E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  చంభా మీద దాడి చేసిన చిలుక

Nindu Noorella Saavasam Serial Today February 3rd: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  చంభా మీద దాడి చేసిన చిలుక
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:   

అమర్‌ ఆశ్రమంలోకి వెళ్లడం బయటి నుంచి కరుణ చూస్తుంది. అదే విషయం మిస్సమ్మకు చెప్పడానికి కాల్‌ చేస్తుంది. ఎన్ని సార్లు ఫోన్‌ చేసినా మిస్సమ్మ కాల్‌ లిఫ్ట్‌ చేయదు. పాలు మరిగిస్తూ కిచెన్‌లో ఉంటుంది.  కాల్‌ లిఫ్ట్‌ చేయడం లేదని కరుణ కంగారు పడుతుంది. మరోవైపు పాలు తీసుకుని బయటకు వస్తుంది మిస్సమ్మ. హాల్లోంచి చూసి బుజ్జమ్మ ఎవరితో మాట్లాడుతుంది.. ఎవరు వచ్చారు  అనుకుంటుంది. గోడ చాటుగా ఉండటంతో మిస్సమ్మకు బుజ్జమ్మ మాత్రమే కనిపిస్తుంది. అమర్‌ కనిపించడు. మిస్సమ్మ పాలు తీసుకుని డోర్‌ దగ్గరకు వస్తుంది. అప్పుడే బయటి  నంచి పరుగెత్తుకుంటూ వచ్చిన కరుణ గట్టిగా గుడ్‌ మార్నింగ్‌ అమరేంద్ర సార్‌ అంటూ చెప్పగానే.. ఆ అరుపులకు మిస్సమ్మ చేతిలో పాల గ్లాస్‌ కింద పడిపోతుంది. మిస్సమ్మ వెంటనే లోపలికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. బెడ్‌ రూంలోకి వెళ్లి కిటికీలోంచి చూస్తుంది.

అమర్‌ లేచి కరుణను చూస్తూ.. కోపంగా ఎందుకు అంత గట్టిగా అరిచావు అంటాడు. దీంతో కరుణ వినబడాలి కదా..? సార్‌ అంటుంది. ఎవరికి అని అమర్‌ అడగ్గానే.. ఊ భాగీకి అని మనసులో అనుకుని మీకే సార్‌ అని చెప్తుంది. దీంతో అమర్‌ నాకేమైనా చెవుడు అనుకున్నావా..? అనగానే.. కరుణ అంటే మీ ఆర్మీ వాళ్లు కూడా ఇట్లనే గట్టిగా అరుస్తారు కదా..? అని చెప్పగానే.. అమర్‌ నేను ఆర్మీ నువ్వు కాదు అని చెప్పగానే.. బుజ్జమ్మ కల్పించుకుని ఏంటి ఆంటీ నేను హస్కీగా మాట్లాడి మేనేజ్‌ చేద్దామనుకుంటే మీరు వచ్చి గట్టిగా అరిచి స్పాయిల్‌ చేసేశారు అనగానే.. కరుణ ఏం మేనేజ్‌ చేద్దామనుకున్నావు బుజ్జమ్మ అని అడుగుతుంది. దీంతో బుజ్జమ్మ.. అమరేంద్ర సార్‌ వచ్చిన విషయం మా మేడంకు తెలియదు.. మేడం బయటకు వచ్చి  సార్‌ను చూసి సర్‌ఫ్రైజ్‌ అవుతుంది అనుకున్నాను అని చెప్పగానే.. కరుణ మనసులో సర్‌ఫ్రైజ్‌ కాదే షాక్‌ అయ్యేది అనుకుంటుంది.

