E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ మీదకు గద్దను ప్రయోగించనున్న చంభా  

Nindu Noorella Saavasam Serial Today January 29th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మ మీదకు గద్దను ప్రయోగించనున్న చంభా  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మిస్సమ్మ, కరుణలకు మళ్లీ జాతకం చెప్పి భయపెట్టిన పంతులును కరుణ తిట్టి ఇక్కడి నుంచి వెళ్లిపో అని చెప్తుంది. పంతులు వెళ్లిపోతాడు. మిస్సమ్మ కంగారు పడుతుంటే..కరుణ ఏయ్‌ పోరీ ఈ పంతులు ఊకెనే భయపెడుతుండు. బుజ్జమ్మకు ఏమీ కాదు అని చెప్పగానే.. మిస్సమ్మ అది కాదే నేను బుజ్జమ్మ విషయంలో రిస్క్‌ తీసుకోలేను తనకు ఏదైనా జరిగితే నేన తట్టుకోలేను అంటుంది. దీంతో కరుణ కోపంగా ఏమైతదే.. ఎందుకు తట్టుకోలేవు.. అని అడగ్గానే.. అది కాదు కరుణ బుజ్జమ్మ మళ్లీ పుట్టిన మా అరుంధతి అక్కా అనుకున్నాము. తనను ఆ జన్మలో చాలా మిస్‌ అయ్యాను. ఈ జన్మలో అయినా తనను నేను కాపాడుకోవాలి అని చెప్పగానే..

ఏయ్‌ ఏందే దమాక్‌ గిట్ల కరాబ్ అయిందా ఏంటి..? బుజ్జమ్మ జోలికి వస్తే ఆ మనోహరి తోలు తీయలేమా ఏంది..? అని చెప్పగానే.. మిస్సమ్మ భయంగా మనోహరితో నేను ఎంతైనా పోరాడతానే కానీ బుజ్జమ్మకు ఏమైనా అయితే అంటూ భయపడుతుంటే.. ఏయ్‌ చల్‌ పోరీ దేవుడు ఉన్నాడే పసిపిల్లల జోలికి వస్తే ఆయన ఊరుకుంటాడా..? ఈరోజు అమ్ము జోలికి వెళ్లి దేవుడు ఏం చేసిండు.. నువ్వు ధైర్యంగా ఉండు.. బుజ్జమ్మకు ఏమీ కాదు పా పోదాం అరేయ్‌ ఇంకా ఏం సోర్చాయిస్తున్నావే.. పద వెళ్దాం.. అని అక్కడి నుంచి మిస్సమ్మను తీసుకుని వెళ్లిపోతుంది.

Advertisement

మరోవైపు పంతులు వెళ్తుంటే ఎదురుగా చంభా, మనోహరి నిలబడి ఉంటారు. వాళ్ల దగ్గరకు వెళ్లిన పంతులు నమస్కారం అమ్మా లక్ష్మీదేవి అంటాడు. దీంతో మనోహరి నా పేరు లక్ష్మీదేవి కాదు మనోహరి అంటుంది. దీంతో చంభా.. మనోహరి నీకు ఇంకా అర్థం కాలేదా..? పంతులు గారికి నువ్వు ఇంకా డబ్బులు ఇస్తున్నావు కదా..? అందుకే నువ్వు ఆయనకు లక్ష్మీదేవివే..! అని చెప్పగానే.. పంతులు కూడా నవ్వుతూ మంచి మాట చెప్పారు అమ్మా అంటాడు. దీంతో మనోహరి నేను చెప్పిన పని ఏం చేశారు పంతులు గారు అని అడుగుతుంది. అమ్మా ఇప్పుడే భాగీ ఎదురుపడ్డారమ్మా మీరు చెప్పమన్నట్టు ఈ సారి జాతకం మారింది ఇప్పుడు ప్రమాదం అమ్ముకు కాదు..  అరుంధతికి అని చెప్పేశానమ్మా..? అని చెప్పగానే.. భాగీ నమ్మేసిందా అని మనోహరి అడుగుతుంది. నమ్మడమేంటమ్మా.. బాగా భయపడిపోతేనూ.. అంటాడు పంతులు. అయితే మీరు బయలుదేరండి.. అనగానే.. పంతుల మరి డబ్బులు.. అని అడగ్గానే.. మీ అకౌంట్‌లో పడతాయి. మీరేం టెన్షన్‌ పడొద్దు వెళ్లండి అని చెప్పగానే.. సంతోషం తల్లి మీకు వెయ్యి శుభములు కలుగుగాక అంటూ వెళ్తుంటే..

