E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రోడ్డు మీద మిస్సమ్మను చూసిన అమర్

Nindu Noorella Saavasam Serial Today January 16th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రోడ్డు మీద మిస్సమ్మను చూసిన అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

ఇంటికి వచ్చిన బుజ్జమ్మను చూసిన పిల్లలు హ్యాపీగా ఫీలవుతుంటే.. అమర్‌ మాత్రం ఆశ్చర్యంగా బుజ్జమ్మ నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతాడు. దీంతో అంజు డాడ్‌ బుజ్జమ్మను మనోహరి ఆంటీ తీసుకొచ్చింది అని చెప్తుంది. వెంటనే మనోహరి అంటే అమర్‌ పిల్లలు బుజ్జమ్మను ఇష్టపడుతున్నారు కదా..? నువ్వు కూడా ఈ అరుంధతి అంటే కొంచెం ఇష్టం చూపిస్తున్నావు కదా..? అందుకే తనను ఇంటికి తీసుకొస్తే మీరందరూ హ్యాపీగా ఫీలవుతారని చెప్పగానే.. రాథోడ్‌ అనుమానంగా చూస్తూ.. నీకు అంత మంచి ఉద్దేశం ఉందా మనోహరి. దీని వెనక నీ కుట్రేం లేదు కదా అని మనసులో అనుకుంటాడు. ఇంతలో చంబా సార్‌ మనోహరి మేడం గారు ఎప్పుడూ మీ గురించి పిల్లల గురించే ఆలోచిస్తారు. మీరు సంతోషపడతారు అంటే మేడం గారు ఏదైనా చేస్తారు అని చెప్తుంది.

వెంటనే.. అమర్‌, మనోహరి ఆశ్రమం వాళ్లకు చెప్పే తీసుకొచ్చావా..? అని అడగ్గానే.. చెప్పకుండానే తీసుకొచ్చాము అని అంజు చెప్పగానే.. కొంచెం కోపంగా అమర్‌ ఎందుకు ఇలా చేశావు మనోహరి పాపం వాళ్లు కంగారు పడతారు కదా..? అనగానే.. మనోహరి సారీ అమర్‌ మీరందరూ హ్యాపీగా ఫీలవుతారనే ఆలోచన తప్పా..నాకు వేరే ఆలోచనే రాలేదు.. అంటుంది. ఇంతలో అంజు ఏం పర్వాలేదు డాడ్‌ నా దగ్గర ఆశ్రమం తాతయ్య ఫోన్‌ నెంబర్‌ ఉంది. ఆ తాతయ్యకు ఫోన్‌ చేసి బుజ్జమ్మ మన దగ్గర ఉందని వన్‌ అవర్‌లో ఆశ్రమానికి పంపిద్దామని చెబుదాం అంటుంది. దీంతో రాథోడ్‌ వెంటనే ఆ పని చేయ్‌ అంజు అని చెప్పగానే.. అంజు సరే బుజ్జమ్మ నువ్వు వీళ్లతో మాట్లాడుతూ ఉండు.. నేను ఫోన్‌ చేసి వస్తాను అంటూ లోపలికి వెళ్తుంది అంజు. పిల్లలు బుజ్జమ్మను దగ్గరకు తీసుకుని ఏవేవో మాటలు చెప్తుంటారు. బుజ్జమ్మకు మాత్రం గత జన్మ జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంటాయి.

