E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలకు వంట చేసి పంపించిన మిస్సమ్మ

Nindu Noorella Saavasam Serial Today January 22nd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పిల్లలకు వంట చేసి పంపించిన మిస్సమ్మ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:

అమర్‌ ఇంటి గేటు ముందు నిలబడి లోపల జరుగుతున్నది వీడియో కాల్‌ లో చూస్తుంటుంది మిస్సమ్మ. ఇంతలో అమర్‌ కారులో వస్తాడు. లోపలికి వెళ్లాక కారు దిగి బయటకు గేటు దగ్గరకు వస్తాడు. ముసుగులో ఉన్న భాగీ అమర్‌ను గమనించి మనసులో భయపడుతుంది. నన్ను గుర్తు పట్టారా ఏంటి ఆయన అనుకుంటుంది. ఇంతలో అమర్‌ దగ్గరకు వచ్చి ఎక్స్‌క్యూజ్‌మీ ఎవరు మీరు మా ఇంటి ముందు ఏం చేస్తున్నారు. ఇటు తిరగండి అనగానే.. మిస్సమ్మ తిరిగి అమర్‌ను చూస్తుంది. అడుగుతుంది మిమ్మల్నే ఎందుకు ఇక్కడ నిల్చున్నారు. ఏ పని మీద వచ్చారు..? అనగానే మిస్సమ్మ ఏడుస్తూ మౌనంగా ఉండిపోతుంది.

దీంతో అమర్‌ కొంచెం కోపంగా అడుగుతుంది మిమ్మల్నే ఎవరి కోసం వచ్చారు. మీ మీద నాకు డౌటుగా ఉంది. హలో నేను ఆర్మీ ఆఫీసర్‌ను నా ఇంటి ముందు మీరు అనుమానంగా నిలబడ్డారు. నాకు మీరెవరో తెలియాలి. మీ ఐడీ కార్డు చూపించండి హలో ఐడీ కార్డు చూపించమంటే ఏంటి ఆలోచిస్తున్నారు. మీకు మాటలు వచ్చా..? రావా..? మీకు తెలుగు అర్థం అవుతుందా..? మీ ఐడీ కార్డు చూపించకపోతే పోలీసులను పిలవాల్సి ఉంటుంది అని అమర్‌ మాట్లాడుతుంటే.. ఇంతలో రాథోడ్‌ లోపల సీసీటీవీ పుటేజీ చెక్‌ చేస్తూ.. అమర్‌కు ఫోన్‌ చేస్తాడు. సార్‌ కరుణ మన ఇంటికి వచ్చింది. తను కరుణ ఫ్రెండ్‌ ఫాతిమా అంట సార్‌ నాకు ఇప్పుడే చెప్పింది తను అనగానే.. కరుణ ఇంట్లోనే ఉందా..? అని అమర్‌ అడగ్గానే.. ఉంది సార్‌.. మనోహరి గారితో మాట్లాడుతుంది అని రాథోడ్‌ చెప్పగానే.. ఓకే నేను వస్తున్నాను.. అని కాల్‌ కట్‌ చేసి మీరు కరుణ ఫ్రెండా..? కరుణతో పాటు వచ్చారా..? నోరు తెరచి ఆ మాట చెప్పొచ్చు కదా..? అయినా కరుణతో పాటు వచ్చి బయట ఎందుకు ఉన్నారు..? లోపలికి రండి అని అమర్‌ పిలవగానే.. రానన్నట్టుగా మిస్సమ్మ సైగ చేస్తుంది.

