E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 16th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం తెలుసుకున్న అమర్‌ – అంజును వెంబడించిన ఘోర

Nindu Noorella Saavasam Serial Today January 16th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: నిజం తెలుసుకున్న అమర్‌ – అంజును వెంబడించిన ఘోర
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  మిస్సమ్మ, అమర్‌కు ఫోన్‌ చేసి అంజు రామ్మూర్తి దగ్గర ఉందని ఇద్దరు కలిసి శివాలయం పక్కవీధిలో ఉన్న బట్టల షాపులో శారీ కొంటున్నారట అని చెప్తుంది. మీరు ఇంటకి రండి నాన్న అంజును తీసుకుని వస్తారు అని మిస్సమ్మ చెప్పగానే.. వద్దులే నేనే అక్కడికి వెళ్లి వాళ్లను తీసుకుని వస్తాను అంటాడు అమర్‌. ఫోన్‌ కట్‌ చేసిన తర్వాత అమర్‌ ఆలోచిస్తుంటే.. ఇంకా ఏం ఆలోచిస్తున్నారు సార్‌ అని రాథోడ్‌ అడుగుతాడు. ఏం లేదు రాథోడ్ అక్కడ ఉన్నది అంజుయేనా అని అనుమానం వస్తుంది అంటాడు.

అలా అంటారేంటి సార్‌ అని రాథోడ్‌ అడగ్గానే.. ఉదయం మిస్సమ్మ ఒక మాట చెప్పింది ఆరుకు మనుషుల్లో ప్రవేశించి శక్తి వచ్చిందేమో అని.. అ మాట ప్రకారం చూసుకుంటే ఆరు, అంజులో ప్రవేశించిందేమో అంటాడు అమర్‌. అలా ఎలా కుదరుతుంది సార్‌ అని రాథోడ్‌ అడగ్గానే.. అవును రాథోడ్‌ అంజలి.. రామ్మూర్తి గారి ఇంటికి వెళ్లడం ఏంటి..? ఇద్దరూ కలిసి శారీ కొనడం ఏంటి..? అంటాడు అమర్‌. సార్‌ అయితే మనం ఇప్పుడు మేడంతో మాట్లాడొచ్చా సార్‌ అంటాడు రాథోడ్‌. ఏమో రాథోడ్ పాస్ట్‌ గా అక్కడికి వెళ్లు మనం అంజులో ఆరు ఉందే లేదో తెలుసుకుందాం అంటాడు అమర్‌ ఇద్దరు అక్కడికి బయలుదేరుతారు.

Advertisement

షాపులో చీర చూస్తున్న ఆరు ఈ శారీ నాకు ఎలా ఉంది అని అడుగుతుంది. మహాలక్ష్మీలా ఉన్నావు తల్లి అంటాడు రామ్మూర్తి. ఎంతైనా మీ కూతురిని కదా అంటుంది అంజు.  ఆశ్చర్యంగా రామ్మూర్తి నా కూతురా..? అనగానే అదే మిస్సమ్మ మీకు కూతురు కదా..? నేను మిస్సమ్మకు కూతురుని కదా అందుకే అలా అన్నాను అంటుంది. బయట ఘోర ముసుగు వేసుకుని ఆరు కోసం ఎదురుచూస్తుంటాడు. లోపల రామ్మూర్తి నీళ్లు తాగుతుంటే పొలమారుతుంది. ఆరు వెంటనే నెమ్మదిగా నాన్నా అంటుంది.

