E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఇంట్లోంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయిన పిల్లలు

Nindu Noorella Saavasam Serial Today January 4th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  ఇంట్లోంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయిన పిల్లలు
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

పిల్లలను మనోహరి ఇష్టం వచ్చినట్టు తిడుతుంది. తన పెత్తనం మొత్తం నడిపిస్తుంది. దీంతో పిల్లలు బాధపడుతుంటారు. అందరూ రూంలో కూర్చుని బాధపడుతుంటారు. రోజు రోజుకు మనోహరి టార్చర్‌ ఎక్కువ అవుతుంది. ఏం చేద్దాం అంటుంది అంజు. దీంతో ఆనంద్‌ బాధగా మిస్సమ్మ వెళ్లిపోయాక మనోహరి ఆంటీ మనల్ని స్లేవ్స్‌ లాగా చూస్తుంది. చీటికి మాటికి మనల్ని కొట్టి తిట్టి  ఇంసల్ట్‌ చేస్తుంది అని బాధపడతాడు. దీంతో ఆకాష్‌ కూడా డాడ్‌ కూడా ఆమెనే సపోర్ట్‌ చేస్తూ మనల్ని అసలు పట్టించుకోవడం లేదు.. మనం ఏదో ఒకటి  చేయాలి అంటాడు. ఇంతలో అమ్ము కూడా డాడ్‌ సపోర్ట్‌ లేకుండా మనం ఆమెను ఎదిరించి మనం ఏమీ చేయలేం అందుకే నేను హాస్టల్ కు వెళ్లిపోదాం అనుకుంటున్నాను అని చెప్పగానే.. పిల్లలు ముగ్గురు షాక్‌ అవుతారు.

అంజు భయంగా నువ్వు హాస్టల్‌ కు వెళితే మరి మా పరిస్థితి ఏంటి అమ్ము.. మమ్మల్ని ఎవరు చూసుకుంటారు అని అడుగుతుంది. దీంతో అమ్ము నువ్వు ఎప్పటి నుంచో కొడైకెనాల్‌ స్కూల్‌ లో చదువుకోవాలని అనుకుంటున్నావు కదా..? పైగా నీ ఫ్రెండ్స్‌ అందరూ అక్కడే ఉన్నారు నువ్వు అక్కడికే వెళ్లు అని చెప్తుంది. దీంతో ఆనంద్‌.. నువ్వు హాస్టల్‌ కు వెళ్తావు.. అంజు కొడైకెనాల్‌ వెళ్తుంది. మరి మేము ఎక్కడికి వెళ్లాలి అమ్ము అని ప్రశ్నిస్తాడు. ఆకాష్‌ కూడా మేము ఇక్కడే ఉండి మనోహరి ఆంటీ టార్చర్‌ భరించాలా..? అని అడుగుతాడు. దీంతో అమ్ము అవసరం లేదు నేను మీ గురించి కూడా ఆలోచించాను. మీరిద్దరూ డెహ్రాడూన్‌ క్యాంపస్‌కు వెళ్లండి అని చెప్పగానే… అంజు బాధగా అదేంటి మనం నలుగురం ఒక్కచోట ఉండలేమా..? తలో వైపు వెళ్లిపోవాల్సిందేనా..? అని అడగ్గానే.. అవ్వదు అంజు మిస్సమ్మ తిరిగి వస్తుందని ఫైవ్‌ ఇయర్స్‌ నుంచి ఎదురుచూస్తున్నాను.. తను రాలేదు సరికదా..? తను బుజ్జమ్మ ఎక్కడున్నారో కూడా మనకు తెలియదు.. మిస్సమ్మ లేకుండా మనం ఈ ఇంట్లో ఉండలేము.. అందరం కలిసి ఒకేచోట చదువుకునే పరిస్థితి కూడా లేదు.. మనం ఎక్కడున్నా రెండు రోజులకు ఒకసారి ఫోన్‌లో మాట్లాడుకుందాం.. అప్పుడప్పుడు ఇంటికి వచ్చి డాడ్‌ను చూసి వెళ్దాం.. అని చెప్పగానే..

