E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మంత్ర దండం ముట్టుకున్న బుజ్జమ్మ 

Nindu Noorella Saavasam Serial Today February 5th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మంత్ర దండం ముట్టుకున్న బుజ్జమ్మ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు మనోహరి, చంభా. ఇంతటితో ఇవ్వన్ని ఆపేద్దాం నువ్వు అమరేంద్రతో తాళి కట్టించుకునే పనిలో ఉండు నీకు అదే మంచిది అని చంభా చెప్తుండగానే.. బుజ్జమ్మ పై నుంచి కిందకు వస్తూ.. మనోహరి, చంభాను కోపంగా చూస్తుంది. బుజ్జమ్మను చూసిన చంభా ఈ పిల్ల  ఇప్పుడే  పైకి వెళ్లింది కాదా అప్పుడే కిందకు వస్తుందేంటి అంటుంది. అది నన్ను చూస్తూ వస్తుందేంటి చంభా అంటుంది. దీంతో చంభా భయంగా అవును మనోహరి ఆ పిల్ల నిన్నే చూస్తుంది అని చెప్తుండగానే.. బుజ్జమ్మ కిందకు వచ్చి హాల్లోని ఆరు ఫోటో దగ్గరకు వెళ్తుంది. అప్పుడే మనోహరి అది చూస్తుంది నన్ను కాదు చంభా అరుంధతి ఫోటోను అని చెప్పగానే.. తన ఫోటోను తనే ఎందుకు చూసుకుంటుంది అంటూ చంభా అడుగుతుంది.

దీంతో ఆ ఫోటో పక్కనే ఉన్న చంభా మంత్ర దండం చూసి బుజ్జమ్మ ఏటిది అని అడుగుతూ పట్టుకోవడానికి వెళ్తుంటే.. చంభా పాప ఆగు ఆగు.. అంటుంది. మనోహరి మాత్రం ఏంటి చంబా ఇది ముట్టుకుంటే ఏమవుతుంది. శక్తులు ఉన్నది అమ్ములో కదా..? అంటుంది. ఇంతలో బుజ్జమ్మ పట్టుకున్న మంత్రదండం లో లైట్స్ వెలుగుతుంటాయి. హాయ్‌ వెలుగుతుంది అని బుజ్జమ్మ నవ్వుతుంది.  చంభా, మనోహరి షాక్‌ అవుతారు. అదేంటి ఆ నలుగురు పిల్లల్లో ఒకరికి శక్తులు ఉన్నాయి అని చెప్పావు.. ఇప్పుడు అది ముట్టుకుంటే మంత్రదండం మెరుస్తుంది ఏంటి..? అని అడగ్గానే.. ఈ పిల్లలో కూడా శక్తులు ఉన్నాయని చెప్పాను కదా..? ఆ శక్తే నాగబంధాన్ని మెరిపిస్తుంది. అని చెప్తుండగానే..పై నుంచి అంజు వాళ్లు బుజ్జమ్మ అని పిలుస్తూ వస్తుంటారు. వాళ్లను చూసి చంభా పరుగున బుజ్జమ్మ దగ్గరకు వెళ్లి పాప పాప ఇది ఇలా ఇవ్వు అంటూ  మంత్రదండం లాక్కుని మనోహరి పక్కకు వెళ్తుంది.

