E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అంజులో దూరిన ఆరు – ఘోరాకు వార్నింగ్‌ ఇచ్చిన మను  

Nindu Noorella Saavasam Serial Today January 13th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అంజులో దూరిన ఆరు – ఘోరాకు వార్నింగ్‌ ఇచ్చిన మను  
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  ఘోర ఇచ్చిన ముత్యపు లాకెట్‌ తీసుకుని ఇంటికి వస్తుంది మనోహరి. అది చేతిలో పట్టుకుని చూస్తూ లోపలికి వెళ్తుంటే.. మిస్సమ్మ ఎదురొస్తుంది. మిస్సమ్మను చూసిన మనోహరి షాక్ అవుతుంది. దీంతో భయపడ్డావా మను లోపల అందరూ నీ కోసమే చూస్తున్నారు అని చెప్తుంది. సరే అంటూ మనోహరి లోపలికి వెళ్తుంటే.. పని అయినట్టు లేదు అంటుంది మిస్సమ్మ. భయంతో మిస్సమ్మ దగ్గరకు వచ్చిన మనోహరి నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు అంటుంది.

తప్పుల మీద తప్పులు అంత భయం లేకుండా ఎలా చేస్తున్నావు మను అంటూ మిస్సమ్మ ప్రశ్నిస్తుంది. పక్క నుంచి అంతా వింటున్న అమ్మా బాలిక నీ సోదరిలోనే దూరావా అనుకుంటాడు. మను మాత్రం నేను ఇదంతా నీ మీద కోపంతో చేయలేదు అమర్‌  మీద ప్రేమతో చేశాను అంటూ కింద పడబోతుంటే.. మిస్సమ్మ పట్టుకుంటుంది. లాకెట్‌ వెలగదు.. దీంతో మనోహరి నువ్వు నువ్వే కదా అని అడుగుతూ.. ఇప్పటి దాకా మాట్లాడింది అంటుంది. నేనే మాట్లాడాను.. ఆరు అక్కా అనుకున్నవా అంటుంది. మనోహరి సైలెంట్‌ గా లోపలికి వెల్లిపోతుంది. గుప్త కూడా ఈ బాలికలో  లేదు లోపలికి వెళ్లి ఎవరిలో ఉందో కనుక్కోవాలి అనుకుని కిటికీ దగ్గరకు వస్తాడు.

Advertisement

లోపలికి వెళ్లిన మనోహరి అందరినీ చూస్తుంది. అందరూ మామూలుగానే ఉన్నారు అనుకుని చేతులు కడుక్కోవడనికి వెళ్తూ అమ్మును తగులుతుంది. లైట్‌ వెలగదు. తర్వాత ఆకాష్‌, ఆనంద్‌ లను టచ్‌ చేస్తుంది. అప్పుడు కూడా లైట్‌ వెలగదు.. దీంతో అసహనంగా ఓసే ఆరు ఎవరిలో దాక్కున్నావే అనుకుంటూ కుర్చీలో కూర్చుని నిర్మలను టచ్‌ చేస్తుంది లైట్‌ వెలగదు. మనోహరి పిచ్చి చేష్టలు గమనిస్తున్న మిస్సమ్మ కోపంగా చూస్తుంది.  తినండి మనోహరి గారు అంటూ చెప్తుంది. తిన్న తర్వాత మనోహరి రూంలోకి వెళ్లి కోపంగా ఆ ఘోర ఏమో ఎవరి శరీరంలోకో ప్రవేశించి అంటాడు.

ఇక్కడ ఎవరూ అనుమానంగా లేరు. ఈ లాకెట్‌ కూడా ఎవరిని పట్టుకున్నా లైట్‌ వెలగడం లేదు. అయినా ఇది పని చేస్తుందా..? పని చేయదు అంటూ లాకెట్‌ తీసి విసిరి పడేస్తుంది. లాకెట్‌ బయటకు పడటంతో అంజు లాకెట్‌ తీసుకుని రూంలోకి వచ్చి ఇది మీదేనా ఆంటీ అని అడుగుతుంది. అవునని మనోహరి చెప్పగానే.. అయితే తీసుకోండి అని ఇవ్వబోతూ.. మనోహరి తీసుకుంటుంటే వదలదు.. వదులు అంజు అంటూ మనోహరి అడగ్గానే.. అంజులో ఉన్న ఆరు కనిపిస్తుంది.

Advertisement

లాకెట్‌ లో లైట్‌ వెలుగుతుంది. వదలమంటావా మను అంటూ ఆరు అడుగుతుంది. మనోహరి షాక్ అవుతుంది.  నువ్వు ఇంటికి తిరిగి వచ్చినప్పటి  నుంచి చూస్తున్న అందర్ని ముట్టుకోవడం దీన్ని చూడటం అంతా గమనించాను ఇక దీని అవసరం నీకు లేదనుకుంటా తీసుకో అంటూ వెళ్లిపోతుంది అంజు. వెంటనే మనోహరి ఘోరకు ఫోన్‌ చేసి విషయం చెప్తుంది. ఆత్మను ఎలా పట్టుకోబోతున్నావు అని మను అడుగుతుంది. నీ పని నువ్వు చేశావు ఇక నా వంతు.. అయినా నువ్వు ఎప్పుడూ ఇలా అడగలేదేం అంటూ  నీకు రెండు మార్గాలు ఉన్నప్పుడు నువ్వు నా వైపే ఉన్నావని నమ్మకం ఏంటి..? అంటూ ఫోన్‌ కట్‌ చేస్తాడు ఘోర. దీంతో మనోహరి ఆలోచిస్తూ అరుంధతికి ఈ విషయం చెప్పాలి అది ఇంట్లోంచి వెళ్లకుండా ఉంటే సరి అనుకుంటుంది.

అంజులో ఉన్న ఆరు అమర్‌ రూంలోకి వెళ్లి ఆస్తికలు తీసుకుని ఏడుస్తుంది. ఇంతలో అమర్ వచ్చి కోపంగా అంజు అంటూ పిలుస్తూ.. ఏం చేస్తున్నావు ఇక్కడ.. ఇలా బాధపడతారనే మీ అమ్మ ఫోటో బయట పెట్టకుండా రూంలో పెడితే ఇక్కడికి కూడా వచ్చి బాధపడితే ఎలా అంటాడు. కింద నుంచి అమర్‌ సౌండ్‌ విన్న మిస్సమ్మ పైకి వస్తుంది. మిస్సమ్మను చూసిన ఆరు తన ఫోటో మిస్సమ్మ చూస్తుందేమోనని భయపడుతుంది. అమర్‌ అంజును బయటకు తీసుకొచ్చే సరికి అంజును తీసుకుని కిందకు వెళ్తుంది మిస్సమ్మ.  ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×