E-Paper
Advertisement

Nindu Noorella Saavasam Serial Today February 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి కరెంట్ షాక్ ఇచ్చేందుకు మిస్సమ్మ ప్లాన్ 

Nindu Noorella Saavasam Serial Today February 28th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మనోహరికి కరెంట్ షాక్ ఇచ్చేందుకు మిస్సమ్మ ప్లాన్ 
Advertisement

Nindu Noorella Saavasam Serial Today Episode:  

మనోహరి, చంభాను పిలిచి తనకు మిస్సమ్మ మీద ఎందుకో అనుమానంగా ఉందని చెప్తుంది. దీంతో చంభా ఇప్పుడు నువ్వు కరెక్టుగా ఆలోచిస్తున్నావు మనోహరి అంటుంది. దీంతో మనోహరి ఎందుకైనా మంచిది స్విచ్‌ బోర్డు దగ్గర నువ్వే ఉండు అమర్ రాగానే స్విచ్‌ ఆన్‌ చేసి ఆఫ్‌ చేసేయ్‌ అప్పుడు నేను సేఫ్‌గా ఉంటాను అని చెప్పగానే.. సరే అంటుంది చంభా. ఇంతలో రాథోడ్, మిస్సమ్మ అక్కడికి వచ్చి వీళ్లద్దరూ మాట్లాడుకున్నది వింటారు. వాళ్లను చూసిన మనోహరి, చంభా షాక్‌ అవుతారు. వెంటనే ఏమీ తెలియనట్టు మనోహరి కూల్‌గా భాగీ నువ్వు ఎప్పుడొచ్చావు అని అడుగుతుంది. మిస్సమ్మ కోపంగా ఏంటి మనోహరి ఇది నీ కోసం నేను నా భర్తనే త్యాగం  చేస్తుంటే.. నువ్వు నన్ను అనుమానిస్తున్నావా..? అని అడుగుతుంది.

దీంతో మనోహరి అది కాదు భాగీ అంటుంటే.. మిస్సమ్మ మాత్రం నిన్ను చంపితే నాకేం వస్తుంది మనోహరి.. నేను మరీ అంత దుర్మార్గురాలిని దుష్టురాలిని అనుకున్నావా..? నాలో ఒక సైకో, ఒక కిల్లర్ ఉన్నారు అనుకున్నావా..? అనగానే.. మనోహరి అది కాదు భాగీ అంటుంటే.. మిస్సమ్మ కోపంగా వద్దు మనోహరి.. మనం పాలు నీళ్లలా కలిసిపోదాం అనుకున్నాం.. కానీ నువ్వు నన్ను విషంలా చూస్తున్నావు.. నేను ఫీలయ్యాను.. నేను హర్ట్‌ అయ్యాను.. అంటుంటే రాథోడ్‌ కూడా ఏదైనా ఫెయిర్‌గా ఉండాలి. మిస్సమ్మ మీకు అంత నిస్వార్థంగా సేవ చేస్తుంటే.. మీరు తనను అనుమానిస్తారా..? తప్పు కదా..? అంటాడు. దీంతో మనోహరి సారీ భాగీ నేను తప్పు చేశాను. క్షమించు ఇదిగో ఈ యాదమ్మ నా బ్రెయిన్‌లో పురుగులాగా దూరిపోయి ఏదేదో చెప్తుంది. అందుకే.. అంటూ ఆగిపోగానే.. మిస్సమ్మ ఆ అందుకే ఏంటో చెప్పు… వద్దు వద్దు ఇదంతా వద్దు ఆ స్విచ్‌ ఏదో యాదమ్మనే వేయమని చెప్పు అనగానే.. చంభా షాక్‌ అవుతుంది.

