E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను అటాక్ చేసిన గద్ద  

Nindu Noorella Saavasam Serial Today January 30th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: బుజ్జమ్మను అటాక్ చేసిన గద్ద  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:

బుజ్జమ్మను స్కూల్‌కు రెడీ చేస్తుంది మిస్సమ్మ.  రెడీ చేస్తూనే స్కూల్‌ లో హెవీ గేమ్స్‌ ఏమీ ఆడోద్దు బుజ్జమ్మ అని చెప్తుంది. నీకు తగినట్టుగా చిన్న చిన్న గేమ్స్‌ ఆడు సరేనా అని చెప్పగానే.. బుజ్జమ్మ సరే కానీ నువ్వు స్కూల్‌ కు వచ్చి గేమ్స్‌ సెలెక్ట్‌ చేయోచ్చు కదా అని అడగ్గానే.. ఇంకోసారి ఎప్పుడైనా వస్తాను అని మిస్సమ్మ చెప్పగానే.. ఈ రోజు బాగుటుంది అమ్మా.. నేను గేమ్స్‌ ఆడుతున్నప్పుడు నన్ను ఎవరు ఎంకరేజ్‌ చేస్తారు. నాకు ఎవరు చప్పట్లు కొడతారు అని బుజ్జమ్మ అడగ్గానే.. రాజు నేను కొడతాను అమ్మా అని చెప్తాడు. దీంతో బుజ్జమ్మ మీరు కొడతారు హ్యాపీయే తాతయ్యా.. అమ్మ కొడితే ఇంకా హ్యాపీ కదా తాతయ్య అనగానే.. మిస్సమ్మ మనసులో నాకు రావాలనే ఉంది బుజ్జమ్మ. కానీ ఆయన ఈ రోజు స్కూల్‌కు వస్తారు. ఇంకొన్నాళ్లు ఆయనకు నేను ఎదురుపడకూడదు అని అనుకుంటుంది.

మరోవైపు అంజు, మనోహరి, అమర్‌, రాథోడ్‌ కారులో స్కూల్‌కు వెళ్తుంటారు. అంజు హ్యాపీగా ఉంటుంది. దీంతో రాథోడ్‌ వెటకారంగా అంజు పాప నువ్వు ఎప్పుడు స్కూల్‌కు వెళ్లాలన్నా ఫేస్‌ అదోలా పెట్టుకుంటావు. ఈ రోజు మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నావేంటి..? గేమ్స్‌ అనా..? అనగానే.. అంజు కోపంగా నువ్వు మళ్లీ స్టార్ట్‌ చేయకు రాథోడ్‌.. అంటుంది. దీంతో రాథోడ్‌ గేమ్స్‌లో నువ్వు ఓడిపోతే ఎక్కిరిస్తారని అమ్ము, ఆకాష్‌, ఆనంద్‌ను స్కూల్‌కు రాకుండా కట్‌ చేశావు. ఇప్పుడు నిన్ను ఎవరు ఎంకరేజ్‌ చేస్తారు అని అడగ్గానే.. డాడీ ఉన్నారు.. నువ్వు ఉన్నావు ఇంకా మనోహరి ఆంటీ కూడా ఉంది. మీరు చాలు నాకు అంటుంది అంజు. అయితే ఇంకెవరు వద్దా..? అని రాథోడ్‌ అడగ్గానే.. బుజ్జమ్మ కూడా కావాలి డాడ్‌ ఆశ్రమానికి వెళ్లి మనతో పాటు బుజ్జమ్మను తీసుకెళ్దామా..? అని అంజు అడగ్గానే..

Advertisement

మనోహరి షాక్‌ అవుతుంది. ఎందుకు అంజు రాజు గారు ఆ పాపను తీసుకొస్తారు కదా అని చెప్పగానే.. లేదు ఆంటీ నిన్న బుజ్జమ్మ నా కోసం మన ఇంటికి వచ్చింది. ఈ రోజు మనం ఆశ్రమానికి వెళ్దాం.. బుజ్జమ్మ హ్యాపీగా ఫీలవుతుంది కదా..? అనగానే.. రాథోడ్‌ మంచి ఐడియా అంజు పాప అంటాడు. దీంతో మనోహరి ఇరిటేటింగ్‌ గా ఏంటి మంచి ఐడియా రాథోడ్‌.. అయినా ఈ పాటికి రాజు గారు ఆ పాపను తీసుకుని స్కూల్ కు వెళ్లిపోయి ఉంటారు. మళ్లీ మనం ఆశ్రమానికి వెళ్లడం టైం వేస్ట్‌.. అని చెప్పగానే.. అంజు ఏం కాదు బుజ్జమ్మ అంత ఎర్లీగా ఏం వెళ్లదు.. డాడ్‌ మనం ఆశ్రమం దగ్గరకు వెళ్దాం.. అని అడగ్గానే.. అమర్‌ ఓకే.. రాజు గారికి ఫోన్‌ చేసి కనుక్కుంటాను వాళ్లు ఇంకా ఆశ్రమంలోనే ఉంటే వెళ్దాం.. అని చెప్తాడు.

