E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్ సక్సెస్ 

Nindu Noorella Saavasam Serial Today February 7th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరి ప్లాన్ సక్సెస్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మనోహరి పంతులును పిలిపించి ఇంట్లో కూర్చుని ఉంటుంది. పంతులుతో చంభా, మనోహరి మాట్లాడుతుంటారు. ఇంతలో అమర్ వస్తుంటాడు. గమనించిన చంభా.. మనోహరి అమరేంద్ర వస్తున్నారు అని చెప్తుంది. ఇంతలో అమర్‌ లోపలికి రాగానే పంతులు లేచి నమస్కారం అండి అంటాడు. అమర్‌ కూడా నమస్తే పంతులు గారు ఇలా వచ్చారేంటి..? అని అడుగుతాడు. దీంతో పంతులు తడబడుతూనే మనోహరి గారు రమ్మని పిలిచారండి.. అని చెప్పగానే.. అమర్‌ ఎందుకు మనోహరి అని అడుగుతాడు. ముందు కూర్చో అమర్‌ చెప్తాను అంటుంది మనోహరి. దీంతో అందరూ కూర్చుంటారు. చెప్పండి అని అమర్‌ అడగ్గానే.. మనోహరి పంతులుగారు ఆ మంచి విషయం మీ నోటితో మీరు చెప్తేనే బాగుంటుంది అని చెప్పగానే.. మీరు చెప్తేనే బాగుంటుంది అమ్మా అంటాడు పంతులు.

దీంతో మనోహరి ఏం లేదు అమర్‌ మృత్యుంజయ హోమం చేయిద్దాం అనుకుంటున్నాను అని చెప్పగానే.. ఎందుకు అని అమర్‌ అడగ్గానే.. పిల్లల మీద వరుసగా దాడులు జరుగుతున్నాయి కదా..? ఆ హోమం జరిపిస్తే పిల్లలకు మంచిది అని చెప్పగానే.. అమర్‌ అనుమానంగా అది ఎవరో కావాలని హిప్నటైజ్‌ చేసి అలా చేయిస్తున్నారు అని అమర్‌ చెప్పగానే.. ఏది ఏమైనా కానీ ఆ మృత్యుంజయ హోమం జరిపిస్తే పిల్లలు క్షేమంగా ఉంటారు అని చెప్తుంది. ఆ పరమశివుడి కరుణాకటాక్షాలు ఉంటే ఆ మృత్యువు నీడ ఈ ఇంటి మీద పడదు.. అంటూ పంతులు చెప్పగానే.. అమర్‌ సరే అలాగే చేయండి.. అని చెప్పగానే పంతులు శుభం రేపు మంచి రోజు అయ్యా..పైగా అమృత ఘడియలు ఉన్నాయి. ఆ సమయంలో హోమం చేస్తే చాలా మంచిది అయ్యా అని పంతులు చెప్పగానే.. అమర్‌ మీ ఇష్టం పతులుగారు.. మీరు ఎప్పుడంటే అప్పుడే మేము సిద్దంగా ఉంటాము అని చెప్పగానే.. మనోహరి నవ్వుతూ చాలా థాంక్స్‌ అమర్‌ నువ్వు ఒప్పుకోవేమో అనుకున్నాను అంటుంది.