ఆశ్చర్యంగా రామ్మూర్తి చూడగానే.. అదే తాతయ్యా అంటుంది. ఇంతకీ రేపు కాశీకి వస్తున్నారా..? తాతయ్య అనగానే.. రావాలి కదమ్మా.. పెళ్లి చేసి నా కూతురిని అత్తారింటికి పంపలేకపోయాను.. కనీసం నా బిడ్డ ఆఖరి ప్రయాణంలోనైనా ఒక తండ్రిగా తోడుగా ఉందామనుకుంటున్నాను అని రామ్మూర్తి చెప్పగానే.. కన్నీళ్లతో తల రాతలు తుడిపేసే అవకాశమే ఉంటే ఈ లోకంలో అందరూ ఏడుస్తూనే ఉంటారు. జరిగిన దాన్ని దాటి ముందుకు అడుగువేయాలి కానీ అక్కడే ఉండకూడదు నాన్నా.. అంటూ అదే తాతయ్యా అంటుంది. అయినా చనిపోయింది మా అమ్మ కదా..? ఎవరైనా వింటే మీ కూతురు అనుకుంటారు అంటూ రామ్మూర్తి కన్నీళ్లు తుడుస్తుంది.

Advertisement

తర్వాత బట్టలు తీసుకుని బయటకు వచ్చిన ఆరు ఆ పక్కనే కాచుకుని ఉన్న ఘోరను చూస్తుంది. భయంతో తాతయ్యా మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం అంటూ రామ్మూర్తిని తీసుకుని వెళ్లిపోతారు. ఇంతలో అమర్‌ షాపు వస్తాడు. రామ్మూర్తి , పాప గురించి ఎక్వైరీ చేస్తాడు. వాళ్లిద్దరూ పరిగెత్తడం చూశాను అని ఒక బాయ్‌ చెప్తాడు. అమర్ రామ్మూర్తికి ఫోన్‌ చేస్తాడు. కాల్‌ కనెక్ట్ అవ్వదు. అమర్‌ సీసీటీవీ ఫుటేజ్‌ చూస్తాడు. అంజు బిహేవిర్‌ చూసి రాథోడ్‌ సార్‌ మేడమే అంటాడు.

అందులోనే ఘోర అంజు వాళ్ల వెంట బడటం చూసి అక్కడి నుంచి వస్తారు. మరోవైపు ఘోరాను తప్పించుకుని రామ్మూర్తి, అంజు వెళ్తుంటారు. కొద్ది దూరం వెళ్లాక రామ్మూర్తి ఆయాసం వస్తుందని నేను పరుగెత్తలేనని చెప్తాడు. దీంతో అంజు ఇక నేను ఇంటికి వెళ్తాను తాతయ్యా అంటూ కొద్ది దూరం వెళ్లి మళ్లీ రిటర్న్‌ వచ్చి రామ్మూర్తిని హగ్‌ చేసుకుని ఘోర నుంచి నేను తప్పించుకోకపోతే నేను మిమ్మల్ని చూడటం ఇదే ఆఖరి సారి అవుతుంది నాన్నా అంటూ ఏడుస్తూ వెళ్లిపోతుంది.

మిస్సమ్మ, అమర్‌కు ఫోన్‌ చేస్తుంది. ఘోర అంజలిని ఎత్తుకెళ్లడానికి షాపు దగ్గరకు వచ్చాడు. వాడి నుంచి తప్పించుకోవడానికి అంకుల్‌, అంజలి షాపు నుంచి పారపోయారు. నేను వాళ్లను వెతుక్కుంటే వెళ్తున్నాను అని చెప్తాడు. మిస్సమ్మ షాక్ అవుతుంది. ఇంతలో రామ్మూర్తి అమర్‌కు ఫోన్‌ చేసి తాను ఎక్కడ ఉన్నది చెప్తాడు. ఇంట్లో విషయం తెలిసి పిల్లలు షాక్ అవుతారు. అమర్‌, రాథోడ్‌ దగ్గరకు రాగానే.. అంజు ఇలా వెళ్లింది అని చెప్తాడు.

అందరూ కలిసి అంజు వెళ్లిన వైపు వెళ్తారు. మరోవైపు ఓల్డ్‌ బిల్డింగ్‌లోకి వెళ్లిన అంజలిని బెదిరిస్తూ ఘోర నువ్వు ఇక తప్పించుకోలేవు అంటాడు. అంజుకు ఎదురుగా నిలబడి ఘోర మంత్రాలు చదువుతుంటాడు. ఇంతలో అమర్‌ వస్తాడు. ఘోరను కొడతాడు. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×