E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను కాపాడిన మరో రాబంధు 

Nindu Noorella Saavasam Serial Today January 31st: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను కాపాడిన మరో రాబంధు 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

  చంభా మంత్రం వేయగానే గద్ద వస్తుంది. రన్నింగ్‌ కాంపిటీషన్ లో పాల్గొంటున్న బుజ్జమ్మను ఎత్తుకుని పోవడానికి ట్రై  చేస్తుంది. అప్పుడు అమర్‌ అడ్డు పడతాడు. అమర్‌ను మీద రాబందు దాడి చేస్తుంది. అమర్‌కు దెబ్బలు తగిలి రక్తం కారుతుంటుంది. అమర్‌ దూరంగా వెళ్లి పడిపోతాడు. అంతా చూస్తున్న మనోహరి, చంభా హ్యాపీగా ఫీలవుతారు. మనోహరి మాత్రం అమర్‌ ఎందుకు అడ్డం వెళ్లాడని తిట్టుకుంటుందని అనుకుంటుంది. ఇంతలో బుజ్జమ్మను తీసుకుని రాబందు ఎగిరిపోతుంది. అది చూసిన మిస్సమ్మ అప్పుడు అమ్ము మీద దాడి చేసిన రాబంధే ఇప్పుడు మళ్లీ వచ్చింది. బుజ్జమ్మను ఎత్తుకుపోయింది. అంటే పంతులు చెప్పింది నిజమే అయింది. అయ్యో దేవుడా ఇప్పుడెలా చేయాలి. పంతులు చెబితే కరుణ తిట్టి పంపించేసింది. ఇప్పుడు రాబంధు బుజ్జమ్మను ఎత్తుకుని వెళ్లింది. ఇప్పుడేం చేయాలి అని బాధపడుతుంది.

మరోవైపు అక్కడే ఉన్న మనోహరి, చంభా మాత్రం హ్యాపీగా ఫీలవుతుంటారు. చంభా ఇప్పుడు ఆ అరుంధతిని ఎత్తుకెళ్లిన రాబంధు ఏం చేస్తుంది. అసలు ఎక్కడికి తీసుకుని వెళ్లి ఉంటుంది. ఏమో మనోహరి అది వచ్చి తీసుకెళ్లడం వరకే మనకు తెలుసు..? అది తర్వాత ఏం చేస్తుందన్నది మన చేతుల్లో ఉండదు. పర్వతాలలోకి ఎత్తుకెళ్లి రాబంధులన్నీ కలిసి ఆహారం తీసుకోవచ్చు.. లేదా ఇంకేదైనా చేయోచ్చు.. అని చంభా చెప్పగానే.. ఆహా ఇప్పటికీ నా పగ నెరవేరంది. ఓసేయ్‌ అరుంధతి ఆ జన్మలో నా చేతిలో చచ్చావు. ఈ జన్మలోనూ నా చేతిలోనే చచ్చావు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తి వచ్చినా నా చేతిలోనే నీ చావు ఉంటుంది. చూశావా చంభా ఆ అరుంధతి ఏమో కానీ ఈ అరుంధతికి శక్తులు ఉన్నాయి. అన్నావు.. జాగ్రత్తగా ఉండమని హెచ్చరించావు.. కానీ ఇప్పుడేమైంది. నా చేతుల్లో దాని చావు రాసి పెట్టి ఉన్నప్పుడు ఎవ్వరూ తప్పించలేరు.. ఇక ఈ దెబ్బతో ఆ భాగీ ఊరు వదిలి వెళ్లిపోవడం ఖాయం.. అనగానే.. లేదు మనోహరి బిడ్డ చనిపోయిన బాధలో ఇక ఎవరికి ఏ ముప్పు లేదన్న నమ్మకంతో భాగీ మళ్లీ అమరేంద్రను కలిస్తే ఏం చేస్తావు.. అని అడగ్గానే..

Advertisement

దానికి ఒక ప్లాన్‌ చేశాను చంభా అది జన్మలో అమర్‌ను కలవకుండా చేయబోతున్నాను. కాదు కూడదు అంటే అది సూసైడ్‌ చేసుకుని చచ్చిపోయేలా చేస్తాను.. అంటూ మనోహరి చెప్పగానే.. చంభా నవ్వుతుంది. మరోవైపు అందరూ టెన్షన్‌ పడుతుంటారు. అంజు బాధపడుతూ.. స్కూల్‌ లో ఉన్న గణపతి విగ్రహం దగ్గరకు వెళ్లి మొక్కుతుంది. పిల్లలందరూ కలిసి అంజును ఫాలో అవుతూ.. మొక్కుతుంటారు. మరోవైపు అమర్‌ మిలటరీ వాళ్లకు  ఫోన్‌ చేసి రమ్మని చెప్తాడు. ఇక బుజ్జమ్మను ఎత్తుకెళ్లిన రాబంధులు ఎతైన కొండల మధ్య తీసుకెళ్లి పెడతాయి. స్కూల్‌లో ఉన్న అంజు ఏడుస్తూ.. వినాయకుడి విగ్రహం ముందు నిలబడి దేవుడా మా బుజ్జమ్మను కాపాడు.. ఎలాగైనా బుజ్జమ్మను కాపాడు దేవుడా..? రాబంధులు మా బుజ్జమ్మను ఏమీ చేయకుండా కాపాడు స్వామి.. అవి ఎక్కడికి ఎత్తుకెళ్లాలో ఏమో కానీ నువ్వే మా బుజ్జమ్మను కాపాడాలి స్వామి అని అంటూ వేడుకుంటుంది.

ఇంతలో ఆ బుజ్జమ్మను ఎత్తుకెళ్లిన రాబంధుల దగ్గరకు ఒక పెద్ద రాబంధు వచ్చి వాటితో ఫైట్‌ చేసి వాటిని చంపేసి.. బుజ్జమ్మను తన మీద కూర్చోబెట్టుకుని స్కూల్‌ దగ్గరకు తీసుకుని వస్తుంది. అది చూసిన అంజు దేవుడికి థాంక్స్‌ చెప్తుంది. స్కూల్‌లో ఉన్న అమర్‌, రాథోడ్‌, మనోహరి, చంభా, మిస్సమ్మ మిగతా వాళ్లందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఇంతలో రాబంధును బుజ్జమ్మను సేఫ్‌గా కింద దించేసి వెళ్లిపోతుంది. బుజ్జమ్మ ఏవండి అనుకుంటూ వెళ్లి అమర్‌ను హగ్‌ చేసుకుంటుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×