E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ ఫోటో బుజ్జమ్మకు ఇచ్చిన అమర్‌  

Nindu Noorella Saavasam Serial Today January 27th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మ ఫోటో బుజ్జమ్మకు ఇచ్చిన అమర్‌  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

బుజ్జమ్మను స్కూల్ కు రెడీ చేస్తుంటుంది మిస్సమ్మ. పక్కనే ఉండి చూస్తుంటుంది కరుణ. ఇరిటేటింగ్‌గా వస్తున్న కోపాన్ని అపుకుంటూ అబ్బబ్బా జల్దీ రెడీ చేయవే..ఇంకా ఎంత సేపు చేస్తావు అంటుంది.  దీంతో బుజ్జమ్మ స్కూల్ కు ఇంకా టైం ఉంది కదా అంటీ అమ్మను ఎందుకు తొందరపెడతావు అంటుంది. బుజ్జమ్మ మాటలకు నువ్వు గిప్పుడు తయారైనక్క స్కూల్ కు పోతలేవు.. ఫస్ట్‌ నీ ఫ్రెండ్‌ గదే గా అంజు వాళ్ల ఇంటికి పోతావు అని చెప్తుంది కరుణ దీంతో బుజ్జమ్మ ఆశ్చర్యంగా అవునా అమ్మా ఎందుకు అని అడుగుతుంది. ఆ తర్వాత అటు నుంచి అటే స్కూల్‌కు పోతావు అంటుంది కరుణ. ఓహో నిన్ను అంజు అక్క ఇక్కడికి వచ్చి నన్ను పికప్‌ చేసకుని స్కూల్‌కు తీసుకెళ్లిందని ఈరోజు నేను అక్కడికి వెళ్లి అక్కను నేను పికప్‌ చేసుకోవాలా..? అంటుంది బుజ్జమ్మ.

ఈ రోజే కాదు ప్రతిదినం పొద్దుగాలే కొంచెం సేపు ఈవెనింగ్‌ కొంచెం సేపు ఆ ఇంట్ల స్పెండ్‌ చేసి  రావాలె అని కరుణ చెప్పగానే.. బుజ్జమ్మ ఎందుకమ్మా ఆంటీ ఇలా చెప్తుంది అని అడగ్గానే.. నీకు వాళ్లంటే ఇష్టం కద బుజ్జమ్మ అందుకే నిన్ను వాళ్ల ఇంటికి పంపించాలి అనుకుంటున్నాను అని మిస్సమ్మ చెప్తుంది. కానీ అమ్మా నీకు ఆ ఇల్లన్నా..? ఆ మనుషులన్నా ఇష్టం ఉండదని తాతయ్య చెప్పారు అని బుజ్జమ్మ అడుగుతుండగానే వెనక నుంచి రాజు వచ్చి అమ్మా బుజ్జమ్మా.. నేను ఊరికే అన్నాను తల్లీ ఇప్పుడు అమ్మే నిన్ను ఆ ఇంటికి తీసుకెళ్లమంటుంది కదా..? ఇంక ఏ సమస్య లేదు నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పగానే.. బుజ్జమ్మ థాంక్యూ అమ్మా అని బుజ్జమ్మ, మిస్సమ్మను హగ్‌ చేసుకుంటుంది. దీంతో మిస్సమ్మ ఎందుకు బుజ్జమ్మ థాంక్స్‌.. అని అడగ్గానే.. బుజ్జమ్మ నాకు ఇష్టమైన ఇంటికి పంపిస్తున్నందుకు.. అక్కలతో అన్నలతో ఆడుకుంటున్నందుకు అని చెప్తుంది.  ఇప్పుడు మీ అమ్మ నిన్ను ఆడుకోనికే పంపిస్తలేదు పాప.. ఆ మనోహరితో మీ అమ్మ ఆడుకోనికే పంపిస్తుంది అని మనసులో అనుకుంటుంది కరుణ . బాబాయి గారు బుజ్జమ్మను జాగ్రత్తగా తీసుకెళ్లండి అని మిస్సమ్మ చెప్పగానే.. రాజు అలాగేనమ్మా.. రా బుజ్జమ్మ అంటూ బుజ్జమ్మను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

