E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 22nd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు మళ్లీ తిరిగి వస్తుందన్న మిస్సమ్మ – మరి నీ పరిస్థితి ఏంటని అడిగిన ఆత్మ  

Nindu Noorella Saavasam Serial Today January 22nd : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆరు మళ్లీ తిరిగి వస్తుందన్న మిస్సమ్మ – మరి నీ పరిస్థితి ఏంటని అడిగిన ఆత్మ  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  పొద్దటి నుంచి గుప్త కనిపించడం లేదేంటని ఆరు పిలుస్తుంది. గార్డెన్‌లో అటూ ఇటూ తిరుగుతుంది. అసలు ఆ సాధువు ఎవరు నా ఆస్థికలు కలపొద్దు అని ఎందుకు చెప్పారు అని ఆలోచిస్తుంది. గుప్త గారు మీరు ఇక్కడే ఎక్కడో దాక్కున్నారని నాకు తెలస్తుంది అనుకుంటూ గార్డెన్‌ లో అటూ ఇటూ తిరుగుతుంటే బయట లైట్‌ ఆఫ్‌ చేయడానికి వచ్చిన మిస్సమ్మ..గార్డెన్‌ లో తిరుగుతున్న ఆరును చూస్తుంది. వచ్చి అక్క ఇక్కడి ఏం వెతుకుతున్నారు అని అడుగుతుంది.

దీంతో రింగు పోయిందని అదే వెతుకుతున్నానని  చెప్తుంది ఆరు. అయితే ఇంట్లోకి వెళ్లి లైట్ తీసుకొస్తాను ఉండు అక్కా ఇద్దరం కలిసి వెతుకుదాం అంటుంది మిస్సమ్మ..ఏమీ వద్దులే మిస్సమ్మ అది గోల్డ్‌ రింగేం కాదు.. ఉదయం వెతుక్కుంటాను అని ఆరు చెప్తూ ఇంట్లో అందరూ పడుకున్నట్టు ఉన్నారు అంటుంది. లేదక్కా పడుకున్నా పడుకోనట్టే అని మిస్సమ్మ చెప్తుంది. ఎందుకు ఏమైందని ఆరు అడగ్గానే.. అక్క ఆస్థికలు నదిలో కలపలేదన్న బాధో.. అక్క ఇంటి చుట్టూ తిరుగుతుందనే సంతోషమే తెలియడం లేదక్కా అంటుంది మిస్సమ్మ. మరి నువ్వేం అనుకుంటున్నావు అని ఆరు అడిగితే నాకెందుకో ఆరు అక్కా మళ్లీ ఈ ఇంట్లోకి ఏదో ఒక రూపంలో వస్తుందనిపిస్తుంది. అని మిస్సమ్మ చెప్పగానే..నువ్వు ఊరుకో మిస్సమ్మ చనిపోయిన వాళ్లు మళ్లీ ఎలా తిరిగి వస్తారు అంటూ ప్రశ్నిస్తుంది ఆరు.

Advertisement

లేదక్కా సాక్ష్యాత్తు ఆ దేవుడే వచ్చి అక్క ఆస్థికలు కలపకుండా చేయడం..అక్క ఆత్మ ఇక్కడే తిరగడం.. ఆ అవకాశం ఉంటే అక్కా మళ్లీ తిరిగి రావాలని ఆ దేవుడిని కోరుకుంటాను.. అంటుంది మిస్సమ్మ.. దీంతో ఆరు కోపంగా ఏం మాట్లాడుతున్నావు మిస్సమ్మ.. మరి ఆరు  తిరిగి వస్తే నీ పరిస్థితి ఏంటి అని అడుగుతుంది. ఇది ఆరు అక్కా కుటుంబం.. ఆవిడ తిరిగి వస్తే నేను వెళ్లిపోతాను అంటూ ఏడుస్తుంది మిస్సమ్మ.   నువ్వు అలా మాట్లాడకు మిస్సమ్మ.. ఆయన పక్కన ఉండు అధికారం ఎవరికైనా ఉందంటే.. అది నీకే.. ఈ ఇంట్లో  నీ స్థానం.. ఆయన జీవితంలో నీ స్ధానాన్ని కానీ ఎవ్వరూ మార్చకూడదు. నువ్వు సంతోషంగా ఉండాలి మిస్సమ్మ అంటూ ఆరు ఏడుస్తుంది.

పొద్దున్నే అలారం మోగగానే..పిలలందరూ ఉలిక్కిపడి నిద్ర లేస్తారు. వెంటనే అమర్‌ వచ్చి అల్లారం ఆఫ్ చేస్తాడు. ఇంత పొద్దున్నే ఎవర్రా అల్లారం పెట్టింది ఎవర్రా అంటూ అరుస్తుంది అంజు.. అమర్ కనిపించగానే..షాకింగ్‌ గా చూస్తూ.. గుడ్‌ మార్నింగ్ డాడ్‌.. అదే పొద్దున్నే ఎలా లేవాలో చెప్తున్నాను అంటుంది అంజు.. దీంతో అమర్‌ కోపంగా అంటే అల్లారం మోగకపోతే మీరు సిక్స్‌కు లేవలేరా..? మీ డిసిప్లీన్‌ ఏమైంది అంటాడు. ఇంతగాప్‌ వచ్చింది కదా..? అందుకే గురకపెట్టి నిద్ర పోతున్నాం.. అంటుంది అంజు దీంతో రేపట్నించు ఇలా సిక్స్‌ కు లేవడం కాదు..సిక్స్‌ వరకే లేచి రెడీ అయి కిందకు రావాలి అంటాడు అమర్‌.పిల్లలందరూ షాక్‌ అవుతారు.

Advertisement

తర్వాత గార్డెన్‌ లోకి వెళ్లిన అమర్‌..విజిల్‌ వేస్తాడు. ఇంట్లో అందరూ షాక్‌ అవుతారు. కిచెన్‌ లో ఉన్న మిస్సమ్మ కుక్కర్‌ చూస్తూ.. పప్పు ఉడకకుండాలనే విజిల్‌ వేస్తుందేంటి..? అని కన్పీజ్‌ అవుతుంది. పూజ చేస్తున్న నిర్మల ఏంటండి పొద్దున్నే విజిల్ వేస్తున్నారేంటి అని అడుగుతుంది. ఆ నేనే టైం పాస్‌ కు విజిల్‌ వేశాను అంటాడు శివరాం.. ఆ విజిల్ సౌండ్‌ బయటి నుంచి వచ్చింది అంకుల్‌ అని చెప్తుంది. ఇంతలో పిల్లలు రెడీ గార్డెన్‌ లోకి వెళ్తారు. టూ మినిట్స్ టైం ఇస్తే మీరు ఫైవ్‌ మినిట్స్‌ తీసుకున్నారు అంటాడు అమర్. వీడేంటే మళ్లీ ట్రైనింగ్‌ క్యాంపు మొదలు పెట్టాడు అంటాడు శివరాం.. ఏమోనండి నాకేం తెలుసు అంటుంది నిర్మల. ఇంతలో మిస్సమ్మ వచ్చి మామయ్యా పొద్దున్నేనిద్ర లేపి ఈ ఎక్సర్‌ సైజు లేంటి చాదస్తం కాకపోతే అంటుంది మిస్సమ్మ.. ఏమోనమ్మా అంటాడు శివరాం. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×