Advertisement

మనోహరి మాత్రం అయ్యో పర్వాలేదు భాగీ.. ఆ  స్విచ్‌ నువ్వే ఆన్‌ చేసి ఆఫ్‌ చేయ్‌ అంటుంది. దీంతో మిస్సమ్మ  వద్దు మనోహరి ఆ పని యాదమ్మ చేస్తుంది. నేను ఒక పక్కన ఉండి ప్రేక్షకురాలిగా చూస్తాను అంటూ చెప్పి వెళ్లిపోతుంది మిస్సమ్మ.. దీంతో మనోహరి కోపంగా అయ్యో భాగీ భాగీ అంటూ చూశావా యాదమ్మ అనవసరంగా భాగీని అనుమానించావు.. నువ్వు వెళ్లు అమర్‌ కిందకు రాగానే.. స్విచ్‌ ఆన్‌ చేసి నాకు షాక్‌ తగలగానే.. ఆఫ్‌ చేయ్‌ అని చెప్తుంది. రాథోడ్‌ కూడా యాదమ్మ మనోహరి గారు వైర్‌ పట్టుకోగానే.. స్విచ్‌ ఆఫ్‌ చేయ్‌ లేదంటే మనోహరి గారి ఫోటోకు దండ వేయాల్సి వస్తుంది అంటూ చెప్పి వెళ్లిపోతాడు. దీంతో చంభా భయంగా వీళ్లు ఇంత ఈజీగా నా చేతికి స్విచ్‌ ఇచ్చారంటే.. ఇందులో ఏమన్నా తిరకాసు ఉందా..? అని మనసులో అనుకుంటుంటే.. మనోహరి కోపంగా యాదమ్మ వెళ్లు అమర్‌ సడెన్‌గా కిందకు వచ్చేస్తాడు యాదమ్మ వెళ్లూ అంటూ కోప్పడుతుంది.

చంభా మాత్రం మనసులో తీనికి మచి చెబితే అర్థం కాదు ఏం జరిగితే అది జరగని నాదేం పోయింది అనుకుంటూ సరే వెళ్తున్నాను అంటూ వెళ్లిపోతుంది. బయటకు వెళ్లిన మిస్సమ్మ, రాథోడ్‌.. నవ్వుకుంటారు.. రాథోడ్ నవ్వుతూ.. నువ్వు చెప్పిన మాటలను ఆ బకరా నమ్మేసింది మిస్సమ్మ అంటాడు.. కానీ ఆ యాదమ్మ నమ్మలేదు కదా రాథోడ్ అంటుంది. ఆ యాదమ్మ నమ్మకపోతే ఏంటి..? స్విచ్‌ ఆన్‌  చేయటం వరకే వాళ్ల చేతిల్లో ఉంది. ఆఫ్‌ చేయటం లేదు కదా..? ఎందుకంటే మనం వైరింగ్‌ మార్చేశాం కదా అంటాడు.  దీంతో మిస్సమ్మ అలా అని అది షాక్‌లో చచ్చేలా చేయకు రాథోడ్‌.. అంటుంది. దీంతో రాథోడ్‌ కోపంగా చూస్తూ.. ఆ పాపిని అత ఈజీగా చావనిస్తానా..? బతికి ఉండగానే.. నరకం చూపించాలి అంటాడు ఇంతలో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

Advertisement

 

Related News

అర్థరాత్రి 2 గంటలకి ఆయన..కంటతడి పెట్టుకున్న జబర్దస్త్ వర్ష!

ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ప్రముఖ సీరియల్ నటి.. జీవితంలో అంతకంటే నరకం మరొకటి లేదు!

ఘోరంగా అవమానించారు.. స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న సీనియర్ హీరోయిన్ రాశి!

గృహహింస కేసు పెట్టిన ప్రముఖ బుల్లితెర నటి.. అసలేమైందంటే?

బిగ్ బాస్ ‘అగ్నిపరీక్ష’ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించిన కళ్యాణ్ పడాల.. వీడియో వైరల్!

Nindu Noorella Saavasam Serial Today Episode August 3rd ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్రచండతో కలిసి కొత్త ప్లాన్‌ చేసిన మనోహరి  

Karthika Deepam 2 Serial Today Episode August 3rd ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: సూరజ్ గురించి నిజాలు తెలుసుకున్న శివనారాయణ, కార్తీక్     

Gundeninda GudiGantalu Today episode: మీనాను ఘోరంగా అవమానించిన ప్రభావతి.. మనోజ్ కు ముఖేష్ షాక్.. ఎపిసోడ్ కు హైలెట్ సీన్…

Big Stories

Advertisement
×