E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజును కన్వీన్స్ చేయాలనుకున్న మిస్సమ్మ – జైలు నుంచి విడుదల కానున్న కాళీ

Nindu Noorella Saavasam Serial Today February 7th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అంజును కన్వీన్స్ చేయాలనుకున్న మిస్సమ్మ – జైలు నుంచి విడుదల కానున్న కాళీ
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode :  అంజు స్టైల్‌గా జ్యూస్‌ తాగుతుంటే.. మిగతా పిల్లలు అంజు బ్యాగ్ సర్దుతుంటారు. వారికి ఈ డ్రెస్‌ పెట్టండి ఆ డ్రెస్‌ పెట్టండి అంటూ ఆర్డర్స్‌ వేస్తుంది అంజు. ఇంతలో అమ్ము, అంజును దగ్గరకు తీసుకుని మేము ఎవ్వరం లేకుండా అంత దూరం ఒక్కదానివే వెళ్తున్నావు.. జాగ్రత్తగా ఉంటావు కదా..? మనోహరి ఆంటీ.. రణవీర్‌ అంకుల్‌ ఉన్నారు కానీ వాళ్లు కూడా బయటి వాళ్లే కదా..? కావాలంటే హాలిడేస్‌లో తీసుకెళ్లమని డాడీకి చెప్తాను అయినా ఒక్కదానివే అంత దూరం ఎందుకు చెప్పు.. అంటుంది. దీంతో అంజు కూడా సాయంత్రం నుంచి నేను కూడా అదే ఆలోచిస్తున్నాను అమ్ము. రణవీర్‌ అంకుల్‌ మనోహరి ఆంటీతో నన్ను కోల్‌కతా రమ్మన్నప్పుడు నేను ఎందుకు ఒప్పుకున్నానా..? అని కానీ ఎందుకో అమ్మూ కోల్‌కతా అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఎప్పుడూ వెళ్లలేదు చూడలేదు.

కానీ ఎందుకో అక్కడికి వెళ్లాలనిపిస్తూ ఉండేది అంటుంది. మిమ్మల్ని ఏడిపిస్తూ ఉండటానికి పైకి అలా అంటున్నాను కానీ నాకు కూడా చాలా బాధగా ఉంది అమ్ము అంటుంది. ఇందాకటి నుంచి నేను రానని చెప్తే అంకుల్‌ ఫీలవుతారేమోనని ఆలోచిపస్తున్నాను అంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన మిస్సమ్మ అయితే వెళ్లకు అంజు. ఫ్లీజ్‌ ఉండిపో.. ఫ్లీజ్‌ అంజు నా మీద నీకు కోపంగా ఉందని నాకు తెలుసు.. కానీ ఈ ఒక్కసారి నా మాట విని.. నువ్వు మనోహరి వాళ్లతో వెళ్లకు అనగానే.. అయితే నేను వెళ్లడం నీకు ఇష్టం లేదా మిస్సమ్మ అని అడుగుతుంది అంజు. అవునని చెప్తుంది మిస్సమ్మ. అయితే నేను కచ్చితంగా వెళ్లిపోతాను. నువ్వు నా ఎనిమీ నీకు ఇష్టం అయిందేదీ నేను చేయను.. ఈ రాత్రికే నేను కోల్‌కతా వెళ్లిపోతాను అంటూ చెప్పి వెళ్లిపోతుంది అంజు.