Advertisement

ఆనంద్ బాధగా ఇలాంటి సిచుయేషన్‌ వస్తుందని అసలు ఊహించలేదు అమ్ము.. అమ్మ ఉంటే అసలు ఇలా జరిగేదే కాదు.. అనగానే.. ఆకాష్‌ కూడా మిస్సమ్మ ఉంటే అసలు ఇలా జరగనిచ్చేదే కాదు.. అవును అమ్ము చాలా బాధగా ఉంది. మనం విడిపోతాము అంటే ఏడుపు వస్తుంది. మనకే ఎందుకు ఇలా జరగాలి అంటూ ఏడుస్తుంటాడు. అందరూ ఒకరిని ఒకరు హగ్‌ చేసుకుని ఏడుస్తుంటారు. అమ్ము అందరినీ ఓదారుస్తూ… ఏడవకండి ఇలాంటప్పుడే మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పగానే.. అంజు ఏడుస్తూ.. అమ్ము మనం చిన్న పిల్లలం కదా ఆ దేవుడు మనకు ఎందుకు ఇలా చేశాడు.. అని అడుగుతుంది. ఆనంద్‌ కూడా ఏడుస్తూ.. ఒకసారి అమ్మను దూరం చేశాడు.. తర్వాత మిస్సమ్మను దూరం చేశాడు. చివరికి బుజ్జమ్మ కూడా దూరం అయింది అంటూ ఏడుస్తుంటాడు. ఆకాష్‌ కూడా ఏడుస్తూ.. మన కోసం ఎవ్వరూ రారా అమ్మూ.. మన బాధల్ని తీర్చడానికి మన కన్నీళ్లు తుడవడానికి ఎవరూ రారా..? అని అడగ్గానే.. అమ్ము కూడా ఏడుస్తూ.. బుజ్జమ్మను తీసుకుని మిస్సమ్మ ఇంటికి తిరిగి వస్తుందని కృష్ణుడి పాదాలు వేశాం.. కానీ మనమే ఇంట్లో లేకుండా పోతున్నాం.. ఇలాంటి పరిస్థితి వస్తుందని నేను కూడా అనుకోలేదు.. ఒకవేళ మనం వెళ్లిపోయాక మిస్సమ్మ, బుజ్జమ్మ తిరిగి వస్తే.. అని అంజు అడగ్గానే..

వాళ్లు ఎప్పటికీ తిరిగి రారు అని మనోహరి ఆంటీ అంటుంది కదా అంజు అని ఆనంద్‌ చెప్తే.. డాడ్‌ కూడా ఆ మాటే అంటున్నారు.. డాడ్‌ చెప్పారంటే.. వాళ్లు తిరిగి రాకపోవచ్చు అంటూ ఆకాష్‌ బాధపడతాడు. ఇక అమ్ము తాను డాడ్‌ తో చెప్తాను.. మనం రెండు రోజుల్లో వెళ్లిపోదాం.. మనం వెళ్లాక మిస్సమ్మ, బుజ్జమ్మ తిరిగి వస్తే.. మనం ఎక్కడున్నా సరే మిస్సమ్మ మనల్ని ఇక్కడకు తీసుకొస్తుంది మనల్ని టార్చర్‌ చేస్తున్న మనోహరి ఆంటీకి మిస్సమ్మ బుద్ది చెప్తుంది. అనగానే.. అయితే మనం వెళ్లకముందే మిస్సమ్మ, బుజ్జమ్మ ఇంటికి తిరిగి వస్తే బాగుండు అని అంజు అనగానే అందరూ బాధపడుతుంటారు. మరోవైపు బస్సులో వస్తున్న విక్రమ్‌కు స్ట్రోక్‌ వస్తుంది. మిస్సమ్మ, బుజ్జమ్మ సీపీఆర్‌ చేసి విక్రమ్‌ను బతికిస్తారు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×