E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్, మిస్సమ్మల మధ్య రొమాన్స్

Nindu Noorella Saavasam Serial Today January 26th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్, మిస్సమ్మల మధ్య రొమాన్స్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

రూంలోకి వెళ్లిన అమర్‌ తన కప్‌బోర్డులో ఉన్న మిస్సమ్మ ఫోటో తీసి చూసి ఎమోషనల్‌ అవుతుంటాడు. మిస్సమ్మతో గడిపిన క్షణాలు గుర్తు చేసుకుంటుంటాడు. మిస్సమ్మ తన కోసం స్పెషల్‌ గా చేసిన వంటకాలను గుర్తు చేసుకుంటాడు. మిస్సమ్మ సేమియా పాయసం చేసి అమర్‌ను పిలుస్తుంది. ఏవండి మీకోసం అని జీడిపప్పు కిస్‌మిస్‌ వేసి సేమియా పాయసం చేశాను. తిని టేస్ట్‌ ఎలా ఉందో చెప్పండి అంటూ పాయసం అమర్‌కు తినిపిస్తుంది. తిన్న తర్వాత అమర్‌ అదో రకంగా చూస్తుంటే.. మిస్సమ్మ భయంగా ఏమైందండి అలా చూస్తున్నారు పాయసం బాగాలేదా..? అని అడుగుతుంది. అమర్‌ చాలా బాగుంది అని చెప్తాడు.

Advertisement

దీంతో మిస్సమ్మ నిజంగా బాగుందా అని అడుగుతుంది. అమర్‌ అమృతంలా ఉంది  అని చెప్పగానే.. మిస్సమ్మ చాలా హ్యాపీగా అంత నచ్చిందా..? అని అడుగుతుంది. దీంతో అమర్‌  ఇంతకన్నా నేను చెప్పలేను అంటాడు. దీంతో మిస్సమ్మ, అమర్‌ను రొమాంటిక్‌గా చూస్తూ.. మరి నేను నచ్చానా..? పాయసం నచ్చిందా..? అడగ్గానే.. అమర్‌ అదేం ప్రశ్న పాయసానికి నీకు పోలికేంటి..? అని అడుగుతాడు. దీంతో మిస్సమ్మ పాయసం స్వీటు.. నేను స్వీటు.. మాలో ఎవరు ఎక్కువ మీరు చెప్పండి అని అడుగుతుంది. దీంతో అమర్‌ నిజం చెప్పాలంటే.. అంటుంటే.. మిస్సమ్మ నిజమే చెప్పాలి అంటుంది. అమర్‌ ఓకే నీకంటే పాయసమే స్వీటుగా ఉంది అంటాడు. దీంతో మిస్సమ్మ అలుగుతూ.. నా కంటే నా పాయసమే నచ్చిందా నీకు పోండి.. నేను అలిగాను బుంగమూతి పెట్టుకున్నాను.. పోండి అనగానే..

అమర్‌ రొమాంటిక్‌గా మిస్సమ్మను దగ్గరకు తీసుకుని అలిగితే నువ్వు చాలా బాగుంటావు తెలుసా..? అంటాడు. దీంతో మిస్సమ్మ నాకేం మీ పొగడ్తలు అక్కరలేదు అంటుంది. దీంతో అమర్‌ నిజంగా అలిగినప్పుడు నువ్వు ఈ పాయసం కంటే బాగుంటావు అంటాడు. మిస్సమ్మ మాత్రం మీరేగా నాకన్నా నా పాయసం నచ్చింది అన్నారు.. అంటుంది. దీంతో అమర్‌ పాయసంలో తీసి మాత్రమే ఉంటుంది భాగీ కానీ నాకోసం నువ్వు పడే తపనలో ఆ తీపిని మించిన ప్రేమ ఉంటుంది. నాకు అన్నింటికన్నా ఆ ప్రేమే ఎక్కువ.. అని చెప్పగానే.. మిస్సమ్మ ఎమోషనల్‌ అవుతూ ఎందుకండి మీకు ప్రేమంటే ఎక్కువ.. అని అడుగుతుంది. దీంతో అమర్‌ ఎందుకంటే ఒకసారి మిస్‌ అయిన ప్రేమ మళ్లీ దక్కడు అంటారు. కానీ నా విషయంలో నేను ఒకసారి కోల్పోయిన  ప్రేమ రెండో సారి నీ రూపంలో నాకు దక్కింది.. అని చెప్పగానే.. మిస్సమ్మ ఈ ప్రేమను మీరు ఎప్పటికీ కోల్పోవడానికి లేదు నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటాను మీ పక్కనే ఉంటాను అంటూ అమర్‌ను హగ్‌ చేసుకుని కిస్‌ చేసిన విషయం గుర్తు చేసుకుంటాడు అమర్‌… మిస్సమ్మ ఫోటో చూస్తూనే ఎమోషనల్‌ అవుతుంటాడు.

Advertisement

మరోవైపు మేడ మీదకు వెళ్లిన అమ్మును కిందకు తోసేసి చంపేయాలనుకుంటున్న మనోహరికి షాక్‌ తగులుతుంది. అమర్‌ పైకి వస్తూ.. అమ్మును పిలుస్తాడు. అమ్ము ఏంటి డాడ్‌ అనుకుంటూ అక్కడి నుంచి కిందకు వెళ్తుంది. వెనకే తోసేయడానికి వెళ్లిన మనోహరి కిందపడబోతుంది. ఇంతలో అమర్‌ వచ్చి మనోహరి చేయి పట్టుకుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×