Advertisement

వాళ్లు వెళ్లిపోయాక కరుణ మొత్తానికి నీలో ఉన్న భయాన్ని బొందల పెట్టి ధైర్యాన్ని బయటకు తీసుకొచ్చనవే..బుజ్జమ్మను ధైర్యంగా ఆ ఇంటికి పంపించినవు.. అంటుంది. దీంతో మిస్సమ్మ కోపంగా ఆ మనోహరి స్కెచ్‌ ఏంటో తెలుసుకోవాలి కదా కరుణ అలాగే బుజ్జమ్మ ఆ ఇంట్లో ఉంటే అమ్ముకు అపాయం అన్నదాంట్లో నిజం ఎంతో తెలుస్తుంది కదా..? అనగానే.. కరుణ కోపంగా అది నిజం కాదు పక్కా అబద్దం. మనోహరి ఆడుతున్న గేమ్‌ ఇది అనగానే.. అందుకే నేను ఇప్పుడు ఈ రివర్స్‌ గేమ్‌ ఆడుతున్నాను అని మిస్సమ్మ చెప్పగానే.. ఈ ఆట ఏదో ఐదేండ్ల కిందట ఆడి ఉంటే ఇలా దూరం అయ్యే వాళ్లు కాదు కదా.. అంటుంది కరుణ.

దీంతో మిస్సమ్మ అప్పుడు అలా ఆలోచించలేకపోయాను. పైగా అమ్ముకు రెండు సార్లు ప్రమాదం జరిగే సరికి నాకు భయం వేసింది అని చెప్పగానే.. ఈ భయం వల్లే ఆ ఐదు సంవత్సరాలు నష్టపోయావు నీ భర్తకు పిల్లలకు దూరం అయినవ్‌.. నీ బిడ్డను ఆ తండ్రికి దూరం చేసినవ్‌.. ఇప్పుడు మీ ఆయన నీ మీద గుస్స అవుతున్నడు అని చెప్పగానే.. మిస్సమ్మ కోపంగా నేను కోల్పోయి నష్టపోయిన దానికి మనోహరి మీద రెట్టింపు ప్రతికారం తీర్చుకుంటాను. ఇదంతా దాని ప్లాన్‌ అని ఫ్రూవ్‌ అవ్వాలి. దాన్ని ఊరికే వదిలిపెట్టను.. అనగానే.. బరాబర్‌ ఫ్రూవ్‌ అవుతుంది చూడు నువ్వే.. మల్లా తిరిగి వచ్చిన నిన్ను వదిలించుకోవడానికి భయపెట్టడానికి ఆ మనోహరి ఈ పాటికే  ఏదో ఒక ప్లాన్‌ షురూ చేసే ఉంటుంది. అని కరుణ చెప్పగానే.. మిస్సమ్మ ఆలోచిస్తుంది.

Advertisement

మరోవైపు అమర్‌ ఇంటికి వెళ్లిన బుజ్జమ్మ అమర్‌ బెడ్‌ రూంలోకి వెళ్లి తన చిన్నప్పటి ఫోటో అమర్‌కూ చూపిస్తూ ఈ ఫోటో ఎవరిది అండి అని అడుగుతుంది. అది నా చిన్న కూతురు ఫోటో అని అమర్‌ చెప్పగానే.. అవును ఈ ఇంట్లో మిస్సమ్మ అని ఒకళ్లు ఉండేవాళ్లంట కదా ఆవిడ ఎక్కడున్నారు..అని అడగ్గానే… అమర్‌ సైలెంట్‌ అయిపోతాడు. ఏమీ చెప్పడు దీంతో బుజ్జమ్మ ఫ్లీజ్‌ అండి నాకు తన గురించి తెలియాలి. నేను తనను చూడాలి ఫ్లీజ్‌ అంటూ బతిమాలుతుంటే.. అమర్‌ ఆరును గుర్తు చేసుకుంటాడు. ఇంతలో బుజ్జమ్మ కూడా ఫ్లీజ్‌ అరుంధతిని అడుగుతున్నాను.. చూపించండి ఫ్లీజ్‌ అని బతిమాలేసరికి అమర్‌ కప్‌బోర్డులో ఉన్న మిస్సమ్మ ఫోటో తీసి బుజ్జమ్మకు ఇవ్వబోతుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×