Advertisement

జైల్లో ఉన్న కాళీ దగ్గరకు మంగళ వెళ్తుంది. ఏడుస్తూ ఎలా ఉన్నావురా తమ్ముడు అంటూ పలకరిస్తుంది. దీంతో కాళీ కోపంగా నేను ఇక్కడ ఉన్నాననే విషయమే మర్చిపోయి వాళ్లతో హ్యాపీగా ఉన్నావా..? అని అడుగుతాడు. ఏం లేదని నువ్వు జైలుకు వచ్చాక నా దగ్గర చిల్లిగవ్వ లేదు. మీ బావ నన్ను రాచి రంపాన పెడుతున్నాడు.. పక్కన నువ్వు లేవు అంటూ బాధపడుతుంది. ఇక నుంచి పైసల గురించి దిగులు అక్కర్లేదు.. నేను రేపు జైలు నుంచి విడుదల అవుతున్నాను. మనోహరికి ఒక గిఫ్ట్‌ ఇద్దామని వస్తున్నాను అంటాడు. నీకు బెయిలు రాదని అన్నారు కదా.. ఎలా వస్తున్నావు అని మంగళ అడుగుతుంది. సత్ ప్రవర్తన కింద నన్ను వదిలిపెడుతున్నారు అని చెప్తాడు. నేను బయటకు వచ్చి మనోహరిని పెళ్లి చేసుకుంటాను అని చెప్తాడు. దీంతో మంగళ భయపడుతుంది.

మిస్సమ్మ కోపంగా అమర్‌ దగ్గరకు వెళ్లి అంజలిని రణవీర్‌ వాళ్లతో పంపించడం నాకు ఇష్టం లేదు. వాళ్ల బిహేవియర్‌ నాకు అనుమానంగా అనిపిస్తుంది అని చెప్తుంది. దీంతో అమర్‌ లూజ్‌ అంత స్పీడుగా చెబితే నాకేం అర్తం అవుతుంది. స్లోగా చెప్పు అంటాడు. ఇప్పుడే కదా చెప్పాను మళ్లీ చెప్పమంటావేంటి అంటుంది. అమర్‌ కోపంగా కసురుకోవడంతో మిస్సమ్మకు భయంతో వెక్కిళ్లు వస్తాయి.. అమర్‌ వాటర్‌ కోసం చూస్తాడు. వాటర్‌ లేకపోవడంతో వెళ్లి మిస్సమ్మను గట్టిగా హగ్‌ చేసుకుంటాడు అమర్‌. దీంతో మిస్సమ్మ వెక్కిళ్లు ఆగిపోతాయి. ఇద్దరి మధ్య చిన్నపాటి రొమాంటిక్‌ సీన్‌ క్రియేట్‌ అవుతుంది. మిస్సమ్మ ఏం జరిగింది అని అడుగుతుంది. దీంతో అమర్‌ నీకు వెక్కిళ్లు వచ్చాయి.. వెక్కిళ్లు ఆగిపోవడానికి ఇలా చేశాను అంటాడు. మిస్సమ్మ క్యూట్‌గా మీరు అలా చేస్తే నా ఊపిరి ఆగిపోతుంది అంటుంది. దీంతో అమర్‌ దూరంగా వెళ్లగానే.. మిస్సమ్మ మళ్లీ వెక్కిళ్లు వచ్చినట్టు యాక్ట్‌ చేస్తుంది. అమర్‌ నాటకం ఆడొద్దు అంటాడు.

Advertisement

కోల్‌కతా వెళ్లడానికి మనోహరి రెడీ అవుతూ త్వరగా అక్కడికి వెళ్లి.. అంజుతో సంతకం చేయించి వస్తే ఇక నన్ను రణవీర్‌ వదిలిపెడతాడు అనుకుంటూ అయినా అన్ని వందల కోట్లు రణవీర్‌కు వస్తుంటే.. నాకు కొన్నైనా ఇవ్వాలి కదా..? నా సంతకం అడుగుతాడు కదా అప్పుడు నాకు కొన్ని కోట్లు ఇస్తేనే సంతకం చేస్తానని చెప్తాను అనుకుంటూ రెడీ అవుతుంది. ఇంతలో మంగళ ఫోన్‌ చేసి కాళీ రేపు జైలు నుంచి వస్తున్నాడు అని చెప్తుంది. మనోహరి షాక్‌ అవుతుంది. అసలు వాడు వచ్చేది నీ ఘోరాలు మొత్తం అమరేంద్ర బాబుకు చెప్పడానికి వస్తున్నాడని మంగళ చెప్పగానే.. మనోహరి కోపంతో మంగళను తిడుతుంది. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 

ALSO READ: ఫస్ట్‌ టైం అరుణాచలం వెళ్తున్నారా..? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే..?

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×