Advertisement

దీంతో అమర్‌ సైగలు చేస్తున్నారేంటి..? మాటలు రావా..? మీరు కరుణ ఫ్రెండే కదా..? ఒకే నాకు అర్థం అయింది. అయితే ఇంట్లోకి మీరు రారా..? ఇక్కడే ఉంటారా..? సరే నేను వెళ్లి కరుణను పంపిస్తాను అంటూ అమర్‌ వెళ్లిపోతుంటే.. మిస్సమ్మ బాధగా నన్ను క్షమించండి బుజ్జమ్మ జాతకం గురించి నిజం తెలిసే వరకు నేను మీ ముందు బయట పడదలచుకోలేదు. మిమ్మల్ని బాధపెడతున్నానని తెలుసు కానీ తప్పక ఈ తప్పు చేస్తున్నాను.. ఐయామ్‌ సారీ.. నోరారా బాగీ అని పిలిచే మీ పిలుపునకు ఐదేళ్లు దూరం అయ్యాను. ఇప్పుడు నోరు తెరచి మిమ్మల్ని  పిలవలేక మీతో మాట్లాడలేకపోతున్నాను అనుకుంటూ మనసులో బాధపడుతుంటే కొంచెం దూరం వెళ్లిన అమర్‌ తిరిగి మీరు నన్ను ఏమైనా పిలిచారా..? పిలిచినట్టు అనిపించింది అనగానే.. లేదు అన్నట్టు మిస్సమ్మ తలూపుతుంది. సరే అంటూ అమర్‌ వెళ్లిపోతుంటాడు. మిస్సమ్మ బాధపడుతూ మనిషిగా మీకు దూరం అయినా నా మనసు ఎప్పుడూ మీ దగ్గరే ఉంటుంది అండి.. అంటూ బాధపడుతుంది.

ఇక లోపల కరుణతో మాట్లాడుతున్న మనోమరి నిన్ను చూస్తుంటే.. అచ్చం భాగీని చూస్తున్నట్టే ఉంది. నువ్వు అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉండు అని చెప్పగానే.. కరుణ నేనేందుకు డైరెక్టుగా భాగీనే వస్తది అని చెప్పగానే.. మనోహరి షాకింగ్‌ గా భాగీ వస్తుందా..? అని అడుగుతుంది. దీంతో కరుణ ఎందుకు మీరు అంత పరేశాన్‌ అవుతున్నరు. భాగీ గిట్ల ఈడికి రాకూడదనా ఏంటి..? అంటుంది. దీంతో మనోహరి ఎందుకు రాకూడదు.. కానీ తను ఎందుకు వెళ్లిపోయిందో తెలియదు కదా..? అంటుంది. అదేదో జాతకాల కోసం వెళ్లినట్టు అప్పుడెప్పుడో చెప్పినట్టు గుర్తు అని కరుణ అనగానే.. జాతకమా..? అంటూ మనోహరి షాక్‌ అవుతుంది.

Advertisement

ఆ అవును భాగీకి పుట్టిన బిడ్డ వల్ల అమ్ముకు ప్రాణగండం ఉందని ఎవరో పంతులు చెప్పారట అనగానే.. మనోహరి భయంగా ఆ విషయం భాగీ నీతో చెప్పిందా..? అని అడుగుతుంది. అవును చెప్పింది.. మీరెందుకు అంత టెన్షన్‌ అవుతున్నారు అని కరుణ అడగ్గానే.. ఏం లేదు.. కాఫీ తీసుకో.. అంటుంది. నాకు ఇప్పుడే తాగాలని లేదు జర సేపు అయ్యినాక తాగుతా అంటుంది కరుణ. ఇప్పుడే మనోహరి అనుమానంగా ఇందాకటి నుంచి నీ ఫోన్‌ ఏంటి..? నా వైపే చూపిస్తున్నావు అంటూ కరుణ ఫోన్‌ లాక్కుంటుంది మనోహరి.. ఇంతలో మిస్సమ్మ కాల్ కట్‌ చేస్తుంది. అప్పుడే అమర్‌ వచ్చి కరుణను బయట ఫ్రెండ్‌ వెయిట్‌ చేస్తుంది అని చెప్తాడు.

తర్వాత అంజు, బుజ్జమ్మకు ఫోన్‌ చేసి మీ అమ్మ చేత మాకు వంట చేసి పంపిస్తావా అని అడుగుతుంది. మిస్సమ్మ సరే అని చెప్పగానే బుజ్జమ్మ సరే అని అంజుకు చెప్తుంది. మిస్సమ్మ వంట చేయగానే.. రాజు తీసుకెళ్లి అమర్‌ ఇంట్లో ఇస్తాడు. అందరూ ఆ వంటలు తిని మిస్సమ్మ చేసినట్టే ఉన్నాయని అనుకుంటారు. అమర్‌ కూడా రుచి చూసి మిస్సమ్మ వంటలు గుర్తు చేసుకుంటాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×