చంభా మనసులో చేసేది చెడ్డ పని మళ్లీ దీవెనలు అనుకుంటుంది. ఇంతలో మనోహరి ఇప్పుడు చెప్పు చంభా నా అదృష్టం తిరగబడింది. నాకు చెడు రోజులు వచ్చేశాయి. భాగీ నా ప్లాన్‌ కనిపెట్టింది. నాకు గడ్డు కాలం అని ఏదేదో అన్నావు కదా..? ఇప్పుడు ఏమంటావు.. భాగీ పంతులును కలుస్తుందని మళ్లీ జాతకం గురించి అడుగుతుందని నేను గెస్ చేశాను. అందుకే ఈ సారి అపాయం అమ్ముకు కాదు అరుందతికి అని చెప్పించి భాగీని బాగా భయపెట్టాను.. ఈ దెబ్బతో భాగీ పారిపోతుంది అనగానే.. చంభా అనుమానంగా పంతుల అలా చెప్పగానే పారిపోతుంది అంటావా..? అని అడుగుతుంది. దీంతో మనోహరి లేదు మనం అరుంధతిపై అటాక్‌ చేయించబోతున్నాం కదా..? ఆ చిన్న పిల్లపై చిన్న గీత పడినా భాగీ బాడీలో చిన్న షివరింగ్‌ వస్తుంది అని చెప్పగానే..

Advertisement

భాగీని వణికించడం అటు ఉంచు నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా..? అరుంధతితో మళ్లీ పుట్టిన అరుందతితో ముందు జన్మలో అరుందతిని నువ్వు చంపావ్‌.. కానీ ఈ జన్మలో అరుందతి నీ మృత్యువు ఆ పిల్ల మళ్లీ పుట్టిన అరుంధతి.. చచ్చి బతికిన అరుంధతి పుట్టుకతోనే శక్తులు ఉన్న అరుంధతిఆ దేవుడి సాయం ఉన్న అరుందతి ఏమాంత్రం తేడా వచ్చినా నువ్వు మిగలవు మనోహరి.. చచ్చిపోతావు.. ఆ అరుంధతి చంపేస్తుంది అంటూ చంభా భయపెడుతుంటే.. మనోహరి కోపంగా ఆపు చంభా ఆ పిల్ల అరుంధతికి నువ్వు ఇచ్చిన ఎలివేషన్ చాలు.. నేను చెప్పిన అరైంజ్‌మెంట్స్‌ అన్ని చేశావు కదా..? అని అడగ్గానే.. ఆ ఏర్పాట్లు అన్ని ఎప్పుడో అయిపోయాయి..అని చంభా చెప్పగానే.. పద అక్కడికి వెళ్లి ఆ పిల్ల అరుంధతిని మళ్లీ చంపేద్దాం అనుకుంటూ ఇద్దరూ కలిసి వెళ్లిపోతారు.

మరోవైపు పిల్లుల ఇంట్లో ఉన్న అమర్‌ దగ్గరకు వెళ్లి డాడ్‌ రేపు మీరు స్కూల్‌కు రావాలి అని అడుగుతారు. ఎందుకని అమర్‌ అడగ్గానే.. రేపు రిపబ్లిక్‌ డే కదా పేరెంట్స్‌ ను తీసుకురమ్మని చెప్పారు అనగానే.. అమర్‌ రేపు నేను వస్తాను. బుజ్జమ్మ కోసం కూడా వస్తున్నాను అని చెప్తాడు. దీంతో మనోహరి కోపంతో రగిలిపోతుంది. వెంటనే చంభా దగ్గరకు వెళ్లి ఆ బుజ్జమ్మ మీద ఈరోజే దాడి జరగాలని ఇంటి దగ్గర కాదు స్కూల్‌ గ్రౌండ్‌లో అని చెప్తుంది. వెంటన చంభా సరే అంటూ బయట లాన్‌లోకి వెళ్లి గద్దను పిలుస్తుంది. గద్ద చంభా దగ్గరకు వస్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×