E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today January 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలో మిస్సమ్మను చూసిన అమర్

Nindu Noorella Saavasam Serial Today January 13th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆశ్రమంలో మిస్సమ్మను చూసిన అమర్
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మిస్సమ్మ రెడీ అవుతుంటే బ్యాగ్‌ వేసుకుని వెనక నుంచి వెళ్లిన బుజ్జమ్మ మమ్మీ అని పిలవగానే తిరిగి చూసిన మిస్సమ్మ స్కూల్‌ కు టైం అవుతుంది నువ్వు రెడీ అయ్యావా..? బుజ్జమ్మ అని అడగ్గానే.. నేను ఎప్పుడో రెడీ మమ్మీ అని చెప్తుంది బుజ్జమ్మ. దీంతో మిస్సమ్మ నువ్వు సూపర్‌ బుజ్జమ్మ అంటుంది దేనికి మమ్మీ అని బుజ్జమ్మ అడగ్గానే.. నిన్ను రెడీ చేసే అవకాశం నాకు ఎప్పుడూ ఇవ్వువు నీ అంతట నువ్వే రెడీ అవుతావు. నీ పనులు నువ్వే చేసుకుంటావు అని చెప్పగానే.. మరీ నీకు నేను శ్రమ ఇవ్వకూడదు కదా.? నిన్ను కష్టపెట్టకూడదు కదా..? నిన్ను బాగా చూసుకోవాలి కదా..? అని బుజ్జమ్మ చెప్పగానే..

మిస్సమ్మ అదేంటి బుజ్జమ్మ నిన్ను నేను కదా చూసుకోవాల్సింది అనగానే.. నేనే నిన్ను చూసుకోవాలి అది నా బాధ్యత నిన్ను ఎప్పుడూ కాపాడుతూ ఉంటాను.. అని బుజ్జమ్మ చెప్పగానే.. ఆశ్చర్యంగా మిస్సమ్మ నువ్వు నన్ను కాపాడతావా..? అని అడుగుతుంది. దీంతో బుజ్జమ్మ అంటే నీ మీద ఈగ దోమ ఏదీ వాలకుండా చూసుకుంటాను అని చెప్పగానే.. మిస్సమ్మ ఎమోషనల్ అవుతూ నువ్వు అచ్చం మా అక్కలాగే మాట్లాడుతున్నావే అంటుంది. దీంతో బుజ్జమ్మ వెంటనే నేను మీ అక్కనే కదా అంటుంది. ఏంటి ఏంటి.. అని మిస్సమ్మ అడగ్గానే.. అదేనమ్మా నాకు నువ్వు మీ అక్క పేరు పెట్టావు కదా..? అంటే నేను నీ అక్కనే కదా..? అంటుంది బుజ్జమ్మ.. దీంతో మిస్సమ్మ మరింత ప్రేమగా నువ్వు మా అక్కవి.. మా అమ్మవి.. నువ్వు నా కూతురుగా పుట్టడం నా అదృష్టం అని మిస్సమ్మ చెప్పగానే.. బుజ్జమ్మ అదేం కాదు నువ్వు మా అమ్మ అవ్వడం నా అదృష్టం నువ్వు నా గ్రేట్‌ మమ్మీవి నువ్వు నన్ను బాగా చూసుకుంటున్నావు.. అందుకే నేను నిన్ను ఇంకా బాగా చూసుకుంటాను అని చెప్తుంది.

Advertisement

దీంతో మిస్సమ్మ బుజ్జమ్మను హగ్‌ చేసుకుని థాంక్యూ బుజ్జమ్మ.. ఇంక స్కూల్‌ కు వెళ్దామా..? అని అడగ్గానే. ఆ మమ్మీ ఒక్క నిమిషం అంటూ మిస్సమ్మను కింద నుంచి పై వరకు చూస్తుంది. దీంతో మిస్సమ్మ ఏంటి బుజ్జమ్మ అలా చూస్తున్నావు అని అడుగుతుంది. దీంతో బుజ్జమ్మ ఈరోజు నువ్వు స్పెషల్‌ గా కనిపిస్తున్నావు.. అని చెప్తుంది. దీంతో మిస్సమ్మ ఏం లేదే రోజూ లాగానే ఉన్నానే అంటుంది. ఊహూ నువ్వు స్పెషల్‌గా రెడీ అయ్యావు.. అనగానే.. మిస్సమ్మ అదేం లేదు రోజు లాగే ఉన్నాను.. అని చెప్తుంది. లేదు నాకు ఎందుకో ఇవాళ నువ్వు స్పెషల్‌గా కనిపిస్తున్నావు.. ఈరోజు ఏమైనా స్పెషల్‌ ఉందా..? మమ్మీ అని అడగ్గానే.. స్పెషల్‌ ఏం లేదు నువ్వే నన్ను స్పెషల్‌ గా చూస్తున్నావు.. ఆలస్యం అవుతుంది పద వెళ్దాం అనగానే.. ఇద్దరూ కలిసి వెళ్లబోతుంటే.. రాజు వస్తాడు. మీరు ఎక్కడికి అమ్మా అని మిస్సమ్మను అడుగుతాడు.

బుజ్జమ్మను స్కూల్‌ లో డ్రాప్‌ చేసి వస్తాను బాబాయ్‌ అని చెప్తుంది మిస్సమ్మ.. దీంతో రాజు నీ కెందుకు అమ్మా శ్రమ బుజ్జమ్మను స్కూల్‌కు నేను తీసుకెళ్తాను కదా అంటాడు. పర్వాలేదు బాబాయ్‌ గారు బుజ్జమ్మ కూడా నన్ను  స్కూల్‌కు రమ్మంటుంది అని చెప్పగానే.. రాజు భయంగా అది కాదమ్మా..? మీరు బయటకు వెళ్తే.. అనగానే.. మీ భయం నాకు అర్థం అయింది బాబాయ్‌.. నేను బయటకు వెళ్లి ఏ టెన్షన్‌ లేకుండా తిరిగి వస్తాను అని చెప్పగానే.. అయితే ఎందుకైనా మంచిది నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పగానే.. సరే బాబయ్‌ పదండి అంటూ ముగ్గురు కలిసి వెళ్లిపోతారు.   తర్వాత అమర్‌, రాథోడ్‌ కలిసి ఆశ్రమానికి వెళ్తారు. అమరేంద్ర రావడం చూసిన రాజు షాక్ అవుతాడు. వెంటనే పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లి భాగీకి విషయం చెప్పి బయటకు రావొద్దంటాడు. ఆయన ఇక్కడికి ఎందుకు వచ్చారు బాబాయ్‌ అని భాగీ అడగ్గానే.. రేపు పండగ కదమ్మా పిల్లలకు కొత్త బట్టలు తీసుకొచ్చారు అని చెప్తాడు రాజు. తర్వాత అమర్‌ పిల్లలకు బట్టలు ఇచ్చి వెళ్తుంటే భాగీ కిటికీలోంచి చూస్తుంది. అమర్‌ కూడా అక్కడికి రాగానే ఆగిపోతాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×