E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాజుకు వార్నింగ్ ఇచ్చిన మనోహరి  

Nindu Noorella Saavasam Serial Today January 14th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: రాజుకు వార్నింగ్ ఇచ్చిన మనోహరి  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

రోడ్డు మీద ఉన్న రాజు దగ్గరకు మనోహరి, చంభా వెళ్తారు. వాళ్లను చూసిన రాజు షాక్‌ అవుతాడు. వాళ్లిద్దరూ కలిసి రాజును అనుమానంగా చూస్తుంటారు. బుజ్జమ్మ గురించి ఆరా తీస్తారు. దీంతో రాజు మరింత టెన్షన్‌ పడుతుంటాడు. బుజ్జమ్మ అనాథ అని చెప్తాడు రాజు. దీంతో మనోహరి వెటకారంగా అంటే ఆ పాపకు ఎవ్వరూ లేరు అంటారు అని ప్రశ్నించగానే.. రాజు ఎవ్వరూ లేని వారినే అనాథ అంటారు కదమ్మా అని చెప్పగానే.. మనోహరి మరి ఇందాక పాప వాళ్ల అమ్మ ఇక్కడకు వచ్చింది అని చెప్పింది అని అడగ్గానే.. ఆవిడ పాప వాళ్ల అమ్మ కాదు ఆశ్రమంలో టీచర్‌ అని రాజు చెప్తాడు. దీంతో మనోహరి ఓహో టీచరా..? సరే అయితే నేను అప్పుడప్పుడు ఆశ్రమానికి వస్తూ ఉంటాను అంటుంది.

కంగారుగా రాజు ఎందుకు వస్తారండి అని అడుగుతాడు. మీరు అక్కడ ఏం దాచారో చూడటానికి వస్తాను అని చెప్తుంది మనోహరి. రాజు కంగారుగా దాచడం ఏంటండి.. అని అడగ్గానే.. ఐ మీన్‌ ఆశ్రమాన్ని మీరు ఎలా రన్‌ చేస్తున్నారో చూడ్డానికి వస్తాను.. ఎంతైనా అది నేను పెరిగిన ఆశ్రమమే కదా..?  ఏం రాజు గారు ఆ అనాథ జాగ్రత్త అని హెచ్చరించడంతో రాజు భయంగా ఏంటండి అంటున్నారు అని అడుగుతాడు. దీంతో మనోహరి ఆ పిల్ల జాగ్రత్త అని అంటున్నాను.. అసలే ఎవ్వరూ లేని అనాథ కథా కంటికి రెప్పలా కాపాడుకోండి సరేనా..? యాదమ్మ పద అంటూ మనోహరి వెళ్లిపోతుంది. వాళ్లిద్దరూ వెళ్లిపోయాక రాజు భయంగా భగవంతుడా ఈ రాక్షసి కళ్లు బుజ్జమ్మ మీద పడ్డాయేంటి..? ఈ పాప భాగీ గారి కూతురు అని మనోహరికి తెలిసిపోయిందా..? ఏంటి అనుకుంటూ భయపడుతుంటాడు.

Advertisement

తర్వాత పిల్లలు ముగ్గురూ కలిసి గార్డెన్‌లో ఆడుకుంటుంటే మనోహరి టెర్రస్‌లోంచి చూస్తుంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన చంభా ఇందేంటి మనోహరి పిల్లలు అలా చూస్తుంది. మళ్లీ ఏదైనా ప్లాన్‌ చేస్తుందా ఏంటి..? అని మనసులో అనుకుని దగ్గరకు వెళ్లి మనోహరి ఆ పిల్లల వంక అలా చూస్తున్నావు..? మళ్లీ అమ్మూకు స్పాట్ ఏమైనా పెట్టబోతున్నావా..? అని అడుగుతుంది. దీంతో మనోహరి ఎందుకు అడుగుతున్నావు అంటుంది. ఎందుకు అంటావేంటి..? ఐదేళ్ల క్రితం నువ్వు పెట్టిన భయంతోనే కదా..? భాగీ బిడ్డను తీసుకుని దూరంగా పారిపోయింది. ఇప్పుడు మళ్లీ తిరిగి వచ్చింది. భాగీని దూరంగా తరమాలి అంటే అమ్మూకు ఏదైనా జరగాలి కదా..? అప్పుడే కదా భాగీలో భయం మొదలవుతుంది అనగానే.. భాగీలో భయం మొదలవడం కాదు.. ఇప్పటికే రెట్టింపు అవ్వాలి అంటుంది మనోహరి. నేను అదే చెప్తున్నాను మనోహరి.. ఈ రోజు ఈ పిల్లలు స్కూల్‌ లో ఆ చిన్న పిల్లను కలిశారు కదా..? అని చెప్పగానే..

ఆ విషయం భాగీకి తెలియదు కదా..? అంటుంది మనోహరి. ఈ రోజు కాకపోతే రైపైనా తెలుస్తుంది కదా..? అంటుంది చంభా. దీంతో మనోహరి కోపంగా చూస్తూ.. మనమే తెలిసిపోయేలా చేయాలి. ఈ పిల్లలు ఆ చిన్న పిల్ల కలిసిపోయారని భాగీకి అర్తం అవ్వాలి. భాగీలో భయం పెంచాలి అని చెప్తుంది. అదెలా చేస్తావు అంటూ చంభా అడగ్గానే.. సింపుల్‌ ఈ రోజు అంజుతో ఆరు పాప ఇంటికి వస్తుంది. ఆ పిల్ల ఇక్కడ ఉండగానే అంజుకు పెద్ద ప్రమాదం జరుగుతుంది. ఆ ప్రమాదం ఎలా ఉంటుందంటే అమ్మును ఐసీయూలో అడ్మిట్‌ చేస్తారు. ప్రాణం ఉంటుందా పోతుందా అనే సిచ్యుయేషన్‌ వస్తుంది. ఈ న్యూస్‌ ఆ భాగీకి చేరేలా చేస్తాను. అప్పుడు అమ్ము దగ్గరకు రాలేక.. అమరేంద్ర దగ్గరకు వచ్చి ఏడేళ్ల గడువు గురించి చెప్పలేక సతమతమవుతూ.. కుమిలిపోతుంది. ఆరు పాప ఈ ఇంటికి రావడం వల్లే అమ్ముకు అలా జరిగిందని.. భాగీ అనుకుంటుంది. భయంతో పాపను తీసుకుని దూరంగా పారిపోతుంది అని చెప్పగానే..

Advertisement

ప్లాన్‌ అయితే బాగుంది. కానీ రెండేళ్ల తర్వాతైనా భాగీ మళ్లీ వెనక్కి వస్తుంది కదా..? అని అనుమానం వ్యక్తం చేస్తే.. రాదు రాకూడదు.. భాగీ ఎప్పటికీ తిరిగి రాకుండా అమ్ముకు అతి పెద్ద ప్రమాదం జరగబోతుంది అని చెప్పగానే.. అంటే ఈ రోజు అమ్ముకు మూడిందన్నమాట.. జాగ్రత్త మనోహరి ఏదైనా తేడా జరిగితే నువ్వు ఉండవు.. అంటూ హెచ్చరిస్తుంది చంభా. నేను బతికి ఉండాలనే ఈ ప్లాన్‌ చేస్తున్నాను.. జరగబోయేది నువ్వే చూద్దువులే.. అంటూ నవ్వుకుంటూ వెళ్లిపోతుంది మనోహరి. ఇంతటితో నేటి బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×