Advertisement

మరోవైపు ఆశ్రమంలో బుజ్జమ్మ కోసం మిస్సమ్మ ఎదురుచూస్తుంది. ఇంతలో రాజు రాగానే.. బాబాయ్‌ బుజ్జమ్మ వచ్చిందా..? ఎక్కడుంది…? అంటూ అడుగుతుంది. దీంతో రాజు బుజ్జమ్మ రాలేదు అమ్మా అని చెప్పగానే.. రాలేదా… ఎందుకు రాలేదు..  తను ఇంకా స్కూల్‌ లోనే ఉందా..? స్కూల్ టైం అయిపోయింది కదా..? అని మిస్సమ్మ అడగ్గానే..  స్కూల్‌ వదిలారు అమ్మా.. కానీ.. అంటూ ఆగిపోగానే.. కానీ ఏంటి బాబాయ్‌ బుజ్జమ్మ ఎక్కడ..? త్వరగా చెప్పండి అని అడగ్గానే.. రాజు వెంటనే బుజ్జమ్మ వాళ్ల ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లారు అమ్మా అని చెప్పగానే.. మిస్సమ్మ షాక్‌ అవుతుంది. ఏం అంటున్నారు బాబాయ్‌ బుజ్జమ్మ వాళ్ల ఫ్రెండ్‌ ఇంటికి వెళ్లడం ఏంటి..? ఎవరా ఫ్రెండ్‌ అని అడుగుతుంది.

దీంతో రాజు స్కూల్‌ ఫ్రెండేనమ్మా బుజ్జమ్మ క్లాస్‌మేట్‌ బుజ్జమ్మను వాళ్ల ఇంటికి తీసుకెళ్లిందట.. అని చెప్పగానే.. అలా ఎలా తీసుకెళ్లారు బాబాయ్‌ మీరెలా పంపించారు.. అంటూ మిస్సమ్మ భయపడుతుంటే.. కంగారు పడకు అమ్మా..? ఒక గంటలో తిరిగి వస్తుంది అని రాజు చెప్పగానే.. కంగారు పడొద్దు అంటారేంటి బాబాయ్‌ మా పరిస్థితి మీకు తెలుసు కదా..? నేను బుజ్జమ్మ బయట తిరగకూడదు.. అది తెలిసి కూడా ఎలా పంపించారు మీరు అని అడగ్గానే.. ఈ ఒక్కసారికి ఏమీ అనుకోవద్దమ్మా అటాడు రాజు.. ఏంటి బాబాయ్‌ ఇది మీ మీద ఉన్న నమ్మకంతో బుజ్జమ్మను పంపిస్తే ఇలా చేస్తారా..? ఇదేనా మీ జాగ్రత్త అంటుంది. ఇంతలో రాజుకు అంజు ఫోన్‌ చేస్తుంది. బుజ్జమ్మ గురించి చెప్పి గంటలో ఆశ్రమంలో డ్రాప్‌ చేస్తామని చెప్తుంది.

Advertisement

తర్వాత అమర్‌, రాథోడ్‌ వెళ్తుంటే.. రోడ్డు మీద కరుణ కనిపిస్తుంది. రాథోడ్‌ కారు అపి కరుణ దగ్గరకు వెళ్లి ఎలా ఉన్నావు నూడిల్స్‌ పాప అని అడుగుతాడు. రాథోడ్‌ను చూసి ఎగ్జైట్‌మెంట్‌ అవుతుంది కరుణ. పక్కనే ఉన్న అమర్‌ను చూసి దగ్గరకు వెళ్లి నమస్తే సార్‌ ఎట్లున్నారు సార్‌ అని పలకరిస్తుంది. భాగీ గురించి ఏమైనా తెలిసిందా అని అడుగుతుంది. దీంతో అమర్‌ అది నువ్వే చెప్పాలి అనగానే.. నాకెట్ల తెలుస్తుంది సార్‌ అంటుంది కరుణ. తను నీ ఫ్రెండ్ కదా..? నా తప్పేంటో తెలియక ఐదేళ్లుగా టార్చర్‌ అనుభవిస్తున్నాను అంటూ అమర్‌ ఎమోషనల్ అవగానే.. కరుణ కోపంగా మిస్సమ్మను తిడుతుంది. అది కనిపిస్తే దాన్ని నిలబెట్టి నాలుగైదు పీకుతా అంటూ చూడగానే దూరంగా మిస్సమ్మ కనిపిస్తుంది. షాకింగ్‌ గా కరుణ సార్‌ అక్కడ భాగీ కనిపిస్తుంది చూడండి అని చెప్పగానే.. అమర్‌, రాథోడ్‌ ఇద్దరూ మిస్సమ్మను చూస్తారు. మిస్సమ్మ కూరగాయలు తీసుకుని వెళ్తుంటుంది. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×