మరోవైపు మిస్సమ్మ బుజ్జమ్మ బ్యాగ్ సర్ది ఇదిగో బుజ్జమ్మ ఇందులో నీ స్నాక్స్‌, డ్రింక్స్‌, వాటర్‌ బాటిల్‌ అన్ని పెట్టాను జాగ్రత్తగా టైంకు అన్ని తీసుకో అని చెప్తుంది. ఇంతలో రాజుకు అమర్‌ ఫోన్‌ చేస్తాడు. దీంతో రాజు అమ్మా అమరేంద్ర సార్‌ ఫోన్‌ చేస్తున్నాడు. అని చెప్పగానే.. బుజ్జమ్మ ఎవరు తాతయ్యా అని అడుగుతుంది. దీంతో అంజు అక్క వాళ్ల డాడీ అమ్మా అని చెప్పగానే.. మిస్సమ్మ మాత్రం స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడండి అని చెప్తుంది. స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడతాడు రాజు. హలో సార్‌ గుడ్‌ మార్నింగ్‌ అని చెప్పగానే.. గుడ్‌ మార్నింగ్‌ రాజు గారు ఎక్కడ ఉన్నారు అని అడుగుతాడు. దీంతో ఆశ్రమంలో ఉన్నాను సార్‌ అని చెప్పగానే.. బుజ్జమ్మ స్కూల్‌కు వెళ్లిందా..? అని అడగ్గానే.. ఇంకా లేదు సార్‌ రెడీ అవుతుంది అని రాజు చెప్తాడు. ఒకసారి ఫోన్‌ బుజ్జమ్మకు ఇవ్వండి అని చెప్పగానే.. ఓకే సార్‌ అమ్మా సార్‌ నీతో మాట్లాడతాడంట అని రాజు ఫోన్‌ బుజ్జమ్మకు ఇవ్వగానే..

Advertisement

అమర్‌ హలో బుజ్జమ్మ స్కూల్‌కు రెడీ అవుతున్నావా..? అని అడగ్గానే.. అవునండి అని చెప్తుంది బుజ్జమ్మ దీంతో అమర్ బుజ్జమ్మ ఒక్క ఫైవ్‌ మినిట్స్‌ వెయిట్‌ చేయ్‌ నిన్ను పికప్‌ చేసుకుని వెళ్తాం అని చెప్పగానే.. అయ్యో ఎందుకండి నేను తాతయ్యతో వస్తాను కదా..? అంటుంది. దీంతో అమర్‌ పర్వాలేదు బుజ్జమ్మ నేను మీ నాన్న లాంటి వాణ్ని నిన్ను తీసుకెళితే నాకు హ్యాపీ అని చెప్పగానే.. మిస్సమ్మ బాధగా మనసులో నాన్న లాంటి వారు కాదండి.. మీరే బుజ్జమ్మకు నాన్న. అనుకుంటుంది. బుజ్జమ్మ మాత్రం థాంక్యూ సోమచ్‌ అండి మీకోసం వెయిట్‌ చేస్తూ ఉంటాను బాయ్‌ అంటూ కాల్ కట్ చేసి బుజ్జమ్మ హ్యాపీగా ఎగిరి గంతేస్తూ.. నాకోసం ఆయన వస్తున్నారు.. ఆయన కోసం ఏదైనా చేయాలి అంటూ లోపలికి వెళ్తుంది. బుజ్జమ్మ వెళ్లగానే.. రాజు చూశావా అమ్మా రక్తసంబంధం అంటే అదే.. ఈ కూతురు కోసం తెలియకుండానే ఆ తండ్రి వస్తున్నాడు. దేవుడు ఉన్నాడమ్మా..? అంటాడు. ఏమో బాబాయ్‌ నేను ఆనంద పడాలో బాధ పడాలో నాకేం అర్థం కావడం లేదు. కానీ నేను మాత్ర ఆయన కంట పడకూడదు. ఆయన వచ్చాక మీరే అంతా మేనేజ్‌ చేయాలి అని చెప్తుంది మిస్సమ్మ. అలాగేనమ్మా అంటాడు రాజు..

తర్వాత అందరూ స్కూల్‌కు వెళ్లిపోతారు. అక్కడ పిల్లలతో పాటు రన్నింగ్‌ కాంపిటీషన్‌లో పాల్గొంటుంది బుజ్జమ్మ. అక్కడే ఉన్న చంభా మంత్రం చదివి గద్దను రప్పస్తుంది. ఆ గద్ద బుజ్జమ్మ మీదకు వెళ్తుంటే చూసిన అమర్‌ అడ్డుగా వెళ్తాడు. ఆ గద్దను అమర్‌ను రక్కేసి బుజ్జమ్మను పట్టుకుని వెళ్తుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×