి మీరు ఏం సమాధానం చెప్తారు సార్‌ అంటాడు రాథోడ్‌.

Advertisement

ఆస్తికలు కనిపించకుండా పోయాయన్న భయంలో నిన్ను నాలుగు మాటలు అన్నాను మనసులో పెట్టుకోకు ఘోర అంటూ ఏంటి ఆలోచిస్తున్నావు అని ఘోరను అడుగుతుంది. ఆ భాగమతికి నువ్వే అరుంధతిని చంపేశావని తెలిసిందేమోనని ఆలోచిస్తున్నాను అని ఘోర చెప్పగానే.. అది కొన్ని సార్లు తెలిసినట్టే నాతో మాట్లాడుతుంది. ఆ ఆరుంధతియే ఎప్పుడో చెప్పి ఉంటుందని మనోహరి చెప్పగానే ఘోర నవ్వుతుంటాడు. నా బాధను చూస్తే నీకు నవ్వుగా ఉందా..? అని మనోహరి అడుగుతుంది. దీంతో నీ పిచ్చితనం చూసి నవ్వొచ్చింది.

కొన్ని నెలలు ఆ ఆత్మను చూసిన నాకే ఆరంధతి మంచితనం అర్తం అయింది. నీకు అర్థం కాలేదా..? ఆరు నిజం చెప్పడం ఎంత సేపు.. కానీ ఆరుందతి నిజం చెప్పలేదు.. ఎప్పటికీ చెప్పదు. ఎందుకంటే అరుంధతికి తన పగ కంటే తన కుటుంబం బాగుండాలని కోరుకుంటుంది. స్నేహానికి ఒకవైపు నువ్వు ఉంటే రెండో వైపు అరుంధతి ఉంది. ప్రతి విషయంలో నువ్వు తప్పు వెతికితే.. నీ తప్పుల్లో కూడా మంచిని వెతికింది. నీకు ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే పౌర్ణమి రోజు ఆరుంధతికి శక్తులు రాగానే నీ అంతం చూస్తుంది జాగ్రత్తగా ఉండమని ఘోర చెప్పగానే.. దాని ముఖం అదేం చేస్తుంది అంటుంది మనోహరి.

Advertisement

గార్డెన్‌లో కూర్చున్న గుప్త హ్యాపీగా నవ్వుతూ ప్రశాంతంగా ఉంది ఈ సమయంలో కాస్త విశ్రాంతి తీసుకుంటాను అని గుప్త నిద్రపోతుంటే..యముడు వచ్చి గుప్త నీ స్థాయి ఏంటి నువ్వు చేస్తున్న పనులేంటి అసలు నీ చుట్టూ ఏం జరగుతుందో చూస్తున్నావా..? అని అడగ్గానే ఉన్న ఒక్క శక్తిని మీరే తీసుకున్నారు ఇక నాకెలా తెలుస్తుంది అంటాడు గుప్త. దీంతో రామ్మూర్తి ఇంటికి వస్తున్న విషయం చెప్తాడు యముడు. దీంతో వెంటనే ఈ బాలిక ఇక్కడ ఉండకుండా ఎక్కడికైనా తీసుకెల్లాలి అంటూ ఆరు కోసం వెతుకుతాడు. గట్టిగా పిలుస్తాడు.

ఆరు రాగానే నేను నీకు ఒక బహుమతి ఇస్తాను అని చెప్పగానే సరే వెళ్దాం పద అంటుంది ఆరు.  ఇద్దరూ వెళ్లబోతుంటే.. ఇంతలో రామ్మూర్తి కోపంగా ఇంట్లోకి వస్తాడు. రామ్మూర్తిని చూసి ఆరు ఎందుకు గుప్త గారు ఆయన అంత కోపంగా వస్తున్నారు ఏం జరిగిందో  చూద్దా పదండి అంటూ కిటికీ దగ్గరకు వెళ్తుంది. లోపలికి వెళ్లిన రామ్మూర్తిని చూసి మిస్సమ్మ  ఆశ్చర్యంగా  ఎప్పుడు వచ్చారు నాన్నా అంటూ ప్రేమగా అడుగుతుంది. రామ్మూర్తి పలకకుండా అల్లుడు గారు ఎక్కడున్నారు అని అడుగుతాడు. పిల్లుల, నిర్మల, శివరాం వచ్చి పలకరించినా పలకకుండా అల్లుడు గారు ఎక్కడున్నారు అని  అడుగుతాడు.

ఎందుకు నాన్నా మీరు ఇంత ఆవేశంగా ఉన్నారు అంటూ మిస్సమ్మ అడగ్గానే.. ఎందుకంటే నా పెద్ద కూతురు గురించి తెలుసు కాబట్టి అంటూ కోప్పడతాడు. ఆయనకు నిజం తెలియడం ఏంటని అడుగుతుంది మిస్సమ్మ.. ఎక్కడో ఏదో తప్పు జరిగింది. అమర్ అలాంటోడు కాదని నిర్మల చెప్తుంది. ఇంతలో మనోహరి వచ్చి రామ్మూర్తిని తిడుతూ పుట్టగానే అందరినీ దూరం చేసుకున్న అంత గొప్ప జాతకురాలి గురించి ఇంత వెతకడం ఏంటని అనగానే రామ్మూర్తి కోపంగా మనోహరిని తిడతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×