Advertisement

చంభా కూడా ఏంటి మేడం మీరు మరీనూ.. పిల్లల గురించి మీరు అంతగా ఆలోచిస్తుంటే సారు ఎందుకు ఒప్పుకోరనుకుంటారు. మీకు పిల్లలు అంటే ప్రాణం అని సారుకు తెలియదా ఏంటి..? అంటుంటే.. మనోహరి పంతులుకు సైగ చేస్తుంది. ఇంతలో పంతులు కల్పించుకుని అమ్మా మీకు ఇంకా వివాహం కాలేదు కదా..? అని అడగ్గానే.. మనోహరి సిగ్గు పడుతున్నట్టు నటిస్తూ.. అంటే ఇప్పుడు మా పెళ్లి గురించి ఎందుకు పంతులు గారు అంటుంది. పంతులు కూడా అంటే తెలియక అడుగుతున్నాను అమ్మా.. పెళ్లి వరుస వచ్చింది కదా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదా..? అని అంటుంటే.. మా మేడం గారు పెళ్లి చేసుకోకూడదని కాదు పంతులు గారు ఒక బాధ్యత కోసం అంతే అని చంభా చెప్పగానే.. పంతులు తన కంటే పెళ్లి కావాల్సిన పెద్దవాళ్లు ఎవరైనా ఉన్నారా..? అమ్మా అని అడగ్గానే.. పెద్దవాళ్లు ఎవరూ లేరు చిన్న పిల్లలు ఉన్నారని అని చెప్పగానే.. పిల్లలు అంటే తమ్ముళ్లు, చెల్లెల్లు ఉన్నారా..? అమ్మా అంటాడు పంతులు.. కొడుకులు కూతుళ్లు అనుకోండి అని చంభా చెప్పగానే.. ఏమిటి పెళ్లి కాకుండానే పిల్లలా..? అంటాడు పంతులు..

దీంతో చంభా అయ్యయ్యో మా సార్‌ పిల్లలే పంతులు గారు వాళ్లను చూసుకోవాలసిన ఆవిడేమో బాధ్యత లేకుండా వెళ్లిపోయింది. అప్పటి నుంచి మా మనోహరి మేడం గారు సొంత పిల్లల్లా చూసుకుంటున్నారు. ఆ పిల్లల కోసం పాపం మనోహరి మేడం గారు పెళ్లి కూడా చేసుకోకుండా ఇలాగే ఉండిపోయారు. ఏంటి యాదమ్మ ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు చెప్పు అంటుంది మనోహరి..ఇంతలో పంతులు ఏంత త్యాగం అమ్మా ఈ కాలంలో కూడా మీలాంటి నిష్వార్థపరులు ఉన్నారంటే మీ కాళ్లు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకోవాలి అమ్మ.. అనగానే.. మనోహరి అమాయకంగా అయ్యో పంతులు గారు అంత పెద్ద మాటలు ఎందుకండి.. అంటుంది. అయ్యో పంతులు గారు నిజంగా మనోహరి మేడం ఈ ఇంటి ఇలవేల్పు.. అంటూ చంభా చెప్పగానే.. అయ్యో యాదమ్మ నువ్వు కూడా ఏంటి..? ఆ పిల్లలు ఎవరు..? నా ప్రాణ స్నేహితులురాలు అరుంధతి పిల్లలు ఇక అమర్‌ నాకు పరాయి వాడు కాదు కదా..? అరుంధతి లేదు.. భాగీ కూడా వెళ్లిపోయింది. మిగిలింది నేనే కదా..? పిల్లల కోసం అమర్‌ కోసం నేను ఈ మాత్రం చేయలేనా..? అది కూడా త్యాగం అంటే ఎలా అనగానే..

Advertisement

ఇలా అనుకోవడం కూడా మీ మంచితనం మీ గొప్పతనం మేడం.. అంటుంది చంభా.. ఇంతలో పంతుల లేచి మనోహరిని చూస్తూ.. నిజంగా మీరు చాలా గొప్పవారు అమ్మా..? మీ నిస్వార్థం.. మీ త్యాగం మీ భాద్యత అయ్యగారికి అర్థం అయ్యే ఉంటుంది అమ్మా… పంతులు చెప్తుంటే.. మనోహరి వెంటనే పంతులు గారు రేపు హోమానికి ఏర్పాట్లు చేయండి అంతే కదా అమర్‌.. అనగానే.. అవును మీకేం కావాలన్నా మనోహరిని అడగండి అని చెప్పి అమర్‌ వెళ్లిపోతాడు. అమర్‌ వెళ్లిపోయాక ముగ్గురు కలిసి నవ్వుకుంటారు.. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×