Advertisement

బుజ్జమ్మ దగ్గరకు వెళ్లి అది ఇవ్వండి ఆంటీ చూస్తాను.. అనగానే.. చంభా చిన్న పిల్లలు చూడకూడదమ్మా అని చెప్తుంది. దీంతో బుజ్జమ్మ ఫ్లీజ్‌ ఆంటీ ఒకసారి ఇవ్వండి అని అడుగుతుంది. దగ్గరకు వచ్చిన అమ్ము ఏంటి బుజ్జమ్మ ఏం కావాలి అని అడుగుతుంది. దీంతో బుజ్జమ్మ మంత్రదండ చూపిస్తూ.. అది కావాలి అని చెప్తుంది. చంభా, మనోహరి టెన్షన్‌ పడుతుంటారు. అంజు మా బుజ్జమ్మ అడుగుతుంది కదా ఇవ్వు యాదమ్మ అని చెప్తుంది. దీంతో చంభా ఇందులో ఏముంది అమ్మా.. ఇదేం ఆట బొమ్మ కాదు కదా..? అని చెప్పగానే.. బుజ్జమ్మ అందులోంచి మెరుపు వస్తుంది అని చెప్పగానే.. ఆనంద్‌ ఆశ్చర్యంగా ఏంటి మెరుపా..? అని అడుగుతాడు. దీంతో బుజ్జమ్మ అవును లైట్‌ వస్తుంది అని చెప్తుంది. దీంతో ఆకాష్‌ అలా ఎలా వస్తుంది బుజ్జమ్మ అదేం మ్యాజిక్‌ మాగ్నెట్‌ కాదు కదా అంటాడు. దీంతో బుజ్జమ్మ  ఏమో నేను టచ్‌ చేయగానే.. అందులోంచి లైట్‌ వచ్చింది అని చెప్పగానే.. అంజు అవునా..? యాదమ్మా అది ఒకసారి బుజ్జమ్మకు ఇవ్వు ఆ లైట్‌ ఏదో మేము కూడా చూస్తాము అంటుంది.

దీంతో చంభా ఇందులోంచి ఏ లైటు రాదమ్మా హాల్లో లైటు దీని మీద పడి మెరిసింది అంతే అని చెప్పగానే.. ఇక్కడ ఎక్కడా లైట్‌ లేదు కదా యాదమ్మా రిప్లెక్షన్‌ పడటానికి అని అమ్ము అడగ్గానే.. ఆనంద్‌ ఒకసారి అది ఇవ్వు యాదమ్మా అంటాడు. దీంతో చంభా వద్దులే బాబు అని చెప్తుంది. దీంతో ఆకాష్‌ ఇందాకా మా అందరికీ ఇచ్చావు కదా మా బుజ్జమ్మకు ఇవ్వడానికి ఏంటి ప్రాబ్లమ్‌ అంటాడు. ఇంతలో అమర్‌ వస్తాడు. ఏంటి ఆకాష్‌ అని అడగ్గానే.. మనోహరి, చంభా షాక్‌ అవుతారు. చూడండి డాడ్‌ యాదమ్మ చేతిలో ఉన్న కర్ర బుజ్జమ్మ అడిగితే యాదమ్మ ఇవ్వడం లేదు అని చెప్పగానే.. అమర్‌ చంభా చేతిలో మంత్రదండం చూసి ఏంటి యాదమ్మ అది అని అడగ్గానే.. చంభా టెన్షన్‌ పడుతూ ఇది సార్ సపోర్టింగ్‌ కర్ర సార్‌ అని చెప్పగానే.. చూస్తుంటే అలా కనబడటం లేదే ఏదో వింతగా ఉంది అని అమర్‌ అడగ్గానే.. రాథోడ్‌ వచ్చి సార్‌ అలాంటివి మంత్రగాళ్ల దగ్గర మాత్రమే ఉంటాయి సార్‌ అని చెప్పగానే.. మనోహరి, చంభా షాక్‌ అవుతారు.

Advertisement

అమర్‌ కోపంగా దాన్ని ఇంట్లోకి ఎందకు తీసుకొచ్చావు యాదమ్మ అలాంటివి ఇంట్లో ఉండకూడదు ఇంకోసారి ఇలా చేశావంటే భాగోదు.. రాథోడ్‌ దాన్ని తీసుకెళ్లి కారులో పెట్టు అని చెప్పగానే.. రాథోడ్‌ మంత్రదండం తీసుకెళ్లి కారులో పెడతాడు. ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×