Advertisement

మీరు అరిచిన అరుపుకు ఇంట్లో మేడం భయపడిపోయి పాల గ్లాసు కింద పడేసినట్టు ఉన్నారు. పదండి సార్‌ నేను రెడీ అయిపోయాను. మీ ఇంటికి వెళ్దాం.. అక్కడి నుంచి నేను అంజు అక్కతో కలిసి స్కూల్‌ కు వెళ్లిపోతాను అని చెప్పగానే.. అమర్‌ అదేంటి మీ మేడంకు చెప్పవా..? అని అడగుతాడు. దీంతో బుజ్జమ్మ బయటి నుంచి చెప్తాను లేండి.. అంటూ కిటికీ వైపు చూస్తూ.. బై మేడం అంటుంది. లోపలి నుంచి మిస్సమ్మ  కూడా బై చెప్తుంది. కరుణ కూడా బై బుజ్జమ్మ అంటూ బ్యాగ్‌ ఇస్తుంది. అమర్‌, బుజ్జమ్మ వెళ్తుంటే.. కిటికీలోంచి చూస్తున్న మిస్సమ్మ మనసులో నన్ను క్షమించండి ఈ అపురూపమైన క్షణాలను మీకు దక్కకుండా చేశాను. ఇక నుంచి ఏదీ మిస్‌ అవ్వనివ్వను అనుకుంటుంది.

అమర్‌, బుజ్జమ్మ గేటు దాటి బయటకు వెళ్లిపోయాక కరుణ లోపలకి వెళ్తుంది. ఓసేయ్‌ ఫోన్‌ ఎక్కడ పెట్టినవ్‌.. ఆయన వస్తుండని చెప్పనీకే ఫోన్‌ చేసిన ఆయన రాక ముందే వస్తారని బుజ్జమ్మ నాతో చెప్పిందే..! అనగానే.. కరుణ నవ్వుతూ.. మరి రక్తసంబంధం అంటే ఏమనుకున్నావు..? ఆ మాత్రం సిక్స్‌ సెన్స్‌ ఉంటుందే అని చెప్పగానే.. మిస్సమ్మ కూడా హ్యాపీగా నేనే బుజ్జమ్మను ఆ ఇంటికి పంపిద్దామనుకున్నాను.. ఆయనే వచ్చారు.. నాకు చాలా సంతోషంగా ఉందే.. అంటుంది. నీకు హ్యాపీడేస్‌ స్టార్ట్ అయిపోయినయ్‌ భాగీ అతి త్వరలోనే మీరు అందరూ కలిసి పోతారని అనిపిస్తుందే.. అని చెప్పగానే మిస్సమ్మ హ్యపీగా ఫీలవుతుంది..

Advertisement

తర్వాత అమర్‌ ఒక వ్యక్తిని ఇంటికి తీసుకొస్తాడు. ఆ వ్యక్తి ఒక పద్ద డబ్బా పట్టుకుని వస్తాడు. అందరినీ హాల్లోకి పిలుస్తాడు అమర్‌. అందరూ వచ్చాక మనుషుల మీద జంతువులు, పక్షులు యాక్సిడెంటల్‌గా దాడులు చేస్తాయి. ఒక్కోసారి ఇంటెన్షనల్‌ గా కూడా దాడి చేస్తాయి. అమ్ము ఫైవ్‌ ఇయర్స్‌ బ్యాక్‌ నీ మీద ఒక రోజు కుక్క, ఇంకొక్క రోజు రాబంధు దాడి చేశాయి కదా.. అని అడగ్గానే.. అమ్ము అవును డాడ్‌ అంటుంది. దీంతో చంభా, మనోహరి ఒకరి ముఖం ఒకరు చూసుకుని భయపడుతుంటారు. ఇంతలో అమర్‌ స్టార్‌ చేయండి అని ఆ వ్యక్తకి చెప్పగానే.. ఆయన తనతో తీసుకొచ్చిన డబ్బాను తెరచి అందులోని చిలుకకు సైగ చేస్తాడు. వెంటనే ఆ చిలుక బయకు ఎగురుకుంటూ వచ్చి చంభా మీద దాడి చేస్తుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